Nextbit Robin ఒరిజినల్ గా ఒక స్టార్ట్ అప్ కంపెని US లో. ఇది క్లౌడ్ స్టోరేజ్ అనే ఐడియా తో ప్రారంభం అయ్యింది. అయితే దానితో పాటు ఫోన్ లుక్స్ కూడా చాలా మందిని ఆకర్షించాయి.September 2015 న Kickstarter క్రౌడ్ ఫండింగ్ లో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఇండియాలో ఫ్లిప్ కార్ట్ లో exclusive గా (మాత్రమే) సెల్ అవనుంది. ఇమేజెస్ చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి.
playful design తో వస్తున్న రాబిన్ క్విక్ స్పెక్స్ చూడండి ముందు..
రాబిన్ లో డ్యూయల్ tone కలర్ scheme ఉంది. వైట్ మరియు sky pastel కలర్స్ ను చూపిస్తుంది. డిస్ప్లే పైన సెన్సార్ హబ్ మరియు 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
Well design ఫోన్ ఇది. ఫోన్ ఫ్రంట్ సైడ్ లో క్రింద పైనా రెండు సర్కులర్ గ్రిల్స్ ఉంటాయి. ఇవి స్పీకర్స్.
రైట్ సైడ్ సిమ్ స్లాట్ మరియు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. పవర్ బటన్ లోనే ఉంటుంది ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా. అవును FP ఫోన్ వెనుక కాని ముందు కాని లేదు, సైడ్ లో ఉంది. సోనీ XPeria Z5 లో కూడా ఇలాగె ఉంటుంది FP.
లెఫ్ట్ సైడ్ circular వాల్యూం అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అన్ని ఫోనుల్లో రెండూ కలిపి వస్తాయి కాని దీనిలో విడివిడిగా ఉన్నాయి.
ఫోన్ polycarbonate shell బాడీ. ఇది 5.2 in ఫుల్ HD డిస్ప్లే తో వస్తుంది కాని usual ఫోనుల కన్నా కొంచెం ఎక్కువ పొడవు ఉంది ఫోన్.
వెనుక 13MP డ్యూయల్ tone LED ఫ్లాష్ కెమెరా ఉంది. ఇంకా క్లౌడ్ స్టోరేజ్ డేటా sync light ఇండికేటర్ కూడా ఉంటుంది.