2022 కొత్త సంవత్సరంలో చాలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇండియాలో ప్రారంభించబడ్డాయి. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలు అన్ని కూడా పోటాపోటీగా తమ స్మార్ట్ ఫోన్లను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టాయి. మరి వాటిలో ఎటువంటి టెక్నాలజీ ఉపయోగించబడింది లేదా ఎటువంటి కొత్త ఫీచర్ ఈ ఫోన్లలో అందించబడిందో చూడాలంటే ఈ ఫోన్ల గురించి తెల్సుసుకోవాలి . అందుకే , ఈరోజు మనం ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన స్మార్ట్ ఫోన్స్ మరియు వాటి విశేషాలను తెలుసుకుందాం.
ఈ POCO M4 Pro 4G ఫోన్ 6.4 అంగుళాల FHD+ AMOLED పంచ్ హోల్ డిజైన్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేటుతో కలిగివుంది. ఇది DCI-P3 సపోర్ట్ డిస్ప్లేతో ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G96 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS ఆధారితమైన MIUI 13 స్కిన్ పైన నడుస్తుంది.
ఎం4 ప్రో 4G వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వచ్చింది.
ఈ సెటప్ లో 64ఎంపి ప్రధాన కెమెరాకి జతగా 8ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ ఇచ్చింది. ముందుభాగంలో, 16ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది. పోకో ఎం4 ప్రో స్మార్ట్ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ లో వేలిముద్ర సెన్సార్ ను సైడ్ లో ఇచ్చింది మరియు AI ఫేస్ అన్లాక్ కు కూడా సపోర్ట్ వుంది. ఇందులో డ్యూయల్ స్పీకర్లు కూడా అందించింది.
ఇండియాలో రీసెంట్ గా విడుదలైన Moto Edge X30 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ FHD+ రిజల్యూషన్ అందించగల AMOLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 10-Bit కలర్ HDR10+ సపోర్ట్ మరియు 144 Hz రిఫ్రెష్ వంటి హై ఎండ్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో స్పీడ్ మరియు మల్టి టాస్కింగ్ ను చక్కగా నిర్వహించగల Qualcomm Snapdragon 8 Gen 1 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా ఇంటిగ్రేటెడ్ అడ్రినో 730 GPU గ్రాఫిక్స్ తో వస్తుంది. ఈ శక్తికి జతగా LPDDR5 RAM 8GB ర్యామ్ మరియు UFS 3.1 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది.
ఈ ఫోన్ 50MP OIS ప్రధాన సెన్సార్ కి జతగా 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 2MP సెన్సార్ కలిగిన ట్రిపుల్ కెమెరాతో వచ్చింది. ఈ ఫోన్ లో భారీ 60MP సెల్ఫీ కెమెరా కూడా ముందు భాగంలో వుంది. ఈ Moto ఫోన్ 5000mAh బ్యాటరీని 68W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో అందించింది. ఈ ఫోన్ మార్చ్ 4 న మొదటి సారిగా అమ్మకానికి రానుంది.
ఈ అసూస్ 8z 5G స్మార్ట్ ఫోన్ పంచ్ హోల్ డిజైన్ కలిగిన 5.9 ఇంచ్ AMOLED డిస్ప్లే ని కలిగి వుంది. ఇది FHD+ రిజల్యూషన్, HDR 10+ సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ స్క్రీన్ కు రక్షణగా గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ని కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. ఇది ఆక్టా కోర్ CPU మరియు Adreno 660 GPU తో ఉంటుంది. దీనికి జతగా గరిష్టంగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది.
ఈ ఫోన్ OIS సపోర్ట్ కలిగిన 64MP SonyIMX686 ప్రధాన కెమెరాకి జతగా 12MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ కెమెరాతో వస్తుంది. ముందుభాగంలో, 12MP డ్యూయల్ పిక్స్లల్ కెమెరాని SonyIMX 363 సెన్సార్ తో ఇచ్చింది.ఈ 5G స్మార్ట్ ఫోన్ 4,000mAh బ్యాటరీని 30W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.
iQOO 9 స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన 6.56-అంగుళాల 10-బిట్ AMOLED ప్యానెల్‌ను ఈ ఫోన్ కలిగివుంది. ఇది HDR10+ కి సపోర్ట్ చేస్తుంది మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 888+ చిప్ సెట్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా LPDDR5 + UFS 3.1కాన్ఫిగరేషన్ కలిగిన 12GB ర్యామ్ మరియు స్టోరేజ్ 256 అప్షన్ లను అందిస్తుంది.ఈ ఫోన్ Android 12 ఆధారితమైన FunTouchOs 12 స్కిన్ పైన నడుస్తుంది.
