Xiaomi రీసెంట్ గా Mi Mix పేరుతొ ఫోన్ లాంచ్ చేసిన తరువాత మరలా నవంబర్ 4వ తారీఖున చైనా లో కొత్త స్మార్ట్ ఫోన్ మోడల్స్ లాంచ్ చేసింది. అవి Redmi 4 మరియు Redmi 4A. రెడ్మి 4 కు prime వేరియంట్ కూడా లాంచ్ చేసింది. దీనికి రెడ్మి 4 ప్రో ఎడిషన్ అని మరొక పేరు కూడా ఉంది. మరిన్ని డిటేల్స్ కొరకు క్రిందకు స్క్రోల్ చేయండి.
PRICES:
రెడ్మి 4 - సుమారు 6,900 రూ.
రెడ్మి 4 ప్రైమ్ - సుమారు 8,900 రూ.
రెడ్మి 4A - సుమారు 4,900 రూ
ఇండియన్ రిలీజ్:
రెడ్మి 4 మరియు 4A ఆల్రెడీ ఈ రోజు నుండి చైనా లో ప్రీ సేల్స్ స్టార్ట్ అయ్యాయి. రెడ్మి 4A నవంబర్ 11 నుండి సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి చైనాలో. కంపెని వీటి ఇండియన్ రిలీజ్ ల పై పెదవి విప్పలేదు ఇంకా కాని కచ్చితంగా ఇవి ఇండియన్ మార్కెట్ లోకి వస్తాయి అని అంచనా. అయితే ఈ మధ్యనే రెడ్మి 3S మరియు 3S ప్రైమ్ మోడల్స్ లాంచ్ అవటం వలన, రెడ్మి 4 సిరిస్ మోడల్స్ రావటానికి కొంచెం టైం పడుతుంది అని అంచనా. స్పెక్స్ కొరకు క్రిందకు లేదా నెక్స్ట్ కు స్క్రోల్ చేయండి.
SPECS:
REDMI 4 మరియు 4A prime లో కామన్ గా ఉన్న స్పెక్స్ - మెటల్ unibody డిజైన్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ బ్యాక్, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్స్, 2.5D curved గ్లాస్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 6.0 - MIUI 8 OS, 13MP రేర్ PDAF అండ్ డ్యూయల్ LED ఫ్లాష్ కెమెరా , 5MP ఫ్రంట్ కెమెరా, 4100 mah బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో గోల్డ్, సిల్వర్ అండ్ గ్రే కలర్ తో వస్తున్నాయి. తేడాలు కేవలం SoC, స్టోరేజ్ లలో ఉన్నాయి.
రెడ్మి 4 లో 5 in HD డిస్ప్లే, ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 430 1.4GHz ప్రాసెసర్, 2GB రామ్, 16GB ఇంబిల్ట్ అండ్ 128GB SD కార్డ్ సపోర్ట్, 4G LTE.
రెడ్మి 4 prime లో 5 in ఫుల్ HD డిస్ప్లే, 2GHz ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 625 SoC, 3GB రామ్, 32GB ఇంబిల్ట్ అండ్ 128GB SD కార్డ్ స్టోరేజ్ సపోర్ట్,
Xiaomi redmi 4A స్పెక్స్ - ఇది మూడింటిలో cheapest మోడల్. దీనిలో కూడా హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్, 5 in HD డిస్ప్లే, 1.4GHz క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 425 SoC, 2GB రామ్, 16GB ఇంబిల్ట్ అండ్ 128GB Sd కార్డ్ సపోర్ట్, 4G LTE, infrared sensor, 3120 mah బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 6.0 MIUI 8, ఫింగర్ ప్రింట్ స్కానర్, 13MP PDAF రేర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.