ఇండియాలో సామ్సంగ్ J series highest సెల్లింగ్ సామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్. ఈ సిరిస్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఇదే పేర్లతో కంపెని 2016 మోడల్స్ ను రిలీజ్ చేసింది ఇండియాలో. స్పెక్స్ తో పాటు ఫోన్ చుట్టూ మెటల్ బాడి అప్ గ్రేడ్ అయ్యింది కొత్త మోడల్స్ లో. సో లాస్ట్ ఇయర్ కన్నా ఇవి బెటర్ గా ఉన్నాయి. కానీ కరెంట్ మార్కెట్ లో మిగిలిన కంపెనీల ఫోనుల కన్నా బెటర్ మోడల్స్ ఆ ఇవి అనేది ప్రశ్న. దీనికి సమాధానం వీటిని రివ్యూ చేసినప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతానికి వీటి differences అండ్ ఇమేజెస్ చూడండి. క్రిందకు స్క్రోల్ చేయండి చూడటానికి.
Samsung Galaxy J7 తో మొదలు పెడితే.. ఇది రెండింటిలో పెద్ద మోడల్, అలాగే రెండింటిలో ఇదే ఎక్కువ ప్రైస్ తో వస్తుంది. ఇక్కడ క్విక్ స్పెసిఫికేషన్స్ చూడండి..
Samsung Galaxy J7 లో 5.5-inch Super AMOLED display ఉంది. ఇది 1280 x 720p resolution అండ్ 267ppi pixel density తో వస్తుంది.
J7 కు కూడా ఫుల్ మెటల్ బాడీ ఉంది. దీని వలన గెలాక్సీ A7 లా కనిపిస్తుంది మొబైల్.. క్రింద సేమ్ సామ్సంగ్ ఫిజికల్ బటన్స్ ఉన్నాయి.
వెనుక పనెల్ పై అడ్డంగా brush ఫినిషింగ్ ఉంటుంది. అలాగే పైన 13MP రేర్ కెమెరా లెన్స్ అండ్ LED ఫ్లాష్ ఉన్నాయి.
ఇది J7 లోని కెమెరా యాప్. సింపుల్ గా ఉంది, అలాగే నార్మల్ యూసర్ కు అవసరం అయ్యే ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ లో మీరు 1080P ఫుల్ HD వీడియోస్ ను షూట్ చేయగలరు 30fps తో (30 ఫ్రేమ్స్ పర్ సెకెండ్)
ఇది Samsung Galaxy J5 మోడల్. రెండింటిలో ఇదే తక్కువ ప్రైస్ కు వస్తుంది. కంప్లీట్ మెటల్ తో రావటం లేదు ఈ మోడల్ కాని చుట్టూ ఫ్రేమింగ్ మాత్రం మెటల్ ఉంటుంది.