కెమెరా విభాగంలో, 13MP వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 13MP 50mm ప్రొఫెషనల్ పోర్ట్రెయిట్ లెన్స్‌తో పాటు 48MP IMX 598 సెన్సార్‌తో గల రియర్ కెమెరా సెటప్ మరియు ముందు భాగంలో 16MP లెన్స్ ఉంటుంది. ఇందులో, Gimbal స్టెబిలైజేషన్ సెటప్ ను కూడా అందించింది. ఈ ఫోన్ 4,350mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది మరియు ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది.
iQOO 9 స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన 6.78-అంగుళాల 2K E5 AMOLED ప్యానెల్‌ను ఈ ఫోన్ కలిగివుంది. దీనికి తోడు ఈ ఫోన్లో ఇంటెలిజంట్ డిస్ప్లే చిప్ కూడా జతచెయ్యబడింది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ Gen 1 చిప్ సెట్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా LPDDR5 + UFS 3.1కాన్ఫిగరేషన్ కలిగిన 12GB ర్యామ్ మరియు స్టోరేజ్ 256 అప్షన్ లను అందిస్తుంది.ఈ ఫోన్ Android 12 ఆధారితమైన FunTouchOs 12 స్కిన్ పైన నడుస్తుంది.
కెమెరా విభాగంలో, గింబాల్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కలిగిన 50MP GN5 కెమెరాకి జతగా 50MP ఫిష్ ఐ వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు 16MP పోర్ట్రెయిట్ లెన్స్ కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్ తో వుంది మరియు ముందు భాగంలో 16MP లెన్స్ ఉంటుంది. ఈ ఫోన్ 4,350mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది మరియు ఇది 120W ఫ్లాష్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది.
రియల్‌మీ నార్జో 50 స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే 90% స్క్రీన్ టూ బాడీ రేషియో మరియు 180 టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది.ఈ ఫోన్ మీడియాటెక్ Helio G96 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 6GB ర్యామ్ కూడా ఉంది. అదనంగా, ఈ ఫోన్ లో అందించిన డైనమిక్ ర్యామ్ ఎక్స్ ఫ్యాన్షన్ ఫీచర్లతో 5GB వరకు వర్చువల్ జత అవుతుందని కూడా తెలిపింది. అంటే, 6GB + 5GB తో 11GB వరకూ పనితనాన్ని అందించగలదని వెల్లడించింది.
ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP మైన్ సెన్సార్, 2MP మ్యాక్రో సెన్సార్ మరియు 2MP B&W కెమెరాని కలిగి ఉంది. ఇక సెల్ఫీల కోసం 16MP ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ Realme UI 2.0 స్కిన్ పైన Android 11 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ 33W డార్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,000 బిగ్ బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది మరియు స్పీడ్ బ్లూ మరియు స్పీడ్ బ్లాక్ అనే రెండు కలర్ లలో లభిస్తుంది.
టెక్నో స్పార్క్ 8సి స్మార్ట్ ఫోన్ పెద్ద 6.6 ఇంచ్ HD+ రిజల్యూషన్ డాట్ డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ ను 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగివుంటుంది. ఈ ఫోన్ Unisoc T606 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 3GB ర్యామ్ తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ లేటెస్ట్ HiOS 7.6 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది. ఇందులో 3GB ఎక్స్ ప్యాండబుల్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ ని అందించింది. దీని ద్వారా ఇది 6GB వరకూ ర్యామ్ శక్తిని అందిస్తుందని కంపెనీ తెలిపింది.
కెమెరా పరంగా, వెనుక డ్యూయల్ కెమెరా కలిగివుంది. ఇందులో 13MP మైన్ సెన్సార్ మరియు జతగా AI సెన్సార్ ని కలిగివుంటుంది. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 8MP సెన్సార్ సెల్ఫీ కెమెరాను కలిగివుంది. టెక్నో ఈ ఫోన్ ను పెద్ద 5000mAh బ్యాటరీ మరియు సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది.
