Xiaomi రెడ్మి 3S prime 8,999 రూ లకు 3GB ర్యామ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది. అదే మోడల్ prime లేకుండా 6,999 రూ లకు ఫింగర్ ప్రింట్ స్కానర్ లేకుండా, 2GB రామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. సో ఈ మోడల్ నిజంగా మంచి ప్రైస్ లో గ్రేట్ స్పెక్స్ మాత్రమే కాకుండా బెస్ట్ పెర్ఫార్మన్స్ కూడా కలిగి ఉంది. కాని ఏ మోడల్ అయినా కొన్ని నెగటివ్ విషయాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఈ ఫోన్ లో అవి ఏమిటో తెలుసుకోగలరు.
చార్జింగ్ time
ఫోన్ కు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. కాని ఫోన్ తో పాటు ఫాస్ట్ చార్జర్ రావటం లేదు. అందువలన ఫోన్ కొన్నప్పుడు బాక్స్ తో పాటు వచ్చిన రెగ్యులర్ చార్జర్ తో చార్జ్ చేస్తుంటే 4000 mah అధిక బ్యాటరీ వలన ఎక్కువ సేపు తీసుకుంటుంది చార్జింగ్ కు. సుమారు 3 1/2 గంటలు తీసుకుంటుంది 0 నుండి 100% చార్జింగ్ కు. అదే లాప్ టాప్ కు కనెక్ట్ చేసి చార్జింగ్ చేసుకుంటే నాలుగు గంటలు పడుతుంది ఈజీగా.
సొల్యూషన్ - ఫాస్ట్ చార్జింగ్ చేసే చార్జర్ కొనటం. లేదంటే ఉన్నదానితో సంతృప్తి పడి నైట్ పడుకునే ముందు పెడితే ఉదయానికి charging ఫినిష్ అవుతుంది. మీరు ఇక్కడ గమనించ వలసిన విషయం ఏంటంటే రెండు రోజులకు ఒక సారి చార్జింగ్ చేస్తే సరిపోతుంది ఏవరేజ్ యూసర్ కు.
Hybrid సిమ్ స్లాట్
ఏదో దీనిని కూడా లిస్టు లో పెట్టాలని పెట్టుకోవటమే కాని ప్రస్తుత మొబైల్ ట్రెండ్స్ లో హైబ్రిడ్ స్లాట్ కాన్సెప్ట్ ప్లస్ కాకపోయినా మరొక చాయిస్ లేదు కాబట్టి దీనినే అలవాటు చేసుకోవాలి. కాని డ్యూయల్ సిమ్ అవసరం డైలీ usage లో బాగా ఉన్న వారు మాత్రం 8,999 rs రెడ్మి 3S prime తీసుకుంటే బెటర్. ఎందుకంటే దానిలో 32GB ఇంబిల్ట్ స్టోరేజ్ ఉంది. 6,999 variant లో 16GB మాత్రమే ఉంది.
Gorilla Glass
కంపెని ఫోన్ లో ఎటువంటి గ్లాస్ ప్రొటెక్షన్ వాడటం లేదు. Xiaomi ను ఈ విషయం పై సంప్రదించగా some nameless ప్రొటెక్షన్ వాడుతుంది అని చెప్పింది కాని అది కేవలం డిఫెండ్ చేసుకోవటానికి చెప్పింది సమాధానం అని నా పర్సనల్ అభిప్రాయం. ఎందుకంటే కంపెని మాత్రం అఫిశియల్ గా ఎటువంటి గ్లాస్ ప్రొటెక్షన్ ఇస్తున్నట్లు ఎక్కడా తెలపలేదు.
సౌండ్
ఫోన్ లౌడ్ స్పీకర్ నుండి వచ్చే సౌండ్స్/సాంగ్స్ అంత బావున్నట్లు అనిపించటం లేదు. ఏదో పేలవంగా ఉంది ఓవర్ ఆల్ సౌండ్. కచ్చితంగా గ్రేట్ అయితే కాదు.కాని చాలామందికి బాగానే అనిపించవచ్చు. మరీ మ్యూజిక్ ను ఇష్టపడే వారికే ఈ డిఫరెన్స్ కలుగుతుంది.
Ram management
Prime లో 3GB ర్యామ్ ఉంది కాని MIUI భారీ customization OS కారణంగా రీసెంట్ యాప్స్ లిస్టు లో కొద్ది యాప్స్ ఉన్నా ఫోన్ free రామ్ 1GB ఉంది 700MB కు వచ్చేస్తుంది.
HD డిస్ప్లే
స్పెక్స్ వైజ్ గా ఫుల్ HD కాకుండా HD ఉంటుంది 9 వేల వేరియంట్ లో కూడా. అయితే రియల్ time లో మీకు డిస్ప్లే లో నాణ్యత లోపం ఎక్కడ కనిపించదు.
ఫైనల్ లైన్ - పైన చెప్పిన రిజన్స్ అన్నీ మీకు తెలియాలి అనేటటువంటి విషయాలు మాత్రమే కాని ప్రైస్ అండ్ ఫోన్ లోని రియల్ కంటెంట్ తో పోలిస్తే పెద్దగా మైనస్ పాయింట్స్ కావు. అంతేకాదు ఫోన్ లో మైనస్ కన్నా పాసిటివ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. అవి కూడా కావాలంటే క్రింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ లింక్ లో ఫోన్ కంప్లీట్ రివ్యూ చూడగలరు.