ఇటీవల, ఎయిర్టెల్ తన వినియీగదారులకు ఉచిత కాలింగ్ కోసం సరైన ప్రత్యామ్నాయ మార్గాన్ని తీసుకోచ్చింది. అదే, ఈ VoWiFi కాలింగ్. ఎయిర్టెల్ వినియోగదారులు ఈ VoWiFi ఫీచరును ఉపయోగించడానికి, VoWiFi ని ఆన్ చేసి వైఫై నెట్ వర్క్ లో కనెక్టయ్యి ఉండాలి. ఈ సేవ భారతదేశంలోని మొత్తం ఎయిర్టెల్ చందాదారుల కోసం ఏదైనా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లో ఉపయోగించవచ్చు.
ఈ VoWiFi కాలింగ్ ఉపయోగించడం కోసం, వినియోగదారులకు దీనికి అనుకూలమైన ఫోన్ మరియు స్థిరమైన Wi-Fi కనెక్షన్ అవసరం. ప్రస్తుతం, ఈ VoWiFi సేవ ఎయిర్టెల్ కోసం 100 పైగా హ్యాండ్ సెట్లల్లో పనిచేస్తుంది. ఈ ఫోన్ల పూర్తి లిస్ట్ ఇక్కడ చూడండి మరియు మీ వద్ద ఈ ఫోన్ ఉన్నట్లయితే, మీరు ఉచితంగా రోజంతా కాలింగ్ చేసుకోవచ్చు.
ఆపిల్ ఐఫోన్ విషయానికి వస్తే, ఆపిల్ యొక్క Iphone 6 సిరీస్ నుండి ఆపై వచ్చిన అని సిరీస్ ఫోన్లలో ఈ wifi కాలింగ్ పనిచేస్తుంది. ఐఫోన్ 6s, ఐఫోన్ 6s ప్లస్, ఐఫోన్ 7, ఐఫోన్ 6 ప్లస్, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ X, ఐఫోన్ XR, ఐఫోన్ XS, ఐఫోన్ XS మ్యాక్స్,ఐఫోన్ SE, ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ X ప్రో మ్యాక్స్,
ఇక వన్ ప్లస్ బ్రాండ్ ఫోన్ల గురించి చర్చిస్తే, వన్ ప్లస్ యొక్క 6 ఫోన్లు ఈ జాబితాలో ఉంచబడ్డాయి. ఈ జాబితాలో వన్ ప్లస్ 7 మొబైల్ ఫోన్లతో మొదలవుతుంది. ఇందులో వన్ ప్లస్ 7, వన్ ప్లస్ 7 ప్రో, వన్ ప్లస్ 7 టి, వన్ ప్లస్ 7 టి ప్రో, వన్ ప్లస్ 6, వన్ ప్లస్ 6 టి మొదలైనవి ఉన్నాయి.
ఇక షావోమి బ్రాండ్ యొక్క స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే, రెడ్మి కె 20, రెడ్మి కె 20 ప్రో, పోకో ఎఫ్ 1, రెడ్మి 7, రెడ్మి 7A, రెడ్మి నోట్ 7 ప్రో, రెడ్మి Y3, రెడ్మి నోట్ 8 సహా షావోమికి చెందిన 7 స్మార్ట్ ఫోన్లు ఈ జాబితాలో ఉన్నాయి.
ఎయిర్టెల్ యొక్క ఉచిత WiFi కాలింగ్ తో పనిచేసే, సుమారు 14 శామ్సంగ్ స్మార్ట్ ఫోన్లు ఈ జాబితాలో చేర్చబడ్డాయి.
ఈ జాబితాలోని శామ్సంగ్ ఫోన్లు : శామ్సంగ్ గెలాక్సీ J 6, A 10 s , ఆన్ 6, M 30s, S10, S 10 +, S 10 e, M 20, నోట్ 10, నోట్ 10 లైట్, నోట్ 9, నోట్ 10+, M30, A30s , A50S ఈ జాబితాలో భాగంగా వున్నాయి.
ఇక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన ఇన్ఫినిక్స్ యొక్క ఫోన్ల విషయానికి వస్తే 9 ఫోన్లు ఈ సౌకర్యంతో ఉంటాయి.
అవి : హాట్ 8, S 5 లైట్, S 5 ప్రో, స్మార్ట్ 3, స్మార్ట్ 2, నోట్ 5, S 4, హాట్ 7, హాట్ 8, మొదలైన 9 ఫోన్లు ఈ WiFi ఉచిత కాలింగ్ స్మార్ట్ ఫోన్ జాబితాలో ఉన్నాయి.