వివో వి23e 5G స్మార్ట్ ఫోన్ 6.56 ఇంచ్ AMOLED కర్వ్డ్ డిస్ప్లేని FHD+ (2400x1080)రిజల్యూషన్ తో కలిగి వుంది. ఈ డిస్ప్లేలో వేగవంతమైన ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా అందించింది. ఈ ఫోన్ MediaTek Dimensity 810 చిప్‌సెట్ శక్తితో వస్తుంది. ఇది 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ఎంపికలతో లభిస్తుంది. అధనంగా, ఎక్స్ టెండెడ్ RAM 2.0 ఫీచర్ తో 4GB వరకూ వర్చువల్ ర్యామ్ అందుతుంది.
V23e 5G ఫోన్ లో 44MP ఐ AF సెల్ఫీ కెమెరాని అందించింది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 50MP మైన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు 2MP మ్యాక్రో సెన్సార్ కలిగివుంది. ఈ ఫోన్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్, 44W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ కలిగిన 4050mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా Funtouch OS 12 స్కిన్ పైన నడుస్తుంది.
ఈ POCO M4 Pro 5G ఫోన్ పెద్ద 6.6 అంగుళాల FHD+ పంచ్ హోల్ డిజైన్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేటుతో కలిగివుంది. ఇది DCI-P3 సపోర్ట్ డిస్ప్లేతో ఉంటుంది మరియు ఎండలో కూడా చక్కగా కనిపిస్తుంది. ఈ ఫోన్‌లో లేటెస్ట్ మీడియాటెక్ 5G ప్రోసెసర్ డైమెన్సిటీ 810 SoC ని కలిగి వుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన MIUI 12.5 స్కిన్ పైన నడుస్తుంది.
పోకో ఎం4 ప్రో 5G వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఈ సెటప్ లో 50ఎంపి ప్రధాన కెమెరా మరియు 8ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా అందించింది. ముందుభాగంలో, 16ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది. పోకో ఎం4 ప్రో 5G ఫోన్ 5000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించింది. ఈ ఫోన్ లో వేలిముద్ర సెన్సార్ ను సైడ్ లో ఇచ్చింది మరియు AI ఫేస్ అన్లాక్ కు కూడా సపోర్ట్ వుంది.
రియల్‌మీ 9 ప్రో + స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన సూపర్ AMOLED డిస్ప్లేని కలిగివుంది మరియు ఇది 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 920 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 8GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇది 5GB ఎడిషన్ వర్చువల్ RAM కి మద్దతు ఇస్తుంది. ఈ లేటెస్ట్ రియల్ మి ఫోన్ Realme UI 3 స్కిన్ పైన లేటెస్ట్ Android 12 OS పైన నడుస్తుంది.
ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని అందించింది. ఇందులో 50MP మైన్ కెమెరాగా OIS మరియు EIS సపోర్ట్ కలిగిన SonyIMX766 సెన్సార్ ని అందించింది. జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ వున్నాయి. ఈ ఫోన్ 16 MP ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాని కలిగి వుంది. ఈ ఫోన్ కెమెరా కోసం స్ట్రీట్ ఫోటోగ్రఫీ 2.0 ను కూడా జతచేసింది. ఈ ఫోన్ 60W సూపర్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4,500 mAh బ్యాటరీని కలిగివుంది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ మరియు Hi-Res సర్టిఫికేషన్ కలిగి ఉంది మరియు డ్యూయల్ స్పీకర్స్ తో వస్తుంది.
వన్ ప్లస్ యొక్క ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.43 ఇంచ్ Fluid AMOLED డిస్ప్లే ని FHD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఇది P3 డిస్ప్లే మరియు sRGB కి సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఈ డిస్ప్లే HDR 10+ సర్టిఫికేషన్ తో వస్తుంది మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా ఇచ్చింది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 900 ఆక్టా కోర్ ప్రొసెసర్ తో పనిచేస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ మరియు 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది.
ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పు తో వచ్చింది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ లో EIS సపోర్ట్ కలిగిన 64MP ప్రధాన కెమెరా, EIS సపోర్ట్ కలిగిన 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో లెన్స్ ని కలిగి వుంటుంది. ఈ కెమెరా PDAF మరియు CAF వంటి మల్టి ఆటో ఫోకస్ లకు సపోర్ట్ చేస్తుంది. ముందుభాగంలో కూడా EIS సపోర్ట్ కలిగిన 16MP SonyIMX471 సెల్ఫీ కెమెరాని ఇచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన కలర్ OS తో నడుస్తుంది.
