OBI వరల్డ్ ఫోన్ SF1 కంప్లీట్ రివ్యూ

బై Prasid Banerjee | అప్‌డేట్ చేయబడింది Nov 30 2015
OBI వరల్డ్ ఫోన్ SF1 కంప్లీట్ రివ్యూ

OBI బ్రాండ్ నుండి ఆపిల్ మాజీ ఉద్యోగి తయారు చేసిన వరల్డ్ ఫోన్ SF1 మోడల్ 16 gb - 2GB ర్యామ్ వేరియంట్ 11,999 రూ లకు ఇండియాలో సేల్ అవుతుంది. 32gb - 3gb ర్యామ్ ప్రైస్ - 13,999 రూ. ముందుగా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి ఫోన్ కొనటానికి. అయితే ఫోన్ పై మా కంప్లీట్ రివ్యూ చూడటానికి నెక్స్ట్ స్లైడ్ కు వెళ్ళండి లేదా క్రిందకు స్క్రోల్ చేయండి.

OBI వరల్డ్ ఫోన్ SF1 కంప్లీట్ రివ్యూ

బిల్డ్ అండ్ డిజైన్
5 in స్క్రీన్ సైజ్ ఉంది కాని ఫోన్ మాత్రం పెద్దదిగా ఉంది. చాలా మందికి ఫోన్ లుక్స్ నచ్చాయి కాని ఫోన్ చేతిలోకి వచ్చాక చూడటానికి చీప్ గా ఉంది. ఫినిషింగ్ బాలేదు. for eg xiaomi లా ఉండదు ఫినిషింగ్. దీనిలో డిస్ప్లే పైకి వచ్చి ఉంటుంది. అంటే బాడీ లో కలిసి ఉండదు. ఇలాంటివి ఎప్పటికైనా రిస్క్ గొరిల్లా ఉన్నా లేకున్నా. లుక్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కాని బిల్డ్ క్వాలిటీ లేదా డిజైన్ మాత్రం మంచిగా లేవు.

 

OBI వరల్డ్ ఫోన్ SF1 కంప్లీట్ రివ్యూ

డిస్ప్లే అండ్ UI
1080P 5in డిస్ప్లే లో bad ఏమీ లేదు కాని xiaomi mi 4i లేదా జెన్ ఫోన్ 2 వాటితో పోలిస్తే SF1 డిస్ప్లే చాలా సింపుల్ గా ఉంది అనాలి. చెప్పుకోవటానికి ఏమీ లేదు డిస్ప్లే లో. కలర్స్ లేదా టచ్ ఎక్స్పీరియన్స్ లో రెగ్యులర్ గానే ఉంది.

UI - పైన చెప్పిన డిజైన్ లేదా డిస్ప్లే అందరికీ కాకపోయినా కొంతమందికి నచ్చుతుంది అనుకోవచ్చు. కాని UI మాత్రం ఎవ్వరికీ suit అవ్వదు. లాలిపాప్ పై సొంత యూజర్ ఇంటర్ఫేస్ తో నడుస్తుంది. చాలా laggy గా ఉంది. పైన కనిపించే సర్కిల్ స్క్రీన్ కూడా కేవలం డిఫరెంట్ అనిపించుకోవటానికి ఉంది కాని పర్పస్ ఏమీ లేదు. ఐకాన్స్ కూడా అన్నిటికీ సపోర్ట్ లేవటం వలన కొన్ని ui డిజైన్ లో కొన్ని నార్మల్ గా ఉన్నాయి.

OBI వరల్డ్ ఫోన్ SF1 కంప్లీట్ రివ్యూ

పెర్ఫార్మన్స్
UI lags ఉన్నాయి. బెంచ్ మార్క్స్ విషయానికి వస్తే స్నాప్ డ్రాగన్ 615 ఉంది దీనిలో, సో అన్ని ఫోనుల వలె దీని స్కోర్స్ కూడా సేమ్. 3D మార్క్ మాత్రం ఎప్పుడూ ఓపెన్ చేసిన లాగ్స్ ఇస్తుంది. ui లో చాలా బగ్స్ ఉన్నాయి. optimise అవ్వాలి. cpu కొంచెం లోడ్ ఎక్కువ తీసుకుంటే ఇది మరీ ఎక్కువుగా ఉంది. xiaomi మి 4i కు దగ్గరిలో ఉన్నాయి బెంచ్ మార్క్స్. SF1 లో మరొకటి చెప్పాలి. రెగ్యులర్ usage కోసం ప్రొసెసర్ 960MHz నుండి 1.3GHz వరకూ తీసుకుంటుంది పవర్, సో బ్యాటరీ ఆదా అవుతుంది దీని వలన.

