నోకియా మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నోకియా 6 గురించి మరల చర్చలు మొదలయ్యాయి. మొదట ఈ ఫోన్ ని చైనా లో బ్లాక్ కలర్ వేరియంట్ లో లాంచ్ చేశారు
ఇప్పుడు కంపెనీ ఫోన్ మరో కొత్త వేరియంట్ ప్రవేశపెట్టింది . అది సిల్వర్ కలర్ మోడల్ .
రిపోర్ట్స్ ఆధారముగా నోకియా 6 సిల్వర్ వేరియంట్ ప్రస్తుతం యాహూ థైవాన్ స్టోర్స్ లో లిస్ట్ చేయబడింది.
ఈ లిస్టింగ్ లో ఫోన్ యొక్క ధర కూడా ఇవ్వబడింది. మరియు ఎప్పుడు అమ్మకానికి వస్తుందో కూడా తెలియచేయబడింది. ఇండియన్ కరెన్సీ లో దీని ధర దాదాపు 16,500రూ ఉంటుంది.
4జీబీ RAM 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్:
ఈ కొత్త లిస్టింగ్ లో ఫోన్ యొక్క 4RAM మరియు 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఇవ్వబడింది.
కలర్ ఆప్షన్
సిల్వర్ వేరియంట్ నే కాక ఆర్ట్ బ్లాక్ స్పెషల్ ఎడిషన్ లో కూడా లభ్యం దీనిలో 4జీబీ RAM మరియు 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. నోకియా 6 ఆర్ట్ బ్లాక్ ,మెట్ బ్లాక్ , టెంపెర్డ్ బ్లూ మరియు కాపర్ కలర్స్ తో మార్కెట్లోకి అడుగు పెడుతుంది.
నోకియా 6 5. 5 ఇంచెస్ ఫుల్ హెచ్దీ డిస్ప్లే కలిగి , దీనిపై 2. 5 గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి వుంది. ఈ హ్యాండ్ సెట్ స్నాప్డ్రాగన్ 430 చిప్సెట్ కలిగి వుంది.
భారత్ లో Nokia 6, Nokia 5, Nokia 3, Nokia 3310 ఎప్పుడు లాంచ్ అవుతాయనే అనే నిర్ధారణ' 8 మే న తెలియనుంది. ప్రస్తుతం HMD గ్లోబల్ 8 మే న్యూ ఢిల్లీ లో ఒక ఈవెంట్ నిర్వహించనుంది. కంపనీ నుంచి ఈ ఫోన్స్ గురించి ఎటువంటి సమాచారం లేదు . ఆశాజనకంగా ఈ ఈవెంట్ లో Nokia 6, Nokia 5, Nokia 3, Nokia 3310 యొక్క రిలీజ్ డేట్ గురించి పక్కా అవ్వనుంది.