ఈ ఫోన్ కోసం చాలా కాలం వేచి వున్నారు కదా , చివరికి, HMD గ్లోబల్ నోకియా 8 ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ని ప్రారంభించింది. ఈ స్మార్ట్ఫోన్ ధర రూ .36,999. HMD గ్లోబల్ యొక్క నోకియా 8 స్మార్ట్ఫోన్ అక్టోబర్ 14 నుండి అమెజాన్ ఇండియా మరియు ఆఫ్లైన్ రిటైల్ ఛానల్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో OnePlus 5 ను మరియు హానర్ 8 లకు గట్టి పోటీ ఇస్తుంది . ఈ కొత్త ఫ్లాగ్షిప్ డివైస్ ద్వారా వినియోగదారులు "ఫ్రంట్ మరియు బ్యాక్ కెమెరాల" ను ఒకే సమయంలో ఉపయోగించుకునే ఫీచర్ ని కలిగి ఉంటుంది.
Nokia 8 గత నెల లండన్ లో నిర్వహించబడిన ఒక ఈవెంట్ లో లాంచ్ చేయబడింది . మరియు ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా Nokia అండ్ కార్ల్ జీస్ యొక్క మద్దతు మళ్లీ కనిపిస్తుంది.
ఈ ఫోన్లో 13MP యొక్క 3 కెమెరాలు ఉన్నాయి. దాని వెనుక ఒక 13MP డ్యూయల్ కెమెరా సెటప్ మరియు ఫ్రంట్ సైడ్ ఒక 13MP తో కెమెరా ఉంది.
రేర్ కెమెరా సెటప్ లో ఒక కలర్ సెన్సార్ మరియు మోనోక్రోమ్ సెన్సార్ అందించబడ్డాయి. దీని ప్రధాన కెమెరాకు f / 2.0 ఎపర్చరు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిజేషన్ మరియు డ్యూయల్ - LED ఫ్లాష్ వస్తుంది.
దీని 13MP ముందు కెమెరా పేజ్ డిటెక్షన్ ను ఆటోఫోకస్లను మరియు f / 2.0 ఎపర్చరు తో వస్తుంది మరియు 4K వీడియో రికార్డింగ్ ను సపోర్ట్ చేస్తుంది .
ఈ స్మార్ట్ఫోన్ ఒక కొత్త బోత్ మోడ్ ను కూడా అందిస్తుంది, దీని ద్వారా యూజర్లు ఒకే సమయంలో ముందు మరియు వెనుక కెమెరాలను ఉపయోగించవచ్చు.
నోకియా 8 కి 5.3 అంగుళాల క్వాడ్ HD డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ యొక్క స్నాప్డ్రాగెన్ 835 మొబైల్ చిప్సెట్ తో పనిచేస్తుంది.
ఈ స్మార్ట్ఫోన్ 4GB RAM మరియు 64GB ఎక్స్ పాండబుల్ ఇంటర్నల్ స్టోరేజ్ తో అందుబాటులో ఉంది మరియు కంపెనీ వచ్చే నెలలో దాని 6GB RAM వేరియంట్ ప్రారంభించవచ్చు.
నోకియా 8 ఫోన్ ఆండ్రాయిడ్ 7.1.1 ఫై నడుస్తుంది మరియు త్వరలో Android 8.0 ఒరియో కు అప్గ్రేడ్ చేయబడుతుంది.
ఈ స్మార్ట్ఫోన్ IP54- సర్టిఫికేట్ మరియు నోకియా యొక్క OZO ఆడియో తో ఈ కొత్త డివైస్ వస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ టెంపెర్డ్ బ్లూ, పోలిష్ బ్లూ, సిల్వర్ మరియు పోలిష్ కాపర్ కలర్ ఎంపికలలో అందుబాటులో ఉంది.
నోకియా 8 ఒక 3080mAh బ్యాటరీని కలిగి ఉంది మరియు దాని బ్యాటరీ లైఫ్ ని దాని యొక్క స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ తో అందిస్తుందని భావిస్తున్నారు.
నోకియా 8 స్మార్ట్ఫోన్ 50 భారతీయ నగరాల్లో సంప్రదాయ సేవలను అందిస్తుంది అని HMD గ్లోబల్ ప్రకటించింది.
HMD గ్లోబల్ వచ్చే నెలలో నోకియా 8 యొక్క 6GB RAM ను కూడా విడుదల చేస్తుంది. ఇంతకుముందు కంపెనీ నోకియా 3, నోకియా 5 మరియు నోకియా 6 స్మార్ట్ఫోన్లను ప్రారంభించింది.
నోకియా నుంచి ఇంకా మరిన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ లో సందడి చేయనున్నాయి . ఎంతయినా నోకియా కి వున్న క్రేజ్ వేరనే చెప్పాలి .
అయితే నోకియా నుంచి రాబోతున్న నోకియా 9 గురించి మాత్రం ఇంకా పక్కా సమాచారం లేదు .