రెడ్మి నోట్ 7 ప్రొ గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Mar 19 2019
రెడ్మి నోట్ 7 ప్రొ గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

షావోమి నుండి ఇండియలో సరికొత్తగా విడుదల చేయబడినటువంటి, రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్, అంతటా అత్యధికమైన ప్రయోజనాలను అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్, మిడ్ రేంజ్ సెగ్మెంట్లో, ఒక ప్రీమియం ఫోన్ స్పెక్స్ అందించడం విశేషంగా చెప్పవచ్చు. అలాగే, దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలను ఇక్కడ మీ కోసం అందిస్తున్నాం.             

రెడ్మి నోట్ 7 ప్రొ గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

1. ఈ రెడ్మి నోట్ 7 ప్రో యొక్క ముఖ్యమైన ఫీచర్ దాని 48mp కేమెరా. ఇది 1.6μm large పిక్సెల్ (4- in-1సూపర్ పిక్సెల్) ఫీచరుతో వస్తుంది. ఈ 1.6μm అనేది లైట్ అబ్సర్బ్ చేస్తుంది  మరియు 4 పిక్సెల్స్ వివరాలను  ఒక పిక్సెల్స్ గా కలెక్ట్ చేసి ఫోటలను ఎక్కువ డీటెయిల్స్ తో మీకు అందిస్తుంది.

రెడ్మి నోట్ 7 ప్రొ గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

2 ఈ 48mp సెన్సర్, జూలై 2018 లో Sony రిలీజ్ చేసిన కెమేరా. ఇది సోనీ CMOS  సెన్సార్, ఇది ఎఫెక్టీవ్ పిక్సెల్ స్పీసిఫికేషన్ పద్దతిని ఉపయోగిస్తుంది. దీనితో, ఇప్పుడు ఈ కెమెరాతో అందమైన మరియు అత్యధిక రిజల్యూషన్ ఫోటోలను షూట్ చేసుకోవచ్చు.

రెడ్మి నోట్ 7 ప్రొ గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

3. రెడ్మి నోట్ 7 ప్రో యొక్క వెనుక భాగంలో, డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది ఒక 48mp మరియు మరొక 5mp కెమెరాలతో జతగా ఉంటుంది, ఇది PDAF ఫేజ్  ఫోకస్  మరియు f / 1.8 అపర్చరుతో ఉంటుంది. దీని 5mp సెన్సార్ AI  మరియు పోర్ట్రైట్ మోడ్ కోసం ఉపయోగపడుతుంది.
 
రెడ్మి నోట్ 7 ప్రొ గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

4. కెమేరా ఫిచర్స్ , ముఖ్యముగా మీరు దీని ద్వారా 4K వీడియో అదికూడా 30fps తోపాటుగా రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే , 1080p పైన 120fps తో స్లో మోషన్ వీడియో రికార్డ్  చేయవచ్చు.

రెడ్మి నోట్ 7 ప్రొ గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

5. ముందు కెమెరా : ఇందులో 13MP సెల్ఫీ కెమేరా ఉంటుంది. ఇది AI బ్యుటిఫై,AI పోర్ట్రైట్ మరియు AI స్టూడియో లైటింగ్ తో పాటుగా ఫేస్ రికగ్నిజెషన్ మోడ్ తో వస్తుంది. 

రెడ్మి నోట్ 7 ప్రొ గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

6. ఈ స్మార్ట్ ఫోన్, నెబ్యులా రెడ్ , నెప్ట్యూన్ బ్లూ మరియు స్పేస్  బ్లాక్, వంటి మూడు గ్రేడియంట్, అంటే మెరిసే రంగులతో  మీకునచ్చే రంగును ఎంచుకునేలా వస్తుంది.      

రెడ్మి నోట్ 7 ప్రొ గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

7. రెడ్మి నోట్ 7 ప్రో,  ఒక తాజా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 2.0 GHz స్పీడ్ తో ఉంటుంది. అలాగే, ఆక్టా-కోర్ మరియు Adreno 612 GPU గ్రాఫిక్స్ తో కలిసి పనిచేస్తుంది. కాబట్టి, హెవీ గేమ్స్ అయినా సరే ఇది సునాయాసంగా హ్యాండిల్ చెయ్యగలదని కంపెనీ చెబుతుంది.      

రెడ్మి నోట్ 7 ప్రొ గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

8. ఇది USB-C పోర్ట్ తో వస్తుంది మరియు 3.5 ఆడియో జాక్ కూడా ఉంటుంది. అంతేకాదు,ఈ USB టైప్-సి పోర్ట్ తో ఇండియాలో వస్తున్న రెడ్మి యొక్క మొదటి ఫోన్ కూడా ఇదే.

రెడ్మి నోట్ 7 ప్రొ గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

9. ఇందులో ఒక పెద్ద 4000mAh వస్తుంది, మరియు ఇది క్విక్ చార్జర్ 4 సపోర్టుతో వస్తుంది. ఇంకా ఇది 5W  ఛార్జర్ తో వస్తుంది.  ఈ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4, అత్యధికంగా, 1 గంట 43 నిమిషాల్లో బ్యాటరీ 100% ఛార్జ్ చేస్తుందని కంపనీ చెబుతోంది. అలాగే, ముందు మరియు వెనుక ఒక కొర్ణింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తున్నా రెడ్మి యొక్క మొదటి  ఫోన్ కూడా ఇదే.     

రెడ్మి నోట్ 7 ప్రొ గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

10. ఇక ధర విషయానికి వస్తే, ఇది రెండు వేరియంట్లలో విడుదలైనది  
 సాధారణ 4GB /64GB వేరియంట్ - రూ.13,999 రూపాయల ధరతో మరియు హై ఎండ్ వేరియంట్ అయినటువంటి 6GB /128GB వేరియంట్ రూ. 16,999 ధరతో ఉంటుంది.