జూన్ 1వ తేదీ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కోసం కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది.
మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ అందించిన కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ మరియు కొత్త అప్డేట్ ఈరోజు తెలుసుకుందాం.
కొత్త డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ మరియు అప్డేట్ లు వంటివి జూన్ 1 నుంచి కొత్త రూల్స్ కింద వర్తిస్తాయి.
కాబట్టి కొత్త రూల్స్ ను పూర్తిగా తెలుసుకోవడం మరియు అర్థం చేసుకోవడం అందరికీ మంచిది.
కొత్త రూల్స్ ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ కోసం ప్రోసెస్ మారకపోయినా పేపర్ వర్క్ మాత్రం తగ్గించబడింది.
కొత్తగా తీసుకు వచ్చిన డ్రైవింగ్ రూల్స్ ప్రకారం కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసే వారికి సులభమైన విధానం తెచ్చింది.
డ్రైవింగ్ లైసెన్స్ కోసం రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ (RTO) డ్రైవింగ్ టెస్ట్ అవసరం లేదని కొత్త రూల్స్ చెబుతున్నాయి.
ప్రభుత్వ అనుమతి పొందిన డ్రైవింగ్ స్కూల్ నుండి డ్రైవింగ్ టెస్ట్ ను నిర్వహించవచ్చు మరియు ఇక్కడ మీకు సర్టిఫికెట్ అందించబడుతుంది.
డ్రైవింగ్ స్కూల్ నుండి తీసుకున్న సర్టిఫికెట్ ను డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు.
ఒకవేళ డ్రైవింగ్ స్కూల్ నుండి సర్టిఫికెట్ తీసుకొని పక్షంలో, రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ (RTO) డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వవలసి ఉంటుంది.
కొత్త రూల్స్ ద్వారా టూ వీలర్ లైసెన్స్ కోసం ప్రొసెస్ ను మరింత సరళం చేసినట్లు కూడా తెలిపింది.
ఇక కొత్త రూల్స్ ప్రకారం కొత్త డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేయడం మరింత సరళంగా ఉంటుంది.
కొత్త డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయడం కోసం sarathi.parivahan.gov.in వెబ్సైట్ లోకి వెళ్ళాలి
ఈ వెబ్సైట్ లోకి వెళ్లిన తర్వాత, క్రింద పేజ్ లో సూచించిన వద్ద State సెలెక్ట్ చేసుకోవాలి
స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు పూర్తి మెనూ తో కూడిన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ తెరుచుకున్న కొత్త పేజ్ లో మొదటిగా కనిపించే Apply For Learner License ట్యాబ్ పైన నొక్కండి.
ఇక్కడ కొత్త పేజ్ వస్తుంది మరియు అందులో అన్ని సూచనలు అందించబడతాయి మరియు సూచనలు క్రింద Continue బటన్ వుంది.
ఇక్కడ అందించిన సూచనలు అన్ని క్షుణ్ణంగా చదివిన తరువాత ఇక్కడ అందించిన Continue బటన్ పైన నొక్కండి
ఇక్కడ కొత్త పేజ్ తెరుచుకుంటుంది మరియు ఇక్కడ సూచించిన వివరాలను సెలెక్ట్ చేసుకోండి ‘Submit’ పైన నొక్కండి.
ఇక్కడ మరొక కొత్త పేజ్ తెరుచుకుంటుంది మరియు ఇక్కడ మీ ఆధార్ నెంబర్ తో అథెంటికేషన్ చెయ్యాలి.
ఇక్కడ కొనసాగింపు పేజ్ ద్వారా మీ వివరాలను అందించి అడిగిన రుసుమును చెల్లించాలి.
అలాగే, ఇదే కొనసాగింపు మీ లెర్నర్ అప్లికేషన్ కోసం డేట్ మరియు టైమ్ తో స్లాట్ బుక్ చేసుకోవాలి.
ఈ వివరాలతో RTO ను చేరుకొని మీ లెర్నర్ లైసెన్స్ ను అందుకోవచ్చు.