720P HD సూపర్ అమోలేడ్ డిస్ప్లే తో శామ్సంగ్ J3 అనే బడ్జెట్ హాండ్ సెట్ ను రిలీజ్ చేసింది ఇండియాలో మొన్న. దీనిలో బైక్ పై వెళ్ళేటప్పుడు కాల్స్ ను హేండిల్ చేయటానికి ప్రత్యేకమైన ఫీచర్స్ అందిస్తుంది కంపెని. స్నాప్ డీల్ లో మాత్రమే 8,999 రూ లకు సేల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ క్విక్ డిజైన్ అండ్ ఫీచర్స్ చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి.
శామ్సంగ్ గెలాక్సీ J3 బడ్జెట్ మార్కెట్ ను ఆకర్షించే విధంగా 8,999 ప్రైస్ లో వస్తుంది. ఇక్కడ క్విక్ స్పెక్స్ చూడండి ముందుగా.. డిస్ప్లే: 5-inch, 720p SoC: 1.2GHz, quad-core RAM: 1.5GB Storage: 8GB Camera: 8MP, 5MP Battery: 2600mAh OS: Android 5.1.1
ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ తో పని చేసే S Bike Mode అనే ఫీచర్ ను బాగా హై లైట్ చేస్తుంది కంపెని. దీనితో పాటు NFC ట్యాగ్ ఇస్తుంది శామ్సంగ్. దానిని మీ 2 వీలర్ కు తగిలించి డ్రైవ్ చేస్తే, కాల్స్ వచ్చినప్పుడు ఆక్టివేట్ అవుతుంది. ఆక్టివేట్ అంటే కాల్స్ వచినప్పుడు చేసిన వ్యక్తులకు ఆటోమేటిక్ గా ప్రీ రికార్డెడ్ మెసేజ్ వెళ్తుంది. ఈ మెసేజ్ ను 14 ఇండియన్ భాషలలో కూడా పంపగలరు. ఎమర్జెన్సీ అయితే NFC టాగ్ IVR ను పంపకుండా కూడా బైపాస్(వాడకపోవటం) చేయగలరు 1 ప్రెస్ చేసి.
సూపర్ అమోలేడ్ 720P HD డిస్ప్లే ఉంది, కాని డైరెక్ట్ సన్ లైట్ లో స్క్రీన్ లో ఏమీ కనపడటం లేదు. దీనికి తోడూ స్క్రీన్ పై ఫింగర్ ప్రింట్స్ ఎక్కవుగా కనపడుతున్నాయి. ఇదే శామ్సంగ్ లో ఇంతకన్నా బెటర్ డిస్ప్లేలు ఉన్నాయి.
సేమ్ అన్ని ఫోనుల వలె, రెండు కేపాసిటివ్ నేవిగేషన్ బటన్స్ మరియు ఒక ఫిజికల్ హోమ్ బటన్.
సైడ్స్ లో మెటల్ railing మరియు వెనుక faux leather బ్యాక్ ఉంది. ఇది రిమూవబుల్. లోపల 2600 mah బ్యాటరీ ఉంది.డ్యూయల్ సిమ్ స్లాట్స్ తో dedicated మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంది.fa
సింగిల్ led ఫ్లాష్ తో వెనుక 8MP రేర్ కెమేరా మరియు ఫ్రంట్ లో 5MP కెమేరా కలిగి ఉంది.