ఇది కాకుండా, టెక్నో మొదలైన బ్రాండ్ల గురించి మాట్లాడితే ఈ బ్రాండ్ యొక్క 8 ఫోన్లు ఈ జాబితాలో వున్నాయి.
అవి : ఫాంటమ్ 9, స్పార్క్ గో ప్లస్, స్పార్క్ గో, స్పార్క్ ఎయిర్, స్పార్క్ 4 (KC2), స్పార్క్ 4(KC2J), కామోన్ 12 ఎయిర్, స్పార్క్ పవర్ మొదలైనవి.
మోబి స్టార్ యొక్క 6 స్మార్ట్ ఫోన్లు కూడా ఈ జాబితాలో చేర్చబడ్డాయి, వీటిని మీరు ఇక్కడ చూడవచ్చు
అవి : మొబిస్టార్ C 1, C 1 లైట్, C 1 షైన్, ఇ 1 సెల్ఫీ, ఎక్స్ 1 నోచ్.
పానాసోనిక్ నుండి వచ్చిన 4 ఫోన్లు ఈ జాబితాలో వున్నాయి.
అవి : పానాసోనిక్ P100, పానాసోనిక్ ఎల్యూగా రే 700, పానాసోనిక్ P95 మరియు పానాసోనిక్ P85 NXT
ఈ ఎయిర్టెల్ ఉచిత wifi కాలింగ్ సౌకర్యంతో పనిచేసే వాటిలో వివో బ్రాండ్ కి సంబంధించి కేవలం రెండు స్మార్ట్ ఫోన్లు మాత్రమే ఉన్నాయి.
అవి : వివో V15 ప్రో మరియు వివో V17
కూల్‌ప్యాడ్ నుండి కూడా 5 స్మార్ట్ ఫోన్లు ఈ ఎయిర్టెల్ WiFi కాలింగ్ సౌకర్యంతో పనిచేస్తాయి
అవి : కూల్‌ప్యాడ్ కూల్ 3, కూల్ 5, నోట్ 5, మెగా 5 సి, నోట్ 5 లైట్.
మైక్రోమ్యాక్స్ నుండి కూడా కొన్ని స్మార్ట్ ఫోన్లు ఈ ఎయిర్టెల్ WiFi కాలింగ్ సౌకర్యంతో పనిచేస్తాయి
అవి : మైక్రోమ్యాక్స్ ఇన్ఫినిటీ N12, మైక్రోమ్యాక్స్ N8216, మైక్రోమ్యాక్స్ B5 మొదలైన 3 స్మార్ట్ ఫోన్లు వున్నాయి.
ఒప్పో నుండి కూడా కేవలం 1 స్మార్ట్ ఫోన్ మాత్రమే ఈ ఎయిర్టెల్ WiFi కాలింగ్ సౌకర్యంతో వస్తున్నట్లు ఎయిర్టెల్ తన జాబితాలో లిస్ట్ చేసింది.
అవి : OPPO F15
జియోనీ నుండి కూడా 2 స్మార్ట్ ఫోన్లు ఈ ఎయిర్టెల్ WiFi కాలింగ్ సౌకర్యంతో వస్తున్నట్లు ఎయిర్టెల్ తన జాబితాలో లిస్ట్ చేసింది.
అవి : జియోనీ F205 ప్రో మరియు జియోనీ F103 ప్రో
ఒప్పో నుండి కూడా కేవలం 2 స్మార్ట్ ఫోన్స్ మాత్రమే ఈ ఎయిర్టెల్ WiFi కాలింగ్ సౌకర్యంతో వస్తున్నట్లు ఎయిర్టెల్ తన జాబితాలో లిస్ట్ చేసింది.
అవి : స్పైస్ F311 మరియు స్పైస్ M5353
జోలో నుండి కూడా కేవలం 1 స్మార్ట్ ఫోన్ మాత్రమే ఈ ఎయిర్టెల్ WiFi కాలింగ్ సౌకర్యంతో వస్తున్నట్లు ఎయిర్టెల్ తన జాబితాలో లిస్ట్ చేసింది.
అవి : XOLO ZX
ఐటెల్ నుండి కూడా కేవలం 1 స్మార్ట్ ఫోన్ మాత్రమే ఈ ఎయిర్టెల్ WiFi కాలింగ్ సౌకర్యంతో వస్తున్నట్లు ఎయిర్టెల్ తన జాబితాలో లిస్ట్ చేసింది.
అవి : ఐటెల్ A46