Meizu అనే చైనా కంపెని, meizu m2 నోట్ ద్వారా బాగా పరిచయం అయ్యింది ఇండియన్ మార్కెట్ లో. ఇప్పుడు కంపెని మళ్ళీ హై ఎండ్ స్పెక్స్ తో కొత్త మోడల్ లాంచ్ చేసింది. దీని పేరు Meizu Pro 5. ఇక నుండి కొత్తగా కంపెని ప్రో సిరిస్ లో ఫోన్స్ ను స్టార్ట్ చేస్తుంది. వీటి ప్రత్యేకత ఏంటంటే.. బెస్ట్ హార్డ్ వేర్ ను వీటిలో జోడించటం. meizu ప్రో 5 ను క్లోస్ పిక్చర్స్ లో చూద్దాం రండి.
Key Specs
SoC: 7420 Exynos
RAM: 3 / 4GB
డిస్ప్లే: 5.7 అంగుళాల 1080P
స్టోరేజ్: 32 / 64GB
కెమెరా: 21MP, 5MP
బ్యాటరీ: 3050 mah
OS: Android 5.1
ఫోన్ బాడీ అంతా మెటల్ unibody డిజైన్ తో వస్తుంది. అలానే బ్యాక్ ప్యానల్ లో మెటల్ బ్రష్ అప్ అయ్యి వస్తుంది. ఇది స్లిప్ అయ్యే చాన్సేస్ ఇస్తుంది.
రైట్ సైడ్ వాల్యూమ్ బటన్స్ అండ్ పవర్ బటన్ (కొంచెం భిన్నంగా ఉంది) ఉన్నాయి.
సిమ్ కార్డ్ ట్రే రెండు స్లిమ్ స్లాట్స్ తో లెఫ్ట్ సైడ్ ఉంది. అయితే ఇది కూడా meizu m2 నోట్ లానే HYBRID సిమ్ స్లాట్ తో వస్తుంది. రెండు సిమ్స్ మరియు sd కార్డ్ ఒకేసారి use చేయటానికి అవ్వదు.
బాటం లో సింగల్ సైడ్ లో వాల్యూమ్ గ్రిల్స్ usb టైప్ c పోర్ట్ ఉన్నాయి. M చార్జ్ పేరుతో దీనిలో క్విక్ చార్జింగ్ ఫీచర్ ఉంది. ఇది 0 నుండి 60 శాతం బ్యాటరీ 30 నిమిషాలలో చార్జ్ అవుతుంది.
5.7 సూపర్ ఎమోలేడ్ డిస్ప్లే 1080P రిసల్యుషణ్ తో వస్తుంది. మంచి వ్యూయింగ్ అంగ్లెస్ మరియు కాంట్రాస్ట్ ratios ఉన్నాయి డిస్ప్లే లో.
ఫోన్ కు బ్యాక్ అండ్ హోమ్ ఫంక్షన్స్ రెండూ ఒకే దానిలో పనిచేసే బటన్ ఉంది. ఇది ఫింగర్ ప్రింట్ స్కానర్ గా కూడా పనిచేస్తుంది. టెస్ట్స్ లో ఇది చాలా బాగా పనిచేస్తుంది.
21 కెమెరా ఉంది వెనుక. దీనిలో సోనీ IMX230 సెన్సార్, లేసర్ అసిస్ట్ అండ్ phase డిటెక్షన్ ఆటో ఫోకస్ ఉన్నాయి.
రెండు కలర్ వేరియంట్స్ లో వస్తుంది. ఒకటి darker స్టీల్ గ్రే, మరొకటి లైట్ కలర్ అల్యూమినియం కలర్
Flyme os 4.5 పై ఆండ్రాయిడ్ 5.1 తో రన్ అవతుంది. అయితే కంపెని మాత్రం వచ్చే నెలలో flyme os 5 వెర్షన్ కు meizu ప్రో 5 ను అప్ గ్రేడ్ చేస్తుంది అని చెబుతుంది.
Exynos 7420 SoC వలన, ఫోన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. Antutu సింథటిక్ స్కోర్స్ టెస్ట్ రన్ చేస్తే, స్కోర్ 75429 వచ్చింది.