ప్రస్తుతం హై ఎండ్ ఫోన్స్ లో బాగా వినపడుతున్న ఫోన్ మోడల్, S6 ఎడ్జ్ ప్లస్, ఇది గత వారం రిలీజ్ అయ్యింది. దీని ధర 57,990 రూ. దీనితో పాటు నోట్ 5 మోడల్ కూడా లాంచ్ చేసింది సామ్సంగ్. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ వేరియంట్స్ లో సేల్ అవుతుంది ఎడ్జ్ ప్లస్. మేము లాంచ్ ఈవెంట్ లో పాల్గొని మీకు సామ్సంగ్ S6 ఎడ్జ్ ప్లస్ పై మొదటి అభిప్రాయాలు తెలియజేయటానికి ఈ స్లైడ్ షో. నెక్స్ట్ స్లైడ్ కు వెళ్లండి.
ముందుగా క్విక్ స్పెక్స్...
SoC: Exynos 7420
RAM: 4GB LPDDR4
డిస్ప్లే: 5.7 అంగుళాల qHD
నిల్వ: 32GB
కెమెరా: 16MP మరియు 5MP
బ్యాటరీ: 3000mAh
OS: Android లాలిపాప్ 5.1
5.7 సూపర్ ఎమోలేడ్ క్వాడ్ HD డిస్ప్లే క్రిస్పీ అండ్ ప్లేసంట్ గా ఉంది.వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. గ్రేట్ కలర్స్, కాంట్రాస్ట్ టాప్ notch
ఇప్పుడు ఫేవరేట్ యాప్స్ అండ్ కాంటాక్ట్స్ ను ఎడ్జ్ స్క్రీన్స్ లో పెట్టుకోవచ్చు. దీనిని "స్వైప్ ఫ్రొమ్ ఎడ్జ్" gesture అని పిలుస్తుంది సామ్సంగ్.
క్రింద ఫిజికల్ బటన్ లో ఇప్పుడు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. స్కానింగ్ accuracy కూడా బాగుంది. S6 లో ఉన్న ప్రొసెసర్ దీనిలో కూడా జోడించింది కంపెని. అంటే పెర్ఫార్మన్స్ లో మళ్ళీ టాప్ ప్లేస్ లో ఉంది సామ్సంగ్.
డ్యూయల్ ఎడ్జ్ డిస్ప్లే తో ఉన్న ఈ ఫోన్ సింగిల్ ఎడ్జ్ డిస్ప్లే తో వస్తున్న S6 ఎడ్జ్ మొదటి మోడల్ వలె ఉంది. మెటల్ మరియు గ్లాస్ బిల్డ్ తో వస్తుంది ఫోన్. చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ మరియు చేతిలో చాలా తెలికిగా కూడా ఉంది. సామ్సంగ్ గేలక్సీ S6 యొక్క కంప్లీట్ రివ్యూ ను గతంలో అందించాము. చూడని వారు ఈ లింక్ లో చూడగలరు.
S6 ఎడ్జ్ లో ఉన్న కెమేరా సెన్సార్ దీనిలో ఉంది. కాని సాఫ్ట్ వేర్ పరంగా కెమెరాలో ఫీచర్స్ యాడ్ చేసింది దీనిలో. అంటే వరల్డ్ బెస్ట్ కెమేరా స్మార్ట్ ఫోన్ అనే ప్లేస్ ను సామ్సంగ్ మళ్ళీ కాపాడు కుంది. అలాగే యుట్యూబ్ లో లైవ్ స్ట్రీమింగ్ ను native గా సపోర్ట్ చేస్తుంది.
వైర్ లెస్ చార్జింగ్ తో వస్తుంది. 3,500 రూ లకు కొత్త వైర్ లెస్ చార్జింగ్ పరికరం కూడా ఆఫర్ చేస్తుంది. 120 నిముషాలలో ఫోన్ ను చార్జ్ చేస్తుంది. ఫిజికల్ కేబుల్స్ ద్వారా కూడా చార్జింగ్ స్పీడ్ గా చార్జ్ అయ్యేలా సామ్సంగ్ ఇంప్రూవ్ చేసిందని చెబుతుంది.
దీనికి కీ హార్డ్ వేర్ కీ బోర్డ్ కూడా ఉంది. దీని ధర 3,599 రూ. దీనితో పాటు S6 ఎడ్జ్ ప్లస్ కు కేసెస్ మరియు కవర్స్ కూడా రిలీజ్ చేసింది.