అనిల్ అంబానీ సొంతమైన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) తనకి వచ్చిన నష్టాలను దృష్టిలో పెట్టుకుని మంచి ఇంట్రెస్టింగ్ ప్లాన్లను మార్కెట్లో ప్రకటించింది.
అందులో మొదటిది ఈ ప్లాన్ ధర రూ.148 ప్లాన్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్లోని ఓ రిటైలర్ ఇచ్చిన సమాచారం అనుసారం రిలయన్స్ కమ్యూనికేషన్స్ త్వరలోనే కొత్త యూజర్స్ కోసం రూ.148 ప్లాన్‌ను లాంచ్ చేస్తుందట .
ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 70 రోజులు . ఈ ప్లాన్ కేవలం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని యూజర్లకు మాత్రమే అందుబాటు అని సమాచారం . 70 రోజుల వ్యాలిడిటీతో రానున్న ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 1జీబి 4జీ డేటాతో పాటు రూ.50 టాక్ టైమ్ కూడా ఇస్తుందట .
మరొక రెండు ప్లాన్లను కూడా అంటే రూ.54, రూ.61 ప్లాన్‌ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తుందని సమాచారం. రూ.54 ప్లాన్‌లో 28 రోజుల పాటు రోజుకు 1జీబి 4జీ డేటా మరియు ఈ ప్లాన్‌లో కాల్స్ రిలయన్స్ టు రిలయన్స్ నిమిషానికి ఒక పైసా చెల్లించాలిసి ఉంటుంది . ఒకవేళ మీరు రిలయన్స్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసుకునే కాల్స్‌కు నిమిషానికి 25 పైసలు చెల్లించాలి .
రూ.61 ప్లాన్‌లో మీకు 28 రోజుల పాటు రోజుకు 1జీబి 4జీ డేటా మరియు కాల్స్ రిలయన్స్ టు రిలయన్స్ మధ్య ప్రతి 6 సెకన్లకు ఒక పైసా ఛార్జ్ చేస్తారు .
రిలయన్స్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసుకునే కాల్స్ కు 25 పైసలు ఛార్జ్ చేస్తారు