ప్రతి ఒక్కరికి అన్ని అవసరాలకు మందుగా అడిగే మరియు ఉపయోగపడే పత్రం అని అడుగగానే ప్రతీ ఒక్కరూ చెప్పే సమాధానం ఒక్కటే, అదే AADHAAR కార్డు. అయితే, కొంత మంది వారి ఆధార్ కారు యొక్క వివరాలు సరిగాలేదని, దానిని మార్చుకోవాలనుంటే చాలా శ్రమపడాల్సి వస్తుందని భావిస్తుంటారు. కానీ, మీరు మీ ఆధార్ కార్డులో ముందుగా నమోదు చేసిన చిరునామాను మార్చాలనుకుంటే లేదా అందులో మరింకేదైనా మార్పులు చేయాలనుకుంటే, మీరు UIDAI యొక్క సైట్ ద్వారా, మీరే సొంతంగా ఈ మార్పులను లేదా అప్డేట్ చేయవచ్చు.
నేటి కాలంలో, అందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి అయింది, అందువల్ల మన సరైన సమాచారం మరియు చిరునామాను ఆధార్ కార్డులో ఉంచడం కూడా చాలా ముఖ్యం. అందుకోసమే, ఆన్‌లైన్ UIDAI సైట్ నుండి ఆధార్ కార్డుకు సంబంధించి మీ చిరునామాను ఎలా మార్చాలో ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ కూలంకుషంగా వివరిస్తున్నాను.
UIDAI వెబ్ సైట్‌కి వెళ్లి అడ్రస్ అప్‌డేట్ రిక్వెస్ట్ (ఆన్‌లైన్) పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్యమైన వియషం ఏమిటంటే, ఆన్లైన్లో అధికారిక సైట్ ను మాత్రమే ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ https://uidai.gov.in/ వెబ్సైట్ ద్వారా నేరుగా సైట్ లోకి వెళ్లొచ్చు.
మీరు ఈ సైట్ ను ఎన్నుకొని పేజీ ఓపెన్ అయిన తర్వాత, దిగువన ఉన్న Proceed బటన్‌పై నొక్కండి. అలా చేయగానే, ఇక్కడ మీకు OTP కోసం వివరాలు అందించబడతాయి.
మీరు ఈ సైట్ ను ఎన్నుకొని పేజీ ఓపెన్ అయిన తర్వాత, దిగువన ఉన్న Proceed బటన్‌పై నొక్కండి. అలా చేయగానే, ఇక్కడ మీకు OTP కోసం వివరాలు అందించబడతాయి.
మీ ఆధార్ నంబర్‌ను ఇక్కడ నమోదు చేయండి మరియు ఆ తర్వాత మీరు అందుకున్న OTP ని కూడా నమోదు చేయండి. (మీ ఆధార్ కార్డుతో అనుసంధానించబడిన అదే నంబర్‌లో మీరు OTP ను అందుకుంటారు).
పైన తెలిపిన విధంగా చేసిన తరువాత, మీరు ఆధార్ కార్డు యొక్క చిరునామా ప్రాంతాన్ని పిన్ కోడ్ ద్వారా లేదా చిరునామా ద్వారా మార్చాలనుకుంటున్నారో మీకు కావల్సిన విధంగా ఎంచుకోవాలి.
అలాచేసిన తరువాత వచ్చిన తదుపరి పేజీలో, అక్కడ అవసరమైన సమాచారాన్ని పూరించండి మరియు అక్కడ చివర కనిపించే Submit బటన్ పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు ఆధార్ కార్డులోని చిరునామాను మీరు ఎక్కడానికి మార్చుకోవాలనుకుంటున్నారో అక్కడికి మార్చడానికి, మీ సరైన చిరునామా ప్రూఫ్ ను అందించాలి.
దీని కోసం, పాస్‌పోర్ట్, ఇన్సూరెన్స్ పాలసీ, క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్, టెలిఫోన్ బిల్లు (ల్యాండ్‌లైన్), ఆస్తిపన్ను రశీదులు మొదలైన వాటి నుండి మీరు ఏదైనా ప్రూఫ్ గా ఎంచుకోవచ్చు.
చివరగా మీరు BPO సర్వీస్ ప్రొవైడర్‌ను ఎన్నుకోవాలి. సేవా ప్రదాతని ఎంచుకోవడానికి, మీరు సేవా ప్రదాత పేరు తర్వాత రేడియో బటన్ పై క్లిక్ చేసి Submit బటన్ పై క్లిక్ చేయాలి.