మార్కెట్ లో గత కొంత కాలం నుండి డ్యూయల్ కెమెరా సెటప్ ఫోన్స్ ఎక్కువగా వస్తున్నాయి . మార్కెట్ లో రెండు రకాల డ్యూయల్ కెమెరా సెటప్ లు వస్తున్నాయి ,మొదటి రకం టెలిఫోటో లెన్స్ కలిగి ఉండటం మరియు రెండవది వైడ్ యాంగిల్ లెన్స్ తో వస్తున్నాయి .
రెండవది, ఒక లెన్స్ కలర్ ఫోటోలు తీస్తుంది మరియు ఇతర బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ తీస్తుంది .ఇటీవల లాంచ్ అయిన iPhone x మరియు iPhone 8 Plus లో కూడా డ్యూయల్ కెమెరా సెటప్ కలదు . అయితే, అనేక Android స్మార్ట్ఫోన్లు కూడా డ్యూయల్ కెమెరా సెటప్ ని కలిగి ఉన్నాయి, వీటిలో Oneplus 5, ఆసుస్ Zenfone Zoom S, జియోనీ A1 ప్లస్ మొదలైనవి.మొదట్లో డ్యూయెల్ రేర్ కేమెరా సెటప్ మార్కెట్లో ఎక్స్పెన్సివ్ డివైజస్లో లభించేది . కానీ ఇప్పుడు బడ్జెట్ సెగ్మెంట్లో కూడా డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ తో స్మార్ట్ ఫోన్స్ మనముందుకు వస్తున్నాయి .
ఇప్పుడు మార్కెట్ లో మీకు Rs. 10,000 బడ్జెట్ లో కూడా మీకు మంచి స్మార్ట్ ఫోన్స్ డ్యూయల్ కెమెరా సెటప్ తో మార్కెట్ లో అందుబాటులో లభిస్తున్నాయి . ఇక్కడ మీకు కేవలం 10 వేలకే డ్యూయల్ కెమెరా సెటప్ తో లభించే స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ మీ కోసం ఇవ్వబడింది . ఆ ఫోన్స్ యొక్క వివరాలు తెలుసుకొనుటకు ఇమేజ్ పక్కనున్న ఏరో క్లిక్ చేయండి .
Micromax Evok Dual Note
ధర : Rs. 9,999
Micromax Evok Dual Note లో మీకు 13MP డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ లభిస్తుంది . దీని తో పాటుగా 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా కలదు . ఈ ఫోన్ లో పవర్ కోసం కంపెనీ 3000 mAh బ్యాటరీ ఇచ్చింది . Micromax Evok Dual Note లో 5.5 ఇంచెస్ డిస్ప్లే లభిస్తుంది . ఈ డిస్ప్లే యొక్క రిజల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్ . మరియు ఇది 7.0 వెర్షన్ ఫై పని చేస్తుంది . దీనిలో 3GB RAM అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వబడింది
Coolpad cool 1 డ్యూయల్ (3GB RAM)
ధర: రూ. 8999
కూల్ పాడ్ కూల్ 1 డ్యూయల్ 3 జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ. 8,999 మరియు ఇది 13MP డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇది 8MP ఫ్రంట్ కెమెరాని కలిగి ఉంది. ఇది Android 6.0 వెర్షన్ ఫై పనిచేస్తుంది. ఇది 4000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వచ్చే 4G VoLTE స్మార్ట్ఫోన్. ఇది 1.8GHz ఆక్టా కోర్ ప్రాసెసర్ కలిగి ఉంది. దీనిలో 5.5 అంగుళాల డిస్ప్లేతో అమర్చారు. ఈ డిస్ప్లే యొక్క రిజల్యూషన్ 1080 x 1920 పిక్సెల్స్.
Lyf Earth 1
ధర: రూ. 8.750
Lyf Earth 1లో, యూజర్ 13MP డ్యూయల్ రేర్ కెమెరాను పొందుతాడు. దీనికి అదనంగా, 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా అందించబడింది. దీనితో పాటు, వినియోగదారుడు 3500 mAh బ్యాటరీ, ఇంకా 1.5 GHz యొక్క ఆక్టా కోర్ ప్రాసెసర్, 3GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లను పొందుతారు. దీనితో పాటు 5.5 అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే యొక్క రిజల్యూషన్ 1080 x 1920 పిక్సెల్స్. ఇది 4G VoLTE ఫీచర్స్ తో అమర్చిన డ్యూయల్ సిమ్ స్మార్ట్ఫోన్.
Zopo Speed X
ధర: రూ. 9.499
మీరు జొపో స్పీడ్ X లో డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ పరిశీలించి ఉంటే, ఇది 13MP డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తుంది. దీనితోపాటు 13MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. దీనితోపాటు, 3GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది. దీనిలో 1.3GHz ఆక్టా కోర్ ప్రాసెసర్ అమర్చారు. ఇది 2680 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 5 అంగుళాల డిస్ప్లేతో ఉంటుంది, దీని రిజల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్.
InFocus Turbo 5 Plus
ధర: రూ. 8999
ఇన్ఫోకస్ టర్బో 5 ప్లస్ లో, కంపెనీ 13MP డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ ని ఏర్పాటు చేసింది. దీనితో పాటు, 5MP ఫ్రంట్ కెమెరాతో ఇది అమర్చబడి ఉంటుంది. దీనితో పాటు 3GB RAM అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది. మరియు దీనిలో పవర్ కోసం 4850 mAh బ్యాటరీ ని ఇచ్చారు . ఇది 1.5 GHz ఆక్టా కోర్ ప్రాసెసర్ కలిగి ఉంది. ఇది 4G VoLTE సపోర్ట్ ను కలిగి ఉంది. ఇది 5.5-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది, ఇది 720 x 1280 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ కలిగి ఉంది.