మోటోరోలా మోటో G మూడవ మోడల్ రిలీజ్ అయ్యి ఇప్పటికి ఇది మూడవ రోజు. దీనిని పై టెస్టింగ్ రివ్యూ లో ఉన్నాము. అది కొంచెం సమయం పడుతుంది, కావున ఈ లోపు డిజిట్ రీడర్స్ కు దీని యొక్క పెర్ఫార్మన్స్ మరియు 13MP కెమేరా samples అండ్ రివ్యూ ను అందించదలచుకున్నాము. నెక్స్ట్ స్లైడ్ కు వెళ్లండి.
ముందుగా దీని స్పెసిఫికేషన్స్ చూడండి -
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 410
CPU: 1.4GHz క్వాడ్-కోర్
RAM: 2GB
డిస్ప్లే: 5 అంగుళాల 720p
నిల్వ: 16GB
రేర్ కెమెరా: 13MP
ఫ్రంట్ కెమెరా: 5MP
బ్యాటరీ: 2470 mah
డ్యూయల్ సిమ్, 4G, మైక్రో SD కార్డ్ మద్దతు మరియు IPX7 సర్టిఫికేట్
స్లైట్ గా curve ఉంది. మోటో G 2nd gen మరియు ఇతర బ్రాండ్స్ ఫోనుల కన్నా ఇది చేతిలో బాగా ఫిట్ గా అనిపిస్తుంది.
వెనుక ప్యానల్ మంచి గ్రిప్ ఇస్తుంది ఫోన్ చేతిలో hold చేసేటప్పుడు. ప్రతీ సారి లోగో ప్లేస్మెంట్ ను revamping చేస్తుంది మోటోరోలా.
ఫోన్ కుడివైపు పవర్ పరియు వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. పవర్ బటన్ ప్రెస్ చేసేటప్పుడు ప్రత్యేకమైన pattern ఫీల్ ఇచ్చింది కంపెని.
Moto G 3rd Gen 5in HD డిస్ప్లే మరియు ఓవర్ ఆల్ ఫోన్ dimensions మోటో G 2nd gen మోడల్ వలె ఉన్నాయి. దీని సమర్ధమైన డిజైన్ కు థాంక్స్ చెప్పాలి కంపెనికు. atleast పట్టుకోవటానికి కూడా చాలా కాంపాక్ట్ గా అనిపించేలా డిజైన్ చేసింది.
Extreme viewing angles నుండి డిస్ప్లే బాగా కనిపిస్తుంది. వీడియోస్ మరియు బ్రౌజింగ్ అప్పుడు కూడా viewing angles బాగున్నాయి.
Moto G 3rd Gen లో ఫ్రంట్ కెమేరా 5MP కు అప్ గ్రేడ్ అయ్యింది.
రేర్ కెమేరా కు కూడా అప్ గ్రేడ్ వచ్చింది, 13MP డ్యూయల్ tone డ్యుయల్ led ఫ్లాష్ ఇది.
వాటర్ ప్రూఫ్ మొబైల్ అవటం వలన 10 నిముషాలు వాటర్ లో పెట్టు చెక్ చేయటం జరిగింది. ఫోన్ బాగా పనిచేసింది తరువాత కూడా. అయితే దీని కంప్లీట్ రివ్యూ డిజిట్ ఫాలోవర్స్ కు అందించిన తరువాత దీనిపై మరింత సేపు వాటర్ లో ఉంచి టెస్ట్ చేస్తాము.
synthetic benchmarks రన్ చేశాము. Moto G 3rd Gen ను ఆసుస్ జేన్ఫోన్ 2, రెడ్మి 2, మోటో G 2nd gen తో కంపేరిజన్ చూడండి.
వెనుక ఉన్న 13MP కెమేరా తో తీసిన ఫోటోస్..
Moto G 3rd Gen తో తీసిన ఇమేజెస్
గమనిక: Website లోడింగ్ కొరకు ఇమేజెస్ resize చేయబడ్డాయి.సో క్వాలిటీ కొంచెం మారి ఉండవచ్చు.