ఇప్పుడు దేశంలో మొబైల్ లోన్ యాప్ స్కామ్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఎటువంటి KYC వెరిఫికేషన్ లేదా మరింకేదైనా వెరిఫికేషన్ అవసర లేకుండా లోన్ అందిస్తామని ప్రజలను మోసం చేసే యాప్స్ ఒకదాని తరువాత ఒకటిగా వస్తున్నాయి.
ఈ యాప్స్ అన్ని కూడా చెప్ప ఒకే ఒక మాట ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా క్షణాల్లో లోన్ అప్రూవల్ ఇస్తామని మరియు వెంటనే లోన్ అమౌంట్ శాంక్షన్ అవుతుందని.
ఇంకేముంది, ఈజీ మనీకి ఆశపడే వారు వెంటనే ఈ యాప్స్ చెప్పేది నమ్మి మోసపోతారు.
మొబైల్ లోన్ యాప్ ద్వారా ఋణం తీసుకుంటే మనకు ఏమిటీ నష్టం? అనుకోకండి, ఈ యాప్స్ డౌన్ లోడ్ చేసుకొని లోన్ తీసుకునే సమయంలో మీ ఫోన్ లోని కాంటాక్ట్స్, మెసేజ్ లతో పాటుగా మీ మీడియా (ఫోటో మరియు వీడియో) గ్యాలరీకి కూడా యాక్సెస్ పొందుతారు.
ఇంకేముంది, మీరు తీసుకున్న లోన్ కు వారికీ ఇష్టం వచ్చిన వడ్డీలను వసూలు చేస్తారు. ఒకవేళ మీరు వాళ్ళు చెప్పినట్లు వినకపోతే, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మరియు మీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ లకు పంపిస్తామని, లేదా ఆన్లైన్లో పెడతామని బెదిరింపులు మొదలు పెడతారు.
ఇంకేముంది, లోన్ తీసుకొని మోసపోయిన సదరు వ్యక్తులు అడిగినంత డబ్బును చెల్లించవలసి వస్తుంది.
కట్టలేని పరిస్థితుల్లో కొందరు ఆత్మహత్యలు చేసుకున్న సఘంటనలు కూడా వున్నాయి. ఇటీవల, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లాలో ఈ యాప్ కారణంగా మొత్తం కుటుంబం ప్రాణాలు కోల్పోయింది.
ఎటువంటి KYC వెరిఫికేషన్ లేదా మరింకేదైనా వెరిఫికేషన్ అవసర లేకుండా లోన్ అందిస్తామని ఈ యాప్స్ ఆశ చూపిస్తాయి.
ప్రజలు ఈ యాప్స్ నుండి రుణాలు పొందడం చాలా సులభమైన మరియు వేగవంతమైన ప్రక్రియగా నమ్మడంతో కథ మొదలువుతుంది.
ముందుగా, ఈ యాప్ మీ ఫోన్ యొక్క సున్నితమైన వివరాల యాక్సెస్ కోసం పర్మిషన్ కోరుతుంది. లోన్ కోసం మీరు వారు అడిగిన వాటికి యాక్సెస్ ఇవ్వడంతో మీ ఫోన్ లోని కాంటాక్ట్, sms మరియు గ్యాలరీ లోని అన్ని వివరాలను వారు పొందుతారు.
దీని తరువాత, మీకు రుణాన్ని ఈ యాప్స్ అందిస్తాయి. కానీ, రీ పేమెంట్ సమయలో వారికి ఇష్టం వచ్చినట్లు వడ్డీలను మీ వద్ద నుండి వసూలు చేస్తారు. మీ వివరాలు అన్ని వారి చేతిలో ఉండడంతో వేరే గత్యంతరం లేక వారు అడిగినంత డబ్బును చెల్లిచవలసి వస్తుంది.
సింపుల్ గా చెప్పాలంటే, ఇన్స్టాంట్ లోన్ మాయలో పడి మీ ఇళ్ళు గుల్ల చేసుకోకండి. ఎటువంటి ఆంక్షలు లేదా షరతులు లేకుండా పెద్ద పెద్ద బ్యాంకులు సైతం లోన్ అప్రూవ్ చేయ్యవు.
సింపుల్ గా ఒక్క క్షణంలో మొబైల్ లోనే యాప్ ద్వారా పొందవచ్చంటే? ఆలోచించాల్సిన విషయమే.
అలాగే, మీ ఫోన్ యొక్క పూర్తి యాక్సెస్ కోరే ఏ మొబైల్ లోన్ యాప్ అయినా సరే మీ వ్యక్తిగత సమాచారాన్ని కూడా దొంగిలించగలవు.
అందుకే, అటువంటి యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు, ఆ యాప్ యొక్క ప్రామాణికతను తనిఖీ చేయండి.
అలాగే, ఆ యాప్ యొక్క అన్ని భద్రతా పేరామీటర్స్ ను జాగ్రత్తగా చదవండి మరియు మీ ఫోన్ స్టోరేజ్ మరియు కాంటాక్ట్ లను యాక్సెస్ చేయడానికి ఈ యాప్‌లను అనుమతించవద్దు.