jio 2016 సెప్టెంబర్ నెల మార్కెట్ లో 4జి సేవలు ప్రారంభించి ఒక చరిత్ర సృష్టించింది. మిగతా
టెలికాం సంస్థలని కోలుకోలేని దెబ్బకొట్టి వాటికి నిద్రలేకుండా చేసింది. కానీ
జియో ను ఎలాగైనా ఆపాలనే దృఢ నిశ్చయం తో ట్రాయ్ కు కూడా కంప్లైంట్ చేశాయి. కానీ ఆశాజనకం గా
ట్రాయ్ తీర్పు jio కి ఫేవర్ గా రావటంతో ఏమిచేయలేని పరిస్థితి లో ఇక
ప్రజలమీద ఎనలేని ప్రేమ ను కురిపించాయి . అది ఎలాగంటే
ముందెన్నడూ లేనివిధముగా చీప్ కాస్ట్ కి డేటా ప్లాన్స్ మరియు ఫ్రీ వాయిస్ కాల్స్ వంటి వాటివన్నీ ప్రవేశపెట్టి
ఎలాగైనా తమ యూజర్స్ ని తమవైపు లాక్కునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి. కానీ అనుకోనివిధముగా
జనం గుండెల్లో చెక్కు చెదరని ముద్ర వేసుకుంది. ఆ ప్రయాణం లో భాగంగానే
రిలయన్స్ జియో ఇటు ఫీచర్ ఫోన్ మార్కెట్‌ను కూడా కీలకంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరియు
రూ.990 నుంచి రూ.1500 రేంజ్‌లో 4G VoLTE ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్లాన్స్ వేస్తోంది. jio ఫ్రీ ఆఫర్స్ ముగుస్తున్నాయని చింతించాలిసిన అవసరం లేదు.
jio ప్రైమ్ మెంబర్షిప్ కి అప్గ్రేడ్ అయ్యి ఇప్పుడున్న లాభాలనే పొందవచ్చు.