సరికొత్త రికార్డ్స్ తో మార్కెట్ లో నోకియా 6 సందడి ,11 లక్షల రిజిస్ట్రేషన్స్ క్రాస్ చేసిన నోకియా 6 కొనుగోళ్లు
నోకియా ఇప్పుడు సరికొత్త రికార్డ్స్ ని బ్రేక్ చేస్తున్నది , గత కొంత కాలం ముందు విండోస్ ఫోన్ లతో ప్రజలముందుకు వచ్చినా అంతగా జనధరణ పొందలేక పోయింది ,చాలా చేదు అనుభవాలనే చవి చూసిందని చెప్పాలి ,మొత్తానికి ఆండ్రాయిడ్ బాట పట్టి లాంగ్ గ్యాప్ తరవాత ,తన సత్తా చూపించటానికి ప్రజల ముందుకు వచ్చింది ,HMD గ్లోబల్ లో చేరిన తరువాత Android-powered Nokia 6 smartphone అనే సరికొత్త ఫోన్ ని మార్కెట్ లో విడుదల చేసేందుకు శ్రీకారం చుట్టింది
ఈ నోకియా 6 ఫోన్ కోసం 11 లక్షలమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ,ఈ రిజిస్ట్రేషన్ ప్రారంభమైన 1 రోజు లోనే 2 లక్షల 50,000 మంది బుక్ చేసుకున్నారు ,ఈ రిజిస్ట్రేషన్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు తెలియ చేశాయి ,చైనా మార్కెట్లో నోకియా 6కు స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి మొదటి ఫ్లాష్‌సేల్ జనవరి 19న JD.comలో జరగ బోతుందని సమాచారం
నోకియా 6 యొక్క మరిన్ని సరికొత్త విశేషాలు మరియు స్పెసిఫికేషన్స్ :
నోకియా 6 5. 5 ఇంచెస్ ఫుల్ ఐడెంటిఫికేషన్ డిస్ప్లే ని కలిగి ఉంటుంది ,దీనికి 2. 5 గొరిల్లా గ్లాస్ రక్షణను ఇచ్చారు ,ఈ డిస్ప్లే లోయూజర్‌కు క్లియర్ కట్ అనుభూతులు కలగా టానికి పోలరైజర్ లేయర్ సన్‌లైట్ కండీషన్ ని అమర్చారు ,నోకియా 6 స్మార్ట్‌ఫోన్ 4జీబి ర్యామ్ అలానే 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తోంది,ఫోన్‌లో ఏర్పాటు చేసిన మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా డివైస్ స్టోరేజ్‌ను మరో 64జీబి వరకు విస్తరింపచేయవచ్చు
కెమెరా :
నోకియా 6 స్మార్ట్‌ఫోన్ 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. f/2.0 లెన్స్, ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్ ఈ కెమెరాలో ఉన్నాయి,8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా కలిగి వుంది
నోకియా 6 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది ,నోకియా 6 స్మార్ట్‌ఫోన్ డ్యుయల్ యాంప్లిఫయర్స్‌తో కూడిన డ్యుయల్ డాల్బీ అట్మోస్ స్పీకర్ర్లు కలిగి వుంది.
దీని యొక్క ధర కనుక మనం గమనించినట్లఐతే :
ప్రసుతం ఈ ఫోన్ చైనాలో మాత్రేమే దొరుకుతుంది ,JD.com లో దీని విక్రయాలకు సన్నాహాలు మొదలయ్యాయి ,చైనా ధర 1699 CNY మన కరెన్సీలో రూ.16,750.