రియల్‌మీ 9 ప్రో స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేని కలిగివుంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా అందించింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 8GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇది 5GB ఎడిషన్ వర్చువల్ RAM కి మద్దతు ఇస్తుంది. ఈ లేటెస్ట్ రియల్ మి ఫోన్ డ్యూయల్ 5G సపోర్ట్ తో అవస్తుంది మరియు Realme UI 3 స్కిన్ పైన లేటెస్ట్ Android 12 OS పైన నడుస్తుంది.
ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని అందించింది. ఇందులో 64MP నైట్ స్కెప్ కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ వున్నాయి. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాని కలిగి వుంది. ఈ ఫోన్ కెమెరా కోసం స్ట్రీట్ ఫోటోగ్రఫీ 2.0 సపోర్ట్ ను కూడా జతచేసింది. ఈ ఫోన్ టైప్-C పోర్ట్ తో 33W డార్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీని కలిగివుంది.
Infinix Zero 5G స్మార్ట్ ఫోన్ పెద్ద 6.78 -అంగుళాల FHD + రిజల్యూషన్ గల IPS డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియా టెక్ Dimensity 900 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది మరియు ఇది 8GB మరియు 128GB స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. అంతేకాదు, 5GB వరకూ ఎక్స్ టర్నల్ ర్యామ్ ను కూడా జతచేస్తుంది. ఇందులో, వేగవంతమైన LPDDR5 ర్యామ్ మరియు UFS 3.1 అల్ట్రా ఫాస్ట్ స్టోరేజ్ ని కలిగివుంది.
ఆప్టిక్స్ పరంగా, ఈ ఇన్ఫినిక్స్ 5G ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్-కెమెరా సెటప్ తో వస్తుంది. దీనిలో, ప్రధాన కెమెరా 48MP సెన్సార్ తో అందించింది. దీనికి జతగా 13MP పోర్ట్రైట్ లెన్స్ మరియు 2MP డెప్త్ సెన్సార్ ని జతచేసింది. ఈ కెమరాతో 2X ఆప్టికల్ జూమ్ మరియు 30X డిజిటల్ జూమ్ అందుతుంది.అంతేకాదు, ఈ కెమెరా సిస్టమ్ ను ప్రత్యేకమైన కర్వ్ డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ పెద్ద 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ 6.43 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లే ని కలిగివుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో పాటుగా 1000 నిట్స్ గరిష్ఠ బ్రెట్నెస్ వరకూ అందించగలదు. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G96 ఆక్టా కోర్ ప్రోసెసర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజ్ లను కూడా కలిగివుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11ఆధారితమైన MIUI 13 స్కిన్ పైన నడుస్తుంది.
ఈ ఫోన్ వెనుక క్వాడ్ కెమెరా సెటప్ కలిగివుంది. ఇందులో, 108MP Samsung HM2 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2MP మాక్రో మరియు 2MP డెప్త్ కెమెరాలను జతగా కలిగి ఉంటుంది. ఈ కెమెరాలు FHD లో 30fps వరకూ రికార్డ్ చేయగలదు. సెల్ఫీల కోసం ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది.ఈ 11s ఫోన్ 33W ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీతో వస్తుంది.
Vivo T1 5G స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ FHD+ LCD డిస్ప్లే ని కలిగివుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR10 కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో సెల్ఫీ కెమెరా కోసం పంచ్ హోల్ కటౌట్ ఉంది. ఈ వివో స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G చిప్ సెట్ తో వస్తుంది. ఇందులో టర్బో డిజైన్ మరియు టర్బో కూలింగ్ సిస్టం అందించినట్లు కూడా కంపెనీ తెలిపింది.
ఈ స్మార్ట్ ఫోన్ 50MP ప్రధాన కెమెరా కలిగిన 2MPడెప్త్ + 2MPమ్యాక్రో ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి వుంది. అలాగే. 16MP సెల్ఫీ కేమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ Funtouch 12 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 12 OS తో నడుస్తుంది. ఈ ఫోన్ లో పెద్ద 5000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది.