ప్రపంచంలో అతి వేగంగా డెవలప్ అయ్యేది టెక్నాలజీ. అందులోనూ మొబైల్ టెక్నాలజీ చాలా ఫాస్ట్ growth. స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో 2015 లో కూడా చాలా ప్రాముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఏ ఇయర్ లో ఏ టెక్నాలజీ రావటం మొదలయ్యింది. ఎప్పుడూ నుండి అది కామన్ స్పెక్ లా అందిరకీ అందుబాటులోకి వచ్చింది అనేవి తెలుసుకోవటం మంచి విషయం. ఈ ఇయర్ పెద్ద స్మార్ట్ ఫోన్ టెక్ changes ఏంటో చూడండి. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి లేదా క్రిందకు స్క్రోల్ చేయండి.
64 బిట్ సిస్టం
ఈ ఇయర్ లో 64 బిట్ స్టాండర్డ్ అయిపొయింది. చాలా తక్కువ బడ్జెట్ లో కూడా 64 బిట్ కంప్యూటింగ్ కామన్ గా మొదలయ్యింది ఈ ఇయర్ లోనే. ఇందుకు ఉదాహరణ యు YUnique 64 బిట్ స్నాప్ డ్రాగన్ 410 SoC 5,999 రూ లకు ఉండటం.
4GB LPDDR4 ర్యామ్స్
oneplus 2 లో ఇదే ర్యామ్ ఉంది. ఆసుస్ జెన్ ఫోన్ 2 లో DDR3 4gb ర్యామ్ ఫర్స్ట్ వచ్చింది. DDR4 ర్యామ్ ఇవటం మాత్రం oneplus 2 తోనే స్టార్ట్ అయ్యింది. దాని తరువాత శామ్సంగ్ నోట్ 5 లో కూడా వచ్చింది.
20MP+ cameras
సోనీ ఇదే ఇయర్ లో మొబైల్ లో సెమీ ప్రొఫెషనల్ కెపాసిటీ ఇమేజెస్ తియగలిగే Exmor rs మొబైల్ ఇమేజ్ సెన్సార్ ను ప్రవేశపెట్టింది. అంటే మాక్సిమమ్ 25MP ఇమేజెస్ ను రెండర్ చేయగలుగుతాయి.
డ్యూయల్ కెమేరా అండ్ సేల్ఫీ కెమేరాస్
చాలా కంపెనీలు డ్యూయల్ కెమేరా సెట్ అప్ పై అడుగులు వేసాయి కానీ ఇది పెద్దగా సక్సెస్ కాలేదు. లేటెస్ట్ గా Qiku Terra అనే ఫోన్ రెండు రేర్ కెమేరాస్ తో లాంచ్ అయ్యింది. అంటే రెండూ వేరు వేరు అంశాలపై కంప్లీట్ గా combined గా మంచి output ఇవ్వటానికి.
మరొక పక్క ఫ్రంట్ కెమేరాస్ లో 5MP కామన్ అవగా, అదనంగా కొన్ని సాఫ్ట్ వేర్ ఫీచర్స్ ఇవ్వటం కూడా పెద్ద విషయంగా తీసుకున్నాయి కంపెనిస్. ఆసుస్ లాంటి కంపెని అయితే ఫ్రంట్ కూడా 13MP కెమేరా with wide angles అండ్ led ఫ్లాష్ ఇవ్వటం సేల్ఫీ లకు consumers ఇంపార్టెన్స్ పెరిగింది ఈ సంవత్సరం అని చెప్పాలి.
ఫింగర్ ప్రింట్ స్కానర్స్
9000 రూ లకే ఫింగర్ ప్రింట్ స్కానర్ ను ఇచ్చి ట్రెండ్ సెట్ చేసింది కూల్ ప్యాడ్. బడ్జెట్ లోనే కాకుండా అన్ని మోడల్స్ లో ఇప్పుడు ఫింగర్ ప్రింట్ స్కానర్ కామన్ స్పెసిఫికేషన్ అయ్యింది ఈ ఇయర్ లో.
హై పిక్సెల్ డెన్సిటీ
2K రిసల్యుషణ్ ఫోన్స్ స్టార్ట్ అయ్యాయి విరివిగా. సోనీ ఇంకాస్త ముందడుగు వేసి, 4K రిసల్యుషణ్ ఫోన్ లాంచ్ చేసింది ఇదే ఇయర్ లో. ఇంత చిన్న స్క్రిన పై అంత ఎక్కువ రిసల్యుషణ్ అంటే పిక్సెల్ డెన్సిటీ బాగా ఎక్కువుగా ఉంటుంది. human eyes కూడా రిజిస్టర్ చేయలేనంత.
