ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Jun 26 2022
ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

ఇండియన్ మార్కెట్లో కొత్తగా అడుగుపెట్టిన స్మార్ట్ ఫోన్ లలో ఏదైనా ఒక స్మార్ట్ ఫోన్ ను ఎంచుకోవాలని చూస్తున్నారా? అయితే, మీ ఆలోచనకు తగిన సహాయం అందించడానికి మేమున్నాము. అందుకోసమే, మీకు సహాయం అందించానికి భారతీయ మార్కెట్లో కొత్తగా విడుదలైన స్మార్ట్ ఫోన్స్ యొక్క స్పెక్స్, ధర మరియు ఫీచర్లతో పాటుగా సవివరంగా చర్చించనున్నాము. మరి ఆ లేటెస్ట్ ఫోన్స్ వాటి వివరాలు ఏమిటో చూసేద్దామా.     

ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

Moto Edge 30

ధర: రూ.27,999

మోటో ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్ కేవలం 6.9mm మందంతో ప్రపంచంలో అత్యంత నాజూకైన 5G ఫోన్ గా పిలవబడుతుంది. ఈ ఫోన్ వేగవంతమైన క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 778G+ ప్రాసెసర్ తో పనిచేస్తుంది మరియు ఆండ్రాయిడ్ 12-ఆధారిత MyUX సాఫ్ట్‌వేర్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు 1 బిలియన్ కలర్ కవరేజీని కలిగిన  pOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 33W టర్బోపవర్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో 4,020 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ కలిగిం స్టీరియోస్పీకర్లతో వస్తుంది. ఈ ఫోన్ వెనుక కెమెరా ప్యానెల్‌లో 50MP ప్రధాన సెన్సార్, 50MP అల్ట్రావైడ్ సెన్సార్ మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు కెమెరా 32MP సెన్సార్ ఉండవచ్చు. మీరు ప్రైమరీ రియర్ కెమెరా నుండి 4K30 fps వీడియోలను షూట్ చేయవచ్చు.

ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

Xiaomi 12 Pro

ధర : రూ. 62,000

 షియోమి 12 ప్రో 10-bit 6.73-అంగుళాల 2K+రిజల్యూషన్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Dolby Vision మరియు HDR10+ సపోర్ట్ తో పాటుగా 120Hz రిఫ్రెష్ రేట్‌ మరియు 480Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ క్వాల్కమ్ ప్రొసెసర్ Snapdragon 8 Gen1 SoC తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ LPDDR5 12GB RAM మరియు UFS 3.1 256GB వరకు స్టోరేజ్ ఎంపికతో జత చేయబడింది. ఈ ఫోన్ లో OIS తో 50MP (IMX707) కెమెరా జతగా 50MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. అలాగే, సెల్ఫీల కోసం  ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. Xiaomi 12 Pro స్టీరియో స్పీకర్‌ లను కూడా కలిగి ఉంది మరియు 4,600mAh బ్యాటరీని భారీ 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో ఈ ఫోన్ లో అందించింది.

ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

Realme GT Neo 3

ధర: రూ.36,999

రియల్‌మీ జిటి నియో 3 స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ FHD+ OLED డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది మరియు ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్‌ డిస్‌ప్లే కోసం డేడికేటెడ్ డిస్ప్లే సెన్సార్ ని కూడా అందించింది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 8100 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా Realme UI 3.0 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP SonyIMX766  మైన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్ ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ వేగవంతమైన 80W /150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 బ్యాటరీతో వచ్చింది.

ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

Samsung Galaxy M33 5G

ధర: రూ.17,999

గెలాక్సీ ఎం33 5జి స్మార్ట్ ఫోన్ లో ఇన్ఫినిటీ-V కటౌట్ కలిగిన 6.6- ఇంచ్ TFT డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంటుంది. ఈ పూర్తి డిస్ప్లే ని గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో జత చేసింది. ఈ M33 ఫోన్ శామ్సంగ్ యొక్క సొంత 5G మరియు 5nm ప్రోసెసర్ Exynos 1280 కి జతగా 6/8GB LPDDR4x RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 6000 mAh భారీ బ్యాటరీని కలిగివుంటుంది. ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరాను ఇన్ఫినిటీ-V కటౌట్ లో అందించింది. అలాగే, 50MP ప్రధాన సెన్సార్, 5MP అల్ట్రావైడ్, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మాక్రో  సెన్సార్ కలిగిన క్వాడ్ రియర్ కెమెరా మాడ్యూల్‌ను కలిగివుంది.

ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

Vivo T1 Pro 5G:

ధర: రూ.23,999

ఈ స్మార్ట్ ఫోన్ ను 6nm ఫ్లాగ్ షిప్ అడ్వాన్స్డ్  ప్రాసెసర్ Snapdragon 778G తో తీసుకువచ్చింది. అంతేకాదు, వివో టి1 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ 66W టర్బో ఫ్లాష్  ఛార్జ్ సపోర్ట్ ను కలిగివుంది. ఈ ఛార్జింగ్ టెక్ తో ఈ ఫోన్ కేవలం 18 నిముషాల్లోనే 50% వరకూ ఛార్జ్ చెయ్యగలదని కూడా వివో తెలిపింది. ఈ ఫోన్ HDR 10+ సర్టిఫికేషన్ కలిగిన 6.44 ఇంచ్ FHD+  AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్  Android 12 ఆధారిత Funtouch OS సాఫ్ట్‌వేర్‌ తో వస్తుంది. ఈ ఫోన్ లో 64MP +8MP MP +2MP ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 16MP సెల్ఫీ కెమెరా వున్నాయి.

ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

Moto G52   

ధర : రూ.14,499

మోటో జి52 స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల FHD+ రిజల్యూషన్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ ఫోన్ నేచురల్ కలర్స్ అందించగల pOLED డిస్ప్లేని కలిగివుంది మరియు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వస్తుంది. దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అలాగే, మోటో జి52 యాడ్-ఫ్రీ Android 12 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ ఫిక్షన్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో 50MP + 8MP + 2MP  ఉన్నాయి మరియు ఇది మూడు కెమెరాలతోనే నాలుగు కెమెరాల పనిచేస్తుంది. ముందు పంచ్ హోల్ కటౌట్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 33W టర్బో పవర్  ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది.

ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

Tecno Phantom X

ధర : రూ.25,999

టెక్నో ఫాంటమ్ X స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ FHD+ రిజల్యూషన్ Curved AMOLED డిస్ప్లేని 90 Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G95 చిప్ సెట్ తో పనిచేస్తుంది మరియు జతగా 8GB LPDDR4X RAM మరియు 256GB UFS 2.1 స్టోరేజ్‌ ని కలిగివుంది. అంతేకాదు, ఈ ఫోన్ 5GB వర్చువల్ ర్యామ్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఇందులో, 50MP మైన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 13MP పోర్ట్రైట్ లెన్స్ కూడా ఉన్నాయి. ముందుభాగంలో, 48MP + 8MP డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 33W అడాప్టర్‌తో కూడిన 5000mAh బ్యాటరీతో వస్తుంది మరియు ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, USB-C 2.0 సాకెట్, WiFi ac, బ్లూటూత్ 5.0 మరియు 3.5mm ఆడియో జాక్‌ని కూడా పొందుతారు.

ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

Micromax In 2c

ధర : రూ.8,499

మైక్రోమ్యాక్స్ ఇన్ 2సి స్మార్ట్ ఫోన్ పెద్ద 6.52 ఇంచ్ HD+ డిస్ప్లే తో వస్తుంది మరియు ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ మైక్రోమ్యాక్స్ స్మార్ట్ ఫోన్ Unisoc T610 ఆక్టా కొర్ ప్రొసెసర్ మరియు 3జిబి ర్యామ్ మరియు 32జిబి స్టోరేజ్ జతగా వస్తుంది. ఈ ఫోన్ 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కలిగిన డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో రెండవ లెన్స్ గా డెప్త్ కెమెరాని అందించింది. ఈ కెమెరా సెటప్ ఆటో HDR, ఫేస్ బ్యూటీ, పోర్ట్రైట్ మోడ్, స్లో మోషన్ మరియు ప్రో మోడ్ వంటి ఫీచర్స్ సపోర్ట్ తో వస్తుంది. మైక్రోమ్యాక్స్ ఇన్ 2సి పెద్ద 5000 mah బ్యాటరీని 10W సాధారణ ఛార్జింగ్ టెక్నాలజీ మరియు టైప్-సి తో కలిగివుంది.

ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

Infinix Smart 6

ధర :రూ.7,499

ఈ స్మార్ట్‌ ఫోన్ ఒక పెద్ద 6.6 ”HD + డ్రాప్ నాచ్ డిస్ప్లే మరియు 88.4% స్క్రీన్ టు బాడీ రేషియోతో 500 నిట్స్  బ్రైట్నెస్ తో వస్తుంది.ఈ స్మార్ట్ 6 బడ్జెట్ స్మార్ట్ ‌ఫోన్  ఈ విభాగంలో మంచి ఫోటోలను అందించే కెమెరాతో రూపొందించబడింది. ఇది 8MP AI డ్యూయల్ రియర్ కెమెరాను కలిగి ఉంది, ఇది డ్యూయల్ LED ఫ్లాష్‌ తో పాటు f / 2.0 ఎపర్చర్‌ తో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోనులో ఎఫ్ / 2.0 ఎపర్చరుతో 5MP సెల్ఫీ కెమెరా, AI HDR, బ్యూటీ మోడ్ మరియు  పోర్ట్రెయిట్ మరియు వైడ్ సెల్ఫీ వంటి మల్టి కెమెరా మోడ్లు ఉన్నాయి. ఇది కేవలం 8 వేల ధర విభాగంలో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో పాటు పవర్ మారథాన్ టెక్ తో వస్తుంది.

ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

iQOO Z6 Pro

ధర : రూ.23,999

ఈ ఐకూ జెడ్ 6 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగిన 6.44 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ AMOLED డిస్ప్లే ని కలిగి వుంది.ఈ డిస్ప్లే 1300 పీక్ బ్రైట్నెస్ అందించ గలదు మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778G 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. ఈ లేటెస్ట్ ఐ కూ 5G ఫోన్ వెనుక డ్యూయల్ ట్రిపుల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 64MP ప్రధాన కెమెరాకి జతగా అల్ట్రా వైడ్ కెమెరా మరియు 4cm మ్యాక్రో సెన్సార్ తో వస్తుంది. ఈ 5G స్మార్ట్ ఫోన్ లో 4,700mAh బ్యాటరీని 66W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. మొబైల్ గేమర్‌ లను ఆకర్షించడానికి, Z6 ప్రో 4D లీనియర్ వైబ్రేషన్ మోటార్ ని జతచేసింది.

ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

Samsung Galaxy M53 5G

ధర : రూ.23,999

శామ్సంగ్ గెలాక్సీ M53 5G స్మార్ట్ ఫోన్ లో ఇన్ఫినిటీ-0 కటౌట్ కలిగిన 6.7- ఇంచ్ Super AMOELD డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ ఫోన్ Dimensity 900 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో ఉంటుంది. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh భారీ బ్యాటరీని కలిగివుంటుంది. ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరాను ఇన్ఫినిటీ-0 కటౌట్ లో కలిగివుంటుంది. అలాగే, 108MP ప్రధాన సెన్సార్, 8MP అల్ట్రావైడ్, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మాక్రో సెన్సార్ కలిగిన క్వాడ్ రియర్ కెమెరా మాడ్యూల్‌ను వుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా One UI 4.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.

ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

Redmi 10A

ధర : రూ .8,499

షియోమి రెడ్‌మి 10ఎ ఒక 6.53-అంగుళాల HD + రిజల్యూషన్ గల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. Redmi 10A మీడియా టెక్ హెలియో జి 25 ప్రాసెసర్ కి జతగా 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ ఆప్షన్లతో జతచేయబడుతుంది. అదనంగా, 1జీబీ RAM బూస్ట్ టెక్నాలజీతో కూడా వస్తుంది. ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు మెమరీ విస్తరణకు మద్దతు ఇస్తుంది. ఇది MIUI 12.5 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది. రెడ్‌మి 10ఎ లో వెనుక క్వాడ్ కెమెరా అనిపించేలా సెటప్ వున్నా కూడా 13 ఎంపి కెమెరా సింగల్ కెమెరాని మాత్రమే అందించింది. ముందు నాచ్ కటౌట్‌లో 5MP సెల్ఫీ కెమెరా వుంది. షియోమి రెడ్‌మి 10A లో 5,000 mAh  బ్యాటరీ 10W రెగ్యులర్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉంటుంది.

ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

Realme GT 2

ధర : రూ.34,999

రియల్‌మీ జిటి 2  స్మార్ట్ ఫోన్ 6.62 ఇంచ్ FHD+ E4 AMOLED డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది మరియు 1300 నిట్స్ పీక్ బ్రిట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 12GB LPDDR5 ర్యామ్ మరియు 256GB UFS 3.1 స్టోరేజ్ కూడా ఉంది. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని అందించింది. ఇందులో, OIS సపోర్ట్ కలిగిన 50MP SonyIMX766 ప్రధాన సెన్సార్ కి జతగా  8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు 2MP మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. ముందు 16MP SonyIMX471 సెన్సార్ సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ Realme UI 3.0 సాఫ్ట్ వేర్ పైన Android 11 OS తో నడుస్తుంది. ఈ ఫోన్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 బ్యాటరీతో వచ్చింది.

ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

Infinix Hot 11 2022

ధర : రూ.8,999

ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7-అంగుళాల FHD + రిజల్యూషన్ గల డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది గరిష్టంగా 550 నిట్స్ బ్రైట్నెస్ అందించగలదు. ఈ ఫోన్ మీడియా Unisoc T610 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది మరియు ఇది  4GB RAM మరియు 64GB స్టోరేజ్ తో జత చేయబడుతుంది. అలాగే, ఇది XOS  10 ఆధారితంగా ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది.  ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్-కెమెరా సెటప్ తో వస్తుంది. దీనిలో 13MP+ 2MP సెటప్ మరియు LED ఫ్లాష్ ను కూడా జతచేసింది. ముందు భాగంలో, 8MP AI సెల్ఫీ కెమెరాని కూడా అందించింది. ఈ ఫోన్ పెద్ద 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని టైప్ C సపోర్ట్ తో కలిగివుంటుంది.

ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

vivo T1 5G

ధర : రూ.15,999

Vivo T1 5G స్మార్ట్ ఫోన్ 6.58 ఇంచ్ FHD+ LCD డిస్ప్లేని కలిగివుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇక కెమెరాల విభాగంలో, వివో T1 5జి ఫోన్ 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ మరియు 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన Funtouch OS 12 స్కిన్ పైన నడుస్తుంది.

ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

Oppo F21 Pro

ధర : రూ.22,999

ఒప్పో ఎఫ్21 ప్రో పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.43 ఇంచ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో కలిగివుంటుంది. F12 Pro డిస్ప్లేలో అందించిన పంచ్ హోల్ కటౌట్ లో 32 ఎంపి సెల్ఫీ కెమెరాని కలిగివుంది. Oppo F21 Pro లేటెస్ట్ 6nm ప్రోసెసర్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రోసెసర్ కలిగివుంది మరియు 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో పనిచేస్తుంది. ఇందులో 64MP మైన్ కెమెరాకి జతగా 2ఎంపి డెప్త్ సెన్సార్ మరియు 2ఎంపి మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 12 ఆధారంగా ColorOS 12.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తాయి. ఈ ఒప్పో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లలో 33W SuperVOOC ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బిగ్ బ్యాటరీ కూడా వుంది. 

ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

Oppo F21 Pro 5G

ధర : రూ.26,999

Oppo F21 Pro 5G వెర్షన్ 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.43 ఇంచ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. Oppo F21 Pro 5G స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో 64MP మైన్ కెమెరాకి జతగా 2ఎంపి డెప్త్ సెన్సార్ మరియు 2ఎంపి మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 12 ఆధారంగా ColorOS 12.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తాయి. ఈ ఒప్పో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లలో 33W SuperVOOC ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బిగ్ బ్యాటరీ కూడా వుంది.

ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

Realme 9 5G

ధర: రూ.14,999

 ఈ Realme 9 5G స్మార్ట్ ఫోన్ 6.5-అంగుళాల FHD+ రిజల్యూషన్ LCD స్క్రీన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగివుంది. ఈ ఫోన్ డైమెన్సిటీ 810 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 6GB ర్యామ్ మరియు 128GB (UFS 2.1) స్టోరేజ్‌తో వస్తుంది. వెనుకవైపు, ఈ ఫోన్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, 2MP (4cm) మాక్రో సెన్సార్ మరియు 2MP B/W సెన్సార్‌ ఉన్నాయి.అలాగే, ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కలిగివుంది. డ్యూయల్ సిమ్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, 5GB వరకు వర్చువల్ ర్యామ్, డ్యూయల్-మోడ్ 5G, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్, బ్లూటూత్ 5.1 మొదలైన ఫీచర్లు కూడా అందుకుంటారు. మార్చి 14న మధ్యాహ్నం 12 గంటలకు ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది.

ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

Realme 9 5G SE (Speed Edition):

ధర: రూ.19,999

రియల్ మీ 9 5G SE ఫోన్ 6.6-అంగుళాల 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ LCD స్క్రీన్‌ను 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, HDR10, DCI-P3 కలర్ గామట్ మరియు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ప్యాక్ చేస్తుంది. ఈఫోనే వెనుకవైపు, 48MP ప్రధాన సెనర్ తో పాటు 2MP మాక్రో ప్లస్ మోనోక్రోమ్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరావుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778G ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 8GB LPDDR4x RAM మరియు 128GB UFS 2.2 స్టోరేజ్ లను కలిగివుంది. ఈ ఫోన్‌లో 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ కలిగిన 5000mAh బ్యాటరీ కూడా ఉంది. ఈ ఫోన్ Android 11 ఆధారిత Realme UI 2.0, డ్యూయల్ 5G సపోర్ట్, 3.5mm జాక్, WiFi 6, బ్లూటూత్ 5.2, మొదలైన వాటితో వస్తుంది. మార్చి 14న మధ్యాహ్నం 12 గంటలకు ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది.

ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

Realme C35:

ధర: రూ.11,999

రియల్ మీ సి35 స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD (2408x1080) రిజల్యూషన్ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే 180 టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ యునిసోక్ టైగర్ T616 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ Android 12 ఆధారంగా Realme UI R స్కిన్ పైన నడుస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాకి జతగా మ్యాక్రో సెన్సార్ మరియు B&W లెన్స్ కలిగిన ట్రిపుల్ కెమెరా వుంది. ముందుభాగంలో 8ఎంపి సెల్ఫీ కెమెరా కూడా వుంది.  ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ మార్చ్ 12వ తేదీ మద్యహ్నం 12 గంటలకి మొదలవుతుంది.

ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

Redmi Note 11 Pro

ధర: రూ.17,999

ఈ రెడ్ మీ నోట్ 11 ప్రో 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఇది  DCI-P3 వైడ్ కలర్ గామట్ మరియు 1200 నిట్స్ వరకూ పీక్ బ్రైట్నెస్ అందించగలదు. వెనుకవైపు, 108MP ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మాక్రో & డెప్త్ సెన్సార్‌తో కూడిన క్వాడ్ కెమెరా వుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G96 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 128GB UFS 2.2 స్టోరేజ్ లను కలిగివుంది. ఈ ఫోన్‌లో 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీ కూడా ఉంది. ఈ ఫోన్ Android 11 ఆధారిత MIUI 13 పైన నడుస్తుంది. మార్చి 23న మధ్యాహ్నం 12 గంటలకు ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది.

ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

Redmi Note 11 Pro+ 5G 

ధర: రూ.20,999

ఈ రెడ్ మీ నోట్ 11 ప్రో సిరీస్ లో Pro+  5G కూడావుంది మరియు ఈ ఫోన్ 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఇది  DCI-P3 వైడ్ కలర్ గామట్ మరియు 1200 నిట్స్ వరకూ పీక్ బ్రైట్నెస్ అందించగలదు. వెనుకవైపు, 108MP ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా వుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 256GB UFS 2.2 స్టోరేజ్ లను కలిగివుంది. ఈ ఫోన్‌లో 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీ కూడా ఉంది. ఈ ఫోన్ Android 11 ఆధారిత MIUI 13 పైన నడుస్తుంది. మార్చి 23న మధ్యాహ్నం 12 గంటలకు ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది.

ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

Realme Narzo 50

ధర: రూ.12,999

రియల్‌మీ నార్జో 50 స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే 90% స్క్రీన్ టూ బాడీ రేషియో మరియు 180 టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది.ఈ ఫోన్ మీడియాటెక్ Helio G96 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 6GB ర్యామ్ కూడా ఉంది. అదనంగా, ఈ ఫోన్ లో అందించిన డైనమిక్ ర్యామ్ ఎక్స్ ఫ్యాన్షన్ ఫీచర్లతో 5GB వరకు వర్చువల్ జత అవుతుందని కూడా తెలిపింది. ఈ ఫోన్ 50MP మైన్ సెన్సార్, 2MP మ్యాక్రో సెన్సార్ మరియు 2MP B&W  ట్రిపుల్ కెమెరాని కలిగి ఉంది. ఇక సెల్ఫీల కోసం 16MP ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ Realme UI 2.0 స్కిన్ పైన Android 11 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ 33W డార్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,000 బిగ్ బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది మరియు స్పీడ్ బ్లూ మరియు స్పీడ్ బ్లాక్ అనే రెండు కలర్ లలో లభిస్తుంది.

ఇండియాలో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మరియు వాటి వివరాలు

POCO M4 Pro 4G

ధర: రూ.14,999

ఈ POCO M4 Pro 4G ఫోన్ 6.4 అంగుళాల FHD+ AMOLED పంచ్ హోల్ డిజైన్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేటుతో కలిగివుంది. ఇది DCI-P3 సపోర్ట్ డిస్ప్లేతో ఉంటుంది. ఈ ఫోన్‌ మీడియాటెక్ Helio G96 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS ఆధారితమైన MIUI 13 స్కిన్ పైన నడుస్తుంది. ఎం4 ప్రో 4G  వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఈ సెటప్ లో 64ఎంపి ప్రధాన కెమెరాకి జతగా 8ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ ఇచ్చింది. ముందుభాగంలో, 16ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది. పోకో ఎం4 ప్రో స్మార్ట్ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ లో వేలిముద్ర సెన్సార్ ను సైడ్ లో ఇచ్చింది మరియు AI ఫేస్ అన్లాక్ కు కూడా సపోర్ట్ వుంది.  ఇందులో డ్యూయల్ స్పీకర్లు కూడా అందించింది.