లేటెస్ట్ గా సామ్సంగ్ అనౌన్స్ చేసిన J5 మరియు J7 మోడల్స్ గురించి మీకు తెలియజేశాము. గేలక్సీ J5 ధర 11,999రూ, గేలక్సీ J7 ధర 14,999 రూ. ఈ రెండు మోడల్స్ యొక్క ఫస్ట్ ఇంప్రెషన్స్ ను ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ కు వెళ్లండి.
ఇది గేలక్సీ J7. రెండింటిలో పెద్దది.
Key Specs -
SoC: Exynos 7580
ప్రాసెసర్: 1.5GHz ఎనిమిదో కోర్
RAM: 1.5GB
డిస్ప్లే: 5.5 అంగుళాల 720p
నిల్వ: 16GB
కెమెరా: 13MP మరియు 5MP
బ్యాటరీ: 3000mAh
170 గ్రా బరువుతో కొంచెం బరువుగా అనిపిస్తుంది ఫోన్. లార్జ్ స్క్రీన్ పాత గేలక్సీ గ్రాండ్ ను గుర్తుకుతెస్తుంది.
సామ్సంగ్ లోని A సిరిస్ ఫోనులు మెటల్ మరియు ప్లాస్టిక్ షెల్ తో వస్తే, J సిరిస్ ఫోనులు మొత్తం ప్లాస్టిక్ తోనే వచ్చాయి. బ్యాక్ ప్యానల్ కూడా రిమూవబాల్.
left సైడ్ వాల్యూమ్ రాకర్ ఉంది. కాని ఫోన్ సైజు కు తగ్గ సైజులో దీనిని అమర్చలేదు.
రైట్ సైడ్ పవర్/లాక్ బటన్ ఉంది. సైడ్ ప్యానల్స్ లో మెటల్ ను వాడింది పాత సామ్సంగ్ మోడల్స్ వలె.
5.5 in సూపర్ ఏమోలేడ్ షార్ప్ కాంట్రాస్ట్ మరియు గుడ్ వ్యూయింగ్ యాంగిల్స్ తో డిస్ప్లే 720P HD తో వస్తుంది.
ఫ్రంట్ లో 5MP LED ఫ్లాష్ కెమేరా ఉంది.
సేం ఓల్డ్ సామ్సంగ్ టిపికల్ నేవిగేషన్ బటన్స్ ఉన్నాయి ఫోన్ క్రింది భాగంలో. హోం బటన్ ఫీడ్ బ్యాక్ వీక్ గా ఉంది. మిగిలిన రెండు సాఫ్ట్ టచ్ బటన్స్.
వెనుక 13MP కెమేరా ఉంది. initial ఇంప్రెషన్స్ ప్రకారం బ్యాక్ కెమేరా బాగుంది అని చెప్పాలి. ఫోటో తీయటం కొంచెం లాగ్ అవుతుంది. కాని ఓవర్ ఆల్ క్వాలిటి బాగుంది. ఒకసారి దీనిని రివ్యూ చేశాక, అంతా స్పష్టం గా తెలియజేస్తాము.
ఆండ్రాయిడ్ 5.1.1 లాలిపాప్ మరియు సామ్సంగ్ కొత్త టచ్ విజ్ UI పై రన్ అవుతుంది ఫోన్. Bloatware మినిమల్ గా ఉంది. ఓవర్ ఆల్ ఇంటర్ఫేస్ స్మూత్ గా ఉంది. కంపెని ఈ రెండు ఫోనుల పై చేస్తున్న గేమింగ్ ప్రచారం ను పరిగణలో తీసుకోని చుస్తే J7 ఫోనులో గేమింగ్ పెర్ఫార్మన్స్ కూడా trustworthy గా ఉంది.
ఇది సామ్సంగ్ గేలక్సీ J5. ఇది రెండింటిలో చిన్న డిస్ప్లే కలిగిన ఫోన్.
Key Specs -
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 410
ప్రాసెసర్: 1.2GHz క్వాడ్-కోర్
RAM: 1.5GB
డిస్ప్లే: 5 అంగుళాల 720p
నిల్వ: 8GB
కెమెరా: 13MP మరియు 5MP
బ్యాటరీ: 2600mAh
ఫోన్ అంతా దాదాపుగా ప్లాస్టిక్ ఉంది. రిమూవబాల్ బ్యాక్ ప్యానల్, బటన్స్ అన్ని J7 వలె ఉన్నాయి.
J5 150 గ్రా బరువు ఉంది. ఈ కేటగిరి లో ఉండే ఫోనుల్లో ఇది ఎక్కువ బరువుతో వస్తుంది. అయితే 5in స్క్రీన్ అవటం వలన చేతిల్ప్ పట్టుకోవటానికి కొంచెం ఈజీగా అనిపిస్తుంది.
5 in 720P సూపర్ ఏమోలేడ్ గుడ్ వ్యూయింగ్ యాంగిల్స్ మరియు షార్ప్ నెస్ డిస్ప్లే ఉంది J5 లో కూడా
గెలాక్సీ J5 కూడా J7 వలె సేం కెమేరా సేన్సార్స్ ఉన్నాయి. 13MP బ్యాక్, 5MP ఫ్రంట్. స్పెక్స్ వైజ్ గా రెండు ఒకలా ఉన్నాయి. ఉన్న ఒకే డిఫరెన్స్ J5 కు J7 కన్నా చిన్న బ్యాటరీ.