మైక్రోమాక్స్ మీద చాలా మందికి నమ్మకం లేకపోయినా, మీరు గమనించగలిగితే, ఇండియాలో చైనా మార్కెట్ ను తట్టుకొని, కొత్త మోడల్స్ తో ముందుకు వస్తున్న బ్రాండ్ ఇది ఒక్కటే. users ఎలాంటి ఫీచర్స్ కోరుకుంటున్నారో అవి తెలుసుకొని నెలకు సుమారు రెండు మోడల్స్ తో వస్తుంది. నిన్న మైక్రోమాక్స్ కాన్వాస్ Xpress 4G మోడల్ లాంచ్ చేసింది. ఇది కంపెని నుండి వచ్చిన 13 వ 4G మోడల్. దీని ప్రత్యేకత ఏంటంటే, 2gb ర్యామ్ ఉన్న అతి చీప్ ఫోన్ ఇది. ప్రైస్ - 6,599 రూ. దీని పై మా మొదటి అభిప్రాయాలు చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.
ఫోన్ రెండు వైపులా మెటల్ trims ఉన్నాయి. కాని టోటల్ బాడీ అంతా ప్లాస్టిక్. అన్ని Low ఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ వలె ఉంటుంది లుక్స్ వైస్ గా. షార్ప్ కార్నర్స్ ఉన్నాయి. ఈ బడ్జెట్ కు ఇది ఓవర్ ఆల్ satisfication ఇస్తుంది బిల్డ్ వైస్ గా.
5in డిస్ప్లే ఉంది కాని సైడ్స్ బెజెల్స్ పెద్దవిగా ఉన్నాయి. బెజేల్స్ అంటే ఫోన్ బాడీ మరియు డిస్ప్లే గ్లాస్ కు మధ్యన ఉండే గ్యాప్. ఇది ఎంత తక్కువ ఉంటే ఫోన్ అంత స్లిమ్/కంపాక్ట్ గా ఉన్నట్లు. సో రెడ్మి 1s కన్నా పెద్దది గా కనిపిస్తుంది ఇది.
2000 mah బ్యాటరీ అండ్ 1GHz మీడియా టెక్ ఉంది దీనిలో. ఈ రెండూ అవుట్ డేటెడ్ అని చెప్పాలి. డిస్ప్లే కూడా సన్ లైట్ లో ఆల్మోస్ట్ కనపడటం లేదు.
దీనిలో 16gb ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 8MP రేర్ కెమేరా మరియు ఆండ్రాయిడ్ లాలిపాప్ మాత్రమే కొంచెం కరెంట్ gen కు తగ్గట్టుగా ఉన్నాయి. ఒకసారి ఆండ్రాయిడ్ M నెక్సాస్ కాని డివైజెస్ కు వరసుగా అప్ డేట్ వస్తే, ఇంక లాలిపాప్ కూడా అవుట్ డేటెడ్ లిస్ట్ లోకి చేరుతుంది.
దీనిలో 4G ఇంటర్నెట్ కనెక్టివిటి ఒక్కటి మాత్రం ఈ ప్రైస్ కు 2gb ర్యామ్ తో కలిసి రావటం కొంత బాగుంది
ఓవర్ ఆల్ గా మైక్రోమాక్స్ కాన్వాస్ Xpress 4G లో కొన్ని నెగటివ్స్ ఉన్నా కంపెని దీనిని ఆన్ లైన్ అండ్ ఆఫ్ లైన్ రెండింటిలోనూ సేల్స్ చేస్తే కొంచెం మార్కెట్ వచ్చేది ఏమో కాని కేవలం ఆన్ లైన్ లోనే ఫ్లిప్ కార్ట్ లో ఆల్రెడీ ఓపెన్ సేల్స్ లో సేల్ అవుతంది.