గతకొంతకాలంగా ఎయిర్టెల్ ఫాస్టెస్ట్ నెట్వర్క్ అనేక యాడ్స్ వస్తున్నాయి ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ దేశం లో తమదే ఫాస్టెస్ట్ నెట్వర్క్ అని ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోందని ,లేని లేని పబ్లిసిటీ ని క్రియేట్ చేసి జనాన్ని సందిగ్ధం లో పడవేస్తోందని jio తీవ్ర ఆరోపణలను చేసింది.
మరియు ఎయిర్టెల్ పై jio తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తోంది,బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ టెస్టర్ ఉక్లా తో కుమ్మక్కయి ఎయిర్టెల్ తప్పుడు ప్రకటనలు చేస్తోందని ఆరోపణలు చేస్తోంది. ఈ విషముగా ఎయిర్టెల్ ఫై "Advertising standards council of india " కు కంప్లైంట్ చేసింది
ఈ కంప్లైంట్ తరువాత ఉక్లా ఫై కేసు పెట్టటానికి నుడా సిద్ధపడింది.
అయితే ఆశ్చర్యకరంగా రిలయన్స్ jio మరొక సారి తన సత్తా ఏంటో చాటి చెప్పింది.
మొత్తం ఇండియా లో అత్యధిక వేగం డేటా బదిలీ (4జీ) సేవల్లో రిలయన్స్ జియోదే టాప్ ప్లేస్ అని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా రిపోర్ట్స్ ద్వారకా నిరూపణ అయ్యింది
మార్చ్ నెలలో Reliance Jio యొక్క 4G డౌన్లోడ్ స్పీడ్ అన్నిటికంటే ఎక్కువ అని మరియు ఫిబ్రవరి లో కూడా స్పీడ్ అన్నిటికంటే ఎక్కువ అని తేలింది .
ఇప్పుడీ అన్నిటి స్పీడ్ ఎంతంత తేలిందో చూడండి
భారత్ లో Jio 4G యొక్క సగటు డౌన్లోడ్ స్పీడ్ 16.487Mbps గా వుంది . Jio తరువాతి స్థానం Idea ది రెండవ స్తానం లో నిలిచింది, Idea యొక్క సగటు డౌన్లోడ్ స్పీడ్ 12.092Mbps గా తెలిపింది , అదే విచిత్రముగా Airtel ఈ పోటీలో 3 వ ప్లేస్ లో నిలిచింది.
దీని యొక్క సగటు డౌన్లోడ్ స్పీడ్ 10.439Mbps గా తేలింది.
అన్నికంటే ఆఖరు Vodafone దీని యొక్క సగటు డౌన్లోడ్ స్పీడ్ చూస్తే కనుక 7.933Mbps గా వుంది. మరియు ఆఖరుగా Reliance Communications 2.958Mbps వేగం తో లాస్ట్ ప్లేస్ లో నిలిచింది .
అల్లాగే మీకు తెలిసినట్లుగా , Reliance Jio తమ Jio Prime Membership ఆక్టివిటీ డేట్ ను పొడిగించింది