ప్లే స్టోర్ లో చాలా లాక్ స్క్రీన్ యాప్స్ ఉన్నాయి. కాని చాలా మంది, లాంచర్ అంటే ఓకే కాని లాక్ స్క్రీన్ కు కూడా వేరే థర్డ్ పార్టీ యాప్ ఎందుకు అని వాటిని అస్సలు చూడటానికి కూడా ప్రయత్నం చేయరు. ఇప్పుడు ప్లే స్టోర్ లో ఉన్న కొన్ని బెస్ట్ లాక్ స్క్రీన్ యాప్స్ తో పాటు వీటిని కూడా లాంచర్స్ వలే ఎందుకు కన్సిడర్ చేయాలో తెలుసుకుంటారు. నెక్స్ట్ బటన్ లేదా క్రిందకు స్క్రోల్ చేయండి.
Cover
దాదాపు లాక్ స్క్రీన్ లో ఏమి ఏమి ఉండాలో అన్నీ ఉంటాయి దీనిలో కాని సెక్యూర్ లాకింగ్ ఉండదు. అంటే పాస్ వర్డ్ లేదా pattern లాకింగ్ ఉండదు కేవలం స్వైప్ లాకింగ్. ముందు చూడగానే ఎటువంటి స్పెషల్ అనిపించదు, కాని ఐకాన్స్ పై స్వైప్ చేస్తే బ్యాక్ గ్రౌండ్ లో యాప్ ఓపెన్ అయ్యి క్క్విక్ view చూపిస్తుంది. ఆటోమేటిక్ గా టైమ్ ప్రకారం యాప్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ వాల్ పేపర్ మారుతుంది.
ఎండ్ లైన్ - ఎవరు మెసేజ్ చేసారు లేదా క్విక్ అప్ డేట్స్ కొరకు ఫోన్ డిఫాల్ట్ లాక్ ను unlock చేసే అవసరం లేకుండా లాక్ స్క్రీన్ లోనే వాటిని స్వైప్స్ ద్వారా తెలుసుకునేలా చేస్తుంది.
యాప్ డౌన్లోడ్ కొరకు పైన names పై క్లిక్ చేయండి.
Echo నోటిఫికేషన్ లాక్ స్క్రీన్
దీనిలో ఉన్న డిఫరెంట్ ఫీచర్స్ ఏంటంటే.. నోటిఫికేషన్స్ చాలా డిటెల్డ్ గా చూపిస్తుంది. వాట్స్ అప్ నుండి 3 మెసేజెస్ వస్తే మూడింటినీ సెపరేట్ గా 3 మెసేజెస్ లా చూపిస్తుంది. అలాగే వాటిలో దేనినైన లాంగ్ ప్రెస్ చేస్తే తరువాత నోటిఫికేషన్ ను మళ్ళీ రిమైండ్ చేస్తుంది. నోటిఫికేషన్స్ ను రెండు కేటగిరిస్ లా పెట్టుకోగలరు. ప్రియారిటీ అండ్ సోషల్ గ్రూప్స్ ను సెట్ చేసుకోగలరు.
ఎండ్ లైన్ - డిటెల్డ్ నోటిఫికేషన్స్ కు బెస్ట్ యాప్
Go Locker
విపరీతమైన customisation ఇష్టపడే వారికీ GO యాప్స్ అన్ని విపరీతమైన customisation ఇష్టపడే వారికీ బెస్ట్ చాయిస్. సో ఈ లాక్ స్క్రీన్ కూడా. డిఫరెంట్ లాక్ స్క్రీన్ థీమ్స్, పర్సనల్ ఆప్షన్స్, అంటే విండోస్ వలె కావాలన్నా సెట్ చేసుకోగలరు. దీనిలో ఒక స్పెషల్ ఆప్షన్ ఏంటంటే పాస్వర్డ్ లేదా pattern లాకింగ్ తో పాటు Gesture అన్ లాకింగ్ కూడా సెట్ చేసుకోగలరు.
ఎండ్ లైన్ - ప్రతీ చిన్న విషయాన్ని నచ్చినట్టుగా సెట్ చేసుకోవటానికి ఇష్టపడే వారికీ ఇది.
Next లాక్ స్క్రీన్
ఇది మైక్రోసాఫ్ట్ తయారు చేసిన ఆండ్రాయిడ్ లాక్ స్క్రీన్ యాప్. బ్యాక్ గ్రౌండ్ లాక్ స్క్రీన్ వాల్ పేపర్స్ తో చూసిన వెంటనే ఇది బాగా attract చేస్తుంది. ఇవి మైక్రోసాఫ్ట్ సర్చ్ క్లైంట్ Bing సోర్స్ నుండి ఆటోమేటిక్ గా