మనందరికి మన ఫోన్స్ లో లేటెస్ట్ టెక్నాలజీ కావాలి. మరియు చాలా ఫాస్ట్ RAM ను కలిగి ఉండాలని మనం కోరుకుంటాము , మరియు మన ఫోన్ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఎక్కువగా వుండాలనుకుంటాము . మరియు భారీ గొప్ప కెమెరా కూడా ముఖ్యం . స్మార్ట్ఫోన్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ని కలిగి ఉండి , అన్ని ఫీచర్స్ గ్రేట్ గా వుండాలనుకుంటాము . గూగుల్ ఆండ్రాయిడ్ ఒరెయోను ప్రారంభించింది, కానీ ప్రస్తుతానికి మీరు కొన్ని స్మార్ట్ఫోన్లలో మాత్రమే ఈ అప్డేట్ ని పొందుతున్నారు, అయితే ఆండ్రాయిడ్ నౌగాట్ మీకు బడ్జెట్ డివైసెస్ లో కూడా అందుబాటులో ఉంటుంది. మేము ఇక్కడ ఒక స్మార్ట్ ఫోన్ లిస్ట్ ఇస్తున్నాము . ఈ లిస్ట్ లో కేవలం రూ. 10,000 లో ఆండ్రాయిడ్ నౌగాట్ తో భారతదేశం లో లభ్యమయ్యే స్మార్ట్ఫోన్ల డీటెయిల్స్ ఇవ్వబడ్డాయి .
మోటరోలా మోటో E4 ప్లస్
ధర: రూ. 9,999
మోటరోలా Moto E4 ప్లస్ లో, మీరు Android v7.1.1 ఆపరేటింగ్ సిస్టమ్ ని పొందండి. 13MP వెనుక మరియు 5M ముందు కెమెరా అమర్చారు. ఇది 5.5-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది, దీని రిజల్యూషన్ 720 x 1280 పిక్సెల్స్. ఇది 3GB RAM, 32GB స్టోరేజ్ , 5000mAh బ్యాటరీ.
మోటరోలా మోటో సి ప్లస్
ధర: రూ. 6.990
మోటరోలా మోటో సి ప్లస్ లో, యూజర్ ఆండ్రాయిడ్ v7.0 ఆపరేటింగ్ సిస్టంను పొందుతాడు . దీనితో పాటు 8MP వెనుక మరియు 2MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంటుంది. ఇది కూడా 2GB RAM కలిగి ఉంది
పానసోనిక్ ఎలుగ రే 700
ధర: రూ. 9,999
ఈ ఫోన్లో మీరు 13MP వెనుక మరియు 13MP ఫ్రంట్ కెమెరాని ఆండ్రాయిడ్ V7 ఆపరేటింగ్ సిస్టమ్ తో పొందుతారు. ఇది 3GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ను అందిస్తుంది. ఒక 5000 mAh బ్యాటరీ కూడా ఉంది. .
నోకియా 3
ధర: రూ. 8549
నోకియా 3 లో, మీరు ఒక ఆండ్రాయిడ్ V7.0 ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు 2650mAh బ్యాటరిని పొందుతారు . దీనితోపాటు 2GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఇది అమర్చబడి ఉంటుంది.
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ
ధర: రూ. 9,999
ఈ ఫోన్ మార్కెట్లో ఈమధ్యనే ప్రారంభించబడింది. కంపెనీ దీనిలో ఫుల్ వ్యూ డిస్ప్లే ను ఇచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ v7.1.2 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. 3GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది.
ఇన్ఫినిక్స్ నోట్ 4
ధర: రూ. 8999
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ v7.0 లో పనిచేస్తుంది. ఇది 13MP వెనుక మరియు 8MP ఫ్రంట్ కెమెరాని అందిస్తుంది. ఒక 4300mAh బ్యాటరీ అమర్చారు.
ఇన్ఫోకస్ టర్బో 5 ప్లస్
ధర: రూ. 8999
ఈ ఫోన్లో మీరు 13MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని పొందుతారు. ఇది ఆండ్రాయిడ్ V7.0 లో పనిచేస్తుంది. 3GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది.
మైక్రోమ్యాక్స్ యు యునిక్ 2
ధర: రూ. 5999
ఈ ఫోన్ లోని వినియోగదారులు v7.0 ఆపరేటింగ్ సిస్టమ్ ని పొందుతారు. ఇది 13MP వెనుక మరియు 5MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంటుంది. ఒక 2500mAh బ్యాటరీ కూడా ఉంది.
కుల్ట్ గ్లాడియేటర్
ధర: 6,999
ఇది ఆండ్రాయిడ్ v7.0 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. ఇది 3GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది. ఇది 4000mAh బ్యాటరీ కలిగి ఉంది.
మైక్రోమ్యాక్స్ ఇవోక్ డ్యూయల్ నోట్
ధర: రూ. 9,999
ఇది ఆండ్రాయిడ్ v.7.0 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. ఇది కూడా 3000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 3GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అమర్చబడి ఉంటుంది.
మైక్రోమ్యాక్స్ సెల్ఫీ 2 Q4311
ధర: రూ. 7.999
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ v7.0 ఆపరేటింగ్ సిస్టమ్ లో పనిచేస్తుంది. 3000 mAh బ్యాటరీని కలిగి ఉంది. 3GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ని కలిగి ఉంది .
మైక్రోమ్యాక్స్ భారత్ 4
ధర: రూ. 5777
ఈ ఫోన్ లో యూజర్ ఆండ్రాయిడ్ v7.0 ఆపరేటింగ్ సిస్టంని పొందుతాడు. ఇది 2500mAh బ్యాటరీ కలిగి ఉంది. 5MP వెనుక మరియు 5MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.
నుబియా M2 లైట్
ధర: రూ. 9999
ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ V7.0 ఆపరేటింగ్ సిస్టం ఉంది. ఇది 3000 mAh బ్యాటరీ కలిగి ఉంది.4GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది.
Smartron srt.phone
ధర: రూ. 8.990
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ v7.0 ఆపరేటింగ్ సిస్టమ్ లో పనిచేస్తుంది. ఒక 13MP వెనుక మరియు 5MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. 5.5 అంగుళాల డిస్ప్లేతో అమర్చారు.