జనవరి 6,7,8,9 తేదిలలో లాస్ వేగాస్ లో జరగుతున్న CES లో కొన్ని సరదా గాడ్జెట్స్ రిలీజ్ అయ్యాయి. వీటిలో కొన్ని కేవలం ఇన్నోవేషన్ గానే ఉండిపోతాయి. బయటకు మార్కెట్ లో వస్తాయా అనే ప్రశ్నకు సమాధానం ఉండదు. కాని టెక్ గిక్స్ కు ఇలాంటివి తెలుసుకోవాలని ఇంటరెస్ట్ ఉంటుంది. అప్ డేట్ గా ఉండటానికి అవేంటో క్రిందకు స్క్రోల్ చేసి చూడండి లేదా నెక్స్ట్ బటన్ పై ప్రెస్ చేయండి.
Hoverbutler
ఇంటెల్ అండ్ segaway తయారు చేసిన hoverboard with రోబో. డిస్ప్లే తో వీడియోస్ & ఎక్స్ప్రెషన్స్ చూపించటానికి ఉంటుంది. టాస్క్స్ like ఓపెనింగ్ డోర్స్ కూడా చేస్తుంది.
సోమాబార్ రోబోటిక్ bartender
దీని గురించి మొన్న చెప్పుకున్నాము. ఇది కాక టెయిల్స్ మిక్స్ చేస్తుంది. WiFi పై వర్క్ అవుతుంది.యాప్ ద్వారా కూడా మిక్సింగ్ చేయగలరు. టోటల్ 6 డిఫరెంట్ అల్కహల్స్ ను స్టోర్ చేయగాలదు.
ReliefBand Anti-Sickness Bracelet సిక్ నెస్ ఏదైనా సరే.. మార్నింగ్ sickness, లేదా ట్రావెలింగ్ ఇలా దేనినైనా ఈ బాండ్ తో ఫ్రీ అవుతారు.
స్టార్ వార్స్ ఫోర్స్ బాండ్
స్టార్ వార్స్ రీసెంట్ ఫిలిం సూపర్ హిట్ అయ్యింది. దానిలో BB-8 వాడటం జరిగింది. ఇది రోబోట్ టాయ్. ఇప్పుడు దీని wrist బాండ్ తో కేవలం చేతి కదలికలతో కంట్రోల్ చేయగలము.
HairMax
హెయిర్ ప్రాబ్లెం ఉందా? $799 డాలర్స్ ప్రైస్ తో వస్తున్న హెయిర్ మాక్స్ లేసర్ ట్రీట్మెంట్ చేస్తుంది. అంటే తొలి దశలో ఉన్న హెయిర్ ఫాల్ కొరకు రోజు 90 సేకేండ్స్ ఈ హెడ్ బాండ్ ను వాడితే పనిచేస్తుంది.
స్లీప్ నంబర్
టెంపరేచర్ నుండి diet వరకూ మీకు అవసరమైనవి ట్రాక్ చేస్తుంది స్లిప్ ట్రాకింగ్ ద్వారా.
Digisole స్మార్ట్ shoes
యాప్ ద్వారా కంట్రోల్ చేస్తూ , పాదాలను warm గా ఉంచటం, షూస్ టైట్ చేయటం వంటివి చేస్తుంది.
Derma facial beautification సిస్టం
మొటిమలు, ఫేస్ మార్క్స్ వంటివి ఉన్నాయా. ఒకసారి మాస్క్ వేసుకోండి. ఇది వాటి పై పని చేస్తుంది.
Kolibree కిడ్స్ స్మార్ట్ టూత్ బ్రష్
బ్లూటూత్ కనెక్షన్ ద్వారా బ్రష్ మీ స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ కు కనెక్ట్ అవుతుంది. ఇది పిల్లలు బ్రష్ చేసే సమయంలో వాళ్ళ బ్రషింగ్ డేటా తో పాటు బ్రషింగ్ ను ఫన్ గా చేసేందుకు గేమింగ్ కూడా ఇస్తుంది.