మారుతున్న కాలం తో పాటుగా స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ కూడా మారుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త ఫీచర్లు మరియు కొత్త టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. అందుకే, మార్కెట్ లో లేటెస్ట్ గా విడుదలైన మరియు త్వరలో మార్కెట్ లోకి అడుగుపెట్టనున్న స్మార్ట్ ఫోన్ల పైన ఒక లుక్కేయండి.
Poco X5 ఈ ఫోన్ లేటెస్ట్ గా విడుదలయ్యింది. ఇది 6.7-అంగుళాల Full HD + AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. ఇది 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇది 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో జత చేయబడింది. ఈ ఫోన్ రూ.18,999 ప్రారంభ ధరతో ఈ ఫోన్ లాంచ్ చేయబడింది.
Oppo Find N2 Flip స్మార్ట్ ఫోన్ వినూత్నమైన డిజైన్ తో వచ్చింది. ఇది 3.62-అంగుళాల కవర్ డిస్ప్లేతో మరియు 6.8-అంగుళాల AMOLED మైన్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ డిస్ప్లే FHD+ (1080×2520 పిక్సెల్స్) రిజల్యూషన్ కలిగి ఉంది. ఇది 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు 1600 nits పీక్ బ్రైట్‌నెస్ తో వస్తుంది.
Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన 6.4-అంగుళాల FHD+ సూపర్ AMOLED ఇన్ఫినిటీ-O డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6GB/8GB RAM, 128GB/256GB స్టోరేజ్ మరియు 1TB వరకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టా-కోర్ Samsung Exynos 1380 చిప్‌సెట్ తో పనిచేస్తుంది.
Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ సూపర్ AMOLED ఇన్ఫినిటీ-U డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో కలిగి ఉంది. ఈ ఫోన్ 6GB/8GB RAM మరియు 128GB/256GB స్టోరేజ్‌తో పాటు MediaTek Dimensity 1080 శక్తితో పనిచేస్తుంది. ఇది అవుట్-ఆఫ్-ది-బాక్స్ ఆండ్రాయిడ్ 13 తో బూట్ అవుతుంది మరియు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చెయ్యబడింది.
iQOO Z7 సిరీస్ మార్చి 21న భారతదేశంలో ప్రారంభించబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ Dimensity 920 చిప్‌సెట్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ బిగ్ AMOLED డిస్ప్లే, OIS సపోర్టెడ్ 64MP కెమెరా, Funtouch OS 13 మరియు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ భారతదేశ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది మరియు దీని ధర రూ.17,999 నుండి ప్రారంభమవుతుంది.
Vivo Y11 (2023) ఫోన్ ఈ మార్చి చివరి నాటికి చైనాలో ప్రారంభించబడుతుంది. అలాగే, ఏప్రిల్‌లో గ్లోబల్ మార్కెట్లలో ఈ స్మార్ట్ ఫోన్ విడుదల కావచ్చని సమాచారం. ఈ ఫోన్ 6.5-అంగుళాల FHD + డిస్ప్లే, మీడియాటెక్ చిప్‌సెట్, 4GB RAM మరియు 128GB స్టోరేజ్, మైక్రో SD కార్డ్ స్లాట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు 5,000mAh బ్యాటరీతో రావచ్చు.
రెడ్‌మి నోట్ 12 టర్బో స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 1 చిప్‌సెట్ తో రావచ్చని భావిస్తున్నారు. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 యొక్క అండర్ క్లాక్డ్ వెర్షన్ అని చెప్పబడింది. ఈ ఫోన్ మార్చి చివరి నాటికి చైనాలో విడుదల చేయబడుతుందని మరియు తరువాత ఇతర మార్కెట్లలో Poco F5 గా ప్రవేశించవచ్చని చెబుతున్నారు.
Redmi Note 12 4G ఫోన్ 5G వేరియంట్ ను పోలి ఉంటుంది. ఇది Snapdragon 4 Gen 1 చిప్ కు బదులుగా ఓవర్ లాక్ చేయబడిన Snapdragon 680 SoC ద్వారా అందించబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ నెల లేదా వచ్చే నెలలో అధికారికంగా లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు.
Redmi A2 ని ఈ నెల ఆఖరులో ప్రారంభించవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ Redmi A1 స్థానంలో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Helio G36 SoC తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.52 ఇంచ్ డిస్ప్లేతో ఉంటుంది.
Redmi A2 Plus స్మార్ట్ ఫోన్ కూడా ఈ నెలలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అంతేకాదు, Redmi A1 Plus స్థానంలో ఈ ఫోన్ వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మునుపటి ఫోన్ యొక్క అదే స్పెక్స్ తో రావచ్చని అంచనా. ఈ ఫోన్ 6.52-అంగుళాల HD+ డిస్ప్లేతో ఉంటుంది మరియు వెనుక 8-మెగాపిక్సెల్ కెమెరా మరియు ముందు 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఉండవచ్చు.
Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్ Qualcomm స్నాప్ డ్రాగన్ 7 ప్లస్ Gen 1 చిప్‌సెట్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ ను మార్చి నెలాఖరులోగా అధికారికంగా తీసుకురావాలని భావిస్తున్నారు. ఇది 6.74-అంగుళాల 2K 144Hz OLED డిస్ప్లే, 64MP (వైడ్) + 8MP (అల్ట్రా-వైడ్) + 2MP (మాక్రో) ట్రిపుల్ కెమెరా సిస్టమ్, 16MP సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 13-ఆధారిత ColorOS 13తో వస్తుందని హింట్ ఇస్తున్నారు.
Realme C55 స్మార్ట్ ఫోన్ 6.52 ఇంచ్ FHD రిజల్యూషన్ LCD డిస్ప్లేతో వస్తుంది మరియు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ తొ ఉంటుంది. ఈ ఫోన్ 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 680 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ ను అందిస్తుంది. ఈ డిస్ప్లేలో పంచ్-హోల్ సెల్ఫీ కెమేరా మరియు ఐఫోన్ మాదిరి నోటిఫికేషన్ బార్ ఫీచర్ కూడా వుంది. Realme C55 లో 64MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ మరియు LED ఫ్లాష్ ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.
Infinix Hot 30i ఫోన్ 6.6-అంగుళాల IPS LCD ప్యానెల్, MediaTek Helio G37 చిప్‌సెట్ మరియు 50MP ప్రైమరీ కెమెరా లెన్స్‌ను కలిగి ఉంటుందని లేటెస్ట్ నివేదికలు సూచిస్తున్నాయి. ఈ Infinix Hot 30i మార్చి 27న ప్రారంభించబడుతుంది. అంతేకాదు, ఒక నివేదిక ఈ ఫోన్ యొక్క మేరిగోల్డ్ కలర్ అప్షన్ లో ఉంటుందని వెల్లడించింది మరియు ఇది లెథర్ లాంటి ఫినిషింగ్ తో వస్తుందని చెబుతున్నారు.
Oppo Find X6 Series కూడా ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది. ఈ రూమర్లను నిజమని నమ్మితే, ఈ సిరీస్ మార్చి 21 న ప్రారంభమవుతుంది. ఈ సిరిస్‌లో Oppo Find X6 మరియు Oppo Find X6 Pro అనే రెండు మోడల్స్ ఉంటాయి. వనిల్లా మరియు ప్రో వేరియంట్స్ వరుసగా MediaTek Dimensity 9200 SoC మరియు Qualcomm Snapdragon 8 Gen 2 SoC ట్లను కలిగివుంటాయి. ఈ రెండు ఫోన్ లకు 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఇవ్వబడుతుంది.
Nokia C12 స్మార్ట్ ఫోన్ ఆక్టా-కోర్ (Unisoc 9863A1) ప్రాసెసర్‌తో ఆధారితమైనది మరియు ఇది 2GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 3000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.
Motorola Moto G73 5G ఫోన్ FHD+ రిజల్యూషన్ 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో 6.5-అంగుళాల LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ డిస్ప్లే మధ్యలో పంచ్-హోల్ కట్ వుంది. ఈ స్మార్ట్ ఫోన్ డైమెన్సిటీ 930 ప్రాసెసర్‌తో 8GB RAM మరియు 256GB స్టోరేజ్ తో జత చేయబడింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ పనిచేస్తుంది.
నథింగ్ ఫోన్ 2 ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నట్లు కార్ల్ పీ ఇటీవల వెల్లడించారు. కంపెనీ ఈ ఫోన్ సాఫ్ట్‌వేర్ అనుభవం పై ఎక్కువ దృష్టి పెట్టడం వలన ఇది మరింత ప్రీమియం స్మార్ట్ ఫోన్‌గా ఉంటుందని ఆయన తెలిపారు. MWC 2023లో నథింగ్ ఫోన్ 2 గురించి కంపెనీ చీఫ్ కార్ల్ పీ మరియు క్వాల్‌కామ్‌కి చెందిన క్రిస్టియానో ఐమాన్ స్టడ్స్ "Phone 2" మరియు "8" ప్రింట్ చేయబడిన టీ-షర్టులను పట్టుకుని ఉన్నట్లు మేము విన్నాము. అయితే, Qualcomm యొక్క SVP మరియు GM అలెక్స్ కటౌజియన్, లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో అనుకోకుండా ఈ ఫోన్ ప్రాసెసర్‌ని వెల్లడించారు, ఇది స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC అని చెబుతున్నారు.
Google Pixel 7A డిస్ప్లే Pixel 7 మాదిరిగానే ఉండవచ్చు. అంటే, దీని అర్థం ఈఫోన్ 6.1-అంగుళాల డిస్ప్లేతో ఉంటుంది. ఇది ఫుల్HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను పొందుతుందని భావిస్తున్నారు. దీనికి 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ మద్దతు ఇస్తుంది.
Moto X40 కూడా త్వరలోనే లాంచ్ చేయబడుతుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ ధర దాదాపు రూ.40,390 గా ఉండవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు 6.67-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది, ఇది 165 Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది.
రూ.15,000 ధరలో మీ డబ్బుకు తగిన విలువనిచ్చే సూపర్ 5G ఫోన్స్ కోసం చూస్తున్నారా? అయితే ఇక్కడ Click Here.