2016 లో కూడా వెరీ రీసెంట్ గా చైనా లో లాంచ్ అయిన meizu M3 నోట్ కు బడ్జెట్ ఫోనుల్లో బెస్ట్ ఫోన్ అనిపించుకునే సామర్ద్యము ఉంది. well built, గుడ్ బ్యాటరీ లైఫ్, క్లిన్ డిజైన్ కలిగిన ఈ మోడల్ ఇందియాల్ వచ్చే నెలలో రిలీజ్ కానుంది. ఈ లోపు దీని ఇమేజెస్ మరియు ఇన్ఫర్మేషన్ చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి..
Meizu m3 నోట్ యొక్క స్పెసిఫికేషన్స్ చూడండి ఇక్కడ..
ప్రొసెసర్: MediaTek Helio P10 octa-core (MT6755)
GPU: Mali-T860 MP2
RAM: 2GB/3GB
Storage: 16GB/32GB
డిస్ప్లే: 5.5-inch, 1080x1920-pixel
Cameras: 13MP (Primary), 5MP (Front)
బ్యాటరీ: 4100mAh
OS: Android v5.1 Lollipop (FlyMe 5.1)
దీనిలో 5.5-inch LTPS డిస్ప్లే 1080x1920 pixel రిసల్యుషణ్ తో వస్తుంది. చాలా రిచ్ అండ్ impressive గా ఉంది. m2 Note లో కూడా ఇదే తరహా లో ఉండేది డిస్ప్లే.
Helio P10 SoC octa-core సెట్ అప్ కలిగి ఉంది. ఇంతవరకు గమనించిన దాని ప్రకారం m3 Note డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది. అయితే రెడ్మి నోట్ 3 లోని స్నాప్ డ్రాగన్ 650 కన్నా ఫాస్ట్ గా ఉంటుందా అనే విషయం మాత్రం ఇంకా తెలియవలసి ఉంది. అయినా సరే డైలీ టాస్క్ లను ఈజీగా స్మూత్ గా పెర్ఫరం చేసే కేపబిలిటిస్ కనిపిస్తున్నాయి మీడియా టెక్ P10 SoC లో.
డిస్ప్లే బాగా బ్రైట్ గా ఉంది. కలర్స్ షిఫ్టింగ్ లు కూడా లేవు. ఇది చాలా మంచి విషయం. . మెటల్ యూనీబాడీ నిర్మాణం బాగా ఆకట్టుకుంటుంది, మరియు ఫోన్ యొక్క సమర్ధతను కచ్చితంగా పెంచుతుంది బిల్డ్.
క్రింద singular బటన్ ఉంది ఫ్రంట్ సైడ్. ఇది home మరియు బ్యాక్ బటన్ గా కూడా పనిచేస్తుంది. అంతేకాదు దానిలోనే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. M2 నోట్ లో కూడా ఇదే తరహా ఉంది. అలవాటు పడటానికి కొంచెం టైమ్ పడుతుంది కాని బాగా useful గా ఉంటుంది అలవాటు అయితే.
ఫ్రంట్ లోని 5MP కెమెరా బాగుంది బడ్జెట్ ప్రకారం చూస్తె. Meizu m3 Note FlyMe OS 5.1 బేస్డ్ ఆండ్రాయిడ్ లాలిపాప్ పై రన్ అవుతుంది. ui విషయం ఇండియన్ డివైజ్ రిలీజ్ అయినప్పుడు తెలియజేస్తాను.
బాటం లో స్పీకర్ గ్రిల్, usb పోర్ట్ వంటి స్టాండర్డ్ డిజైనింగ్ ఉంది.
వెనుక ఉన్న మెటల్ పనెల్ రెడ్మి నోట్ 3 అంత slippery(జారిపోయే విధంగా) లేదు. అంటే దాని కన్నా దీనిలో బెటర్ గ్రిప్ ఉంది. లోపల 17 గంటలు బ్యాక్ అప్(అని కంపెని చెబుతుంది) ఇచ్చే 4100 mah బ్యాటరీ ఉంది. ప్రివియస్ Meizu డివైజెస్ బ్యాక్ అప్ ను బట్టి కంపెని చెప్పే బ్యాక్ అప్ లైఫ్ నిజమైనా ఆశ్చర్యం లేదు.
13MP ప్రైమరీ కెమెరా డ్యూయల్ tone LED ఫ్లాష్ తో వస్తుంది. ఫర్స్ట్ ఇంప్రెషన్స్ లో ఫోటోస్ లో మంచి డిటేల్స్ ఉన్నాయి. మీరు కెమెరా శాంపిల్స్ చూడటానికి next స్లైడ్స్ కు వెళ్ళండి..
Meizu m3 నోట్ కెమెరా శాంపిల్ 1: Outdoor, మబ్బుగా ఉన్న వాతావరణంలో...
Meizu m3 నోట్ శాంపిల్ 2: Indoor, warm వాతావరణంలో..
Meizu కంపెని M3 నోట్ మోడల్ తో Xiaomi Redmi Note 3 కు గట్టి పోటీ ఇచ్చేటట్లు కనిపిస్తుంది. రెడ్మి నోట్ 3 కు ధీటుగా Meizu ప్రైస్ ను అనౌన్స్ చేస్తే Meizu M3 నోట్ మోస్ట్ వాంటెడ్ బడ్జెట్ సెగ్మెంట్ లో రారాజు అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే కంక్లుజన్ మాత్రం ఇండియన్ మొబైల్ రిలీజ్ అయితేనే తెలుస్తుంది. ప్రస్తుతం మేము చైనా నుండి ఈ మొబైల్ వాడి మీకు ఈ విషయాలను తెలియజేస్తున్నాము.