OBI వరల్డ్ ఫోన్ SF1 కంప్లీట్ రివ్యూ

బ్యాటరీ
SF1 లో బ్యాటరీ ఒక్కటే బాగుంది. 3000 mah ఉంది. రియల్ స్కోర్స్ లో కూడా పేపర్ స్పెక్స్ కు తగ్గా పెర్ఫార్మన్స్ ఇస్తుంది. రెగ్యులర్ use లో 12 గంటలు లేదా అంతకుమించి బ్యాక్ అప్ వస్తుంది. ఇది ప్రైస్ తో కంపేర్ చేస్తే బెస్ట్ బ్యాక్ అప్.

OBI వరల్డ్ ఫోన్ SF1 కంప్లీట్ రివ్యూ

కెమేరా:
13MP బ్యాక్ లో ఉంది. లైటింగ్ కండిషన్స్ లో సంతృప్తికరమైన అవుట్ పుట్ ఇస్తుంది. కాని Low లైట్ లో బాలేదు. దీనిలోని Chroma ఫ్లాష్ కూడా హెల్ప్ అవలేదు Low లైట్ లో. ఫ్లాష్ వాడితే ఇమేజెస్ washed out అవుతున్నాయి. అంటే దేనికీ వాడటానికి అవ్వదు ఆ పిక్స్ ను. సన్ లైట్ అండ్ indoor లో మాత్రం బాగా పెర్ఫరం చేస్తుంది రేర్ కెమేరా. కాని డిటేల్స్ miss అవుతున్నాయి. ఫోకస్ మరియు ఇమేజ్ ప్రోసెసింగ్ కు టైమ్ కూడా తీసుకుంటుంది. మి 4i కు అస్సలు కంపేర్ చేయకూడదు. జెన్ ఫోన్ 2 కన్నా తక్కువలో ఉంది. పక్కన ఉన్న ఇమేజ్ స్టూడియో లైటింగ్ లో తీసిన ఫోటో.
నోట్ : వెబ్ సైట్ లోడింగ్ వలన క్వాలిటీ కొంచెం తక్కువగా అనిపించవచ్చు.

OBI వరల్డ్ ఫోన్ SF1 కంప్లీట్ రివ్యూ

పక్కన ఉన్న ఇమేజ్ Low లైటింగ్ లో ఫ్లాష్ తో తీసినది.

బాటమ్ లైన్

ఈ ఫోన్ డిఫరెంట్ గా ఉండటానికి చాలా ట్రై చేసింది. ఈ విషయంలో సక్సెస్ అయ్యింది కూడా. కాని బ్యాటరీ తప్ప మరే ఇతర విషయంలోనూ ఫోన్ బాలేదు. అంటే కేవలం లుక్స్ కే డిఫరెంట్, అవేమి useful గా లేవు. సో దీని కన్నా ఆసుస్ జెన్ ఫోన్ 2 , xiaomi మి 4i అండ్ meizu m2 నోట్ మంచి ఆప్షన్స్ (ఇవి SF1 ప్రైస్ ర్యాంజ్ లో ఉన్నాయి కాబట్టి వాటితో పోల్చటం జరిగింది.)
meizu m2 రివ్యూ
xiaomi మి 4i రివ్యూ
ఆసుస్ జెన్ ఫోన్ 2 రివ్యూ

PROS -
బ్యాటరీ లైఫ్ బాగుంది.
CONS -
5in స్క్రీన్ కు ఫోన్ చాలా పెద్దది గా ఉంది.
సబ్ పార్ పెర్ఫార్మన్స్
Laggy యూజర్ ఇంటర్ఫేస్

రేటింగ్ - 59/100