నిన్న రాత్రి 10 గంటలకు oneplus 3 ఫోన్ విడుదల అయ్యి, అర్థ రాత్రి 12:30 నుండే సేల్స్ మొదలుపెట్టింది కంపెని. అమెజాన్ లో సేల్స్ స్టార్ట్ అయ్యాయి. 12 months ఆఫర్స్ కూడా వస్తున్నాయి ఫోన్ తో పాటు. మరిన్ని డిటేల్స్ అండ్ ఇమేజెస్ కొరకు క్రిందకు స్క్రోల్ చేయండి.
27,999 రూ లకు వస్తున్న సింగిల్ వేరియంట్ Oneplus 3 క్విక్ స్పెక్స్..
అమోలేడ్ panel డిస్ప్లే బాగుంది. thin బెజేల్స్ తో వస్తుంది. అంటే వీలైనంత కాంపాక్ట్ గా ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ తో 2.5D curved గ్లాస్ ఉంది.
7.35mm స్లిమ్ బాడీ. అలెర్ట్ స్లయిడర్ బటన్ అండ్ వాల్యూం బటన్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్. పవర్ బటన్ మరియు SIM tray రైట్ సైడ్ ఉన్నాయి.
బాటం లో usb టైప్ c పోర్ట్ తో పాటు సింగిల్ స్పీకర్ ఉంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా క్రిందే ఉంది. ఫోన్ లో క్విక్ చార్జింగ్ NFC కూడా ఉన్నాయి.
ఇక oneplus sandstone బ్యాక్ panel లేదు. HTC డిజైన్ లా ఫుల్ మెటల్ బాడి ఉంది. unibody మెటాలిక్ బిల్డ్ మంచి ఫీలింగ్ ఇస్తుంది చేతిలో.
16MP IMX298 సోనీ సెన్సార్ ఉంది. ఇదే సెన్సార్ Xiaomi Mi 5 లో కూడా ఉంది.
ఆండ్రాయిడ్ 6.0.1 based Oxygen OS వస్తుంది ఫోన్ తో పాటు. సేమ్ యూజర్ ఇంటర్ఫేస్ మాక్సిమమ్. కొన్ని tweaks యాడ్ అవుతాయి. tweaks అంటే ఫంక్షన్స్ మరియు బాగా పనిచేసలా చేసే మార్పులు.
క్రింద synthetic బెంచ్ మార్క్స్ స్కోర్స్ చూడండి. సాయింత్రం లోపు రివ్యూ కూడా వస్తుంది. ఫోన్ ను మేము గత వారం రోజుల నుండీ వాడటం జరుగుతుంది.