స్లిమ్, బెజేల్ లెస్ అండ్ లార్జర్ స్క్రీన్స్
ఇదే సంవత్సరం 5 in స్క్రీన్స్ కనపడటం తగ్గుతూ వచ్చింది. 5.5 in స్క్రీన్ బాగా హాల్ చల్ చేసింది. దీనికి కారణం డిస్ప్లే సైజ్ పెద్దది అయినా ఫోన్ సైడ్స్ లో తక్కువ బాడీ ఉండేలా డిజైన్ చేయటమే.
ఫోన్ వేడి ఎక్కటం
ఈ ఇయర్ లో ఫోన్స్ హిటింగ్ ప్రాబ్లెం బాగా వినిపించింది. స్నాప్ డ్రాగన్ 810 యొక్క పవర్ ఫుల్ ప్రోసెసింగ్ హిటింగ్ మేనేజ్మెంట్ విషయంలో ఫెయిల్ అవటం వంటివి బాగా ఇబ్బందికి గురి చేశాయి.
హై బ్యాటరీ ఫోన్స్
ఈ ఇయర్ లో కంపెనీలు కూడా అన్నీ పెద్ద పెద్ద బ్యాటరీ లైఫ్స్ తో మొబైల్స్ ను మార్కెట్ లో రిలీజ్ చేయటం మొదలుపెట్టాయి. రీసెంట్ రిలీజ్ Oukitel K10000 మోడల్ ఏకంగా 10000 mah బ్యాటరీ తో వస్తుంది. ప్రస్తుతం చైనాలో ఉంది. ఇండియన్ మార్కెట్ పై ఇన్ఫర్మేషన్ లేదు.
usb టైప్ C పోర్ట్స్
రివర్సబుల్ కనెక్షన్స్ అండ్ హై స్పీడ్ డేటా ట్రాన్స్ ఫర్స్ కు ఇది మంచి change over.
గ్లాస్ అండ్ మెటల్ బాడీ తో ఫోన్స్
చాలా వరకూ బ్రాండ్స్ 2015 లో ప్లాస్టిక్ బాడీ కలిగిన ఫోనులను లాంచ్ చేయటం ఆపివేసాయి. మెటల్ అనే కాకుండా గ్లాస్ తో కూడా లాంచ్ చేశాయి. లేటెస్ట్ oneplus x ఇందుకు ప్రధాన ఉదాహరణ.
ఫ్లాగ్ షిప్ స్పెక్స్ తో మిడ్ ర్యాంజ్ బడ్జెట్ లో
2015 లో హై ఎండ్ ఫ్లాగ్ షిప్ మోడల్స్ మిడ్ ర్యాంజ్ మోడల్స్ కు వచ్చాయి. హానర్ 7, oneplus, ఆసుస్ జెన్ ఫోన్ 2 4GB వేరియంట్ వంటివి ఇందుకు ఉదాహరణలు.
ఫోర్స్ టచ్ - 3D టచ్
ఆపిల్ ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ అందరికీ సుపరిచటం కాకపోయినా ఈ లిస్ట్ లో ఉండవలసిన అంశం. జస్ట్ యాప్ ఐకాన్ పై gentle గా ప్రెస్ చేస్తే యాప్ ఓపెన్ చేసి లోపల చేసే యాక్షన్స్ ను లిస్ట్ గా చూపిస్తుంది బయటే. మాక్ బుక్ లో కూడా ఉంది. Huwei ఫోన్స్ లో కూడా ఉండనుంది.
Continuum: మొబైల్ ఫోన్ ను pc లా మారుస్తుంది.
విండోస్ లేటెస్ట్ os 10 తో వచ్చిన ఈ ఫీచర్ నిజంగా ట్రెండ్ సెట్టింగ్ అని చెప్పాలి. జస్ట్ అర చేతిలో పట్టే డివైజ్ ను మధ్యలో కనెక్ట్ చేసి, మొబైల్ ను pc లా వాడుకోవచ్చు. అంటే మొబైల్ కు డేటా కేబుల్ ద్వారా పెద్ద స్క్రీన్ కలిగిన మానిటర్ కనెక్ట్ చేస్తే మొబైల్ లో ఉన్న విండోస్ 10 మొబైల్ os తోనే మానిటర్ పై pc లా వర్క్ చేస్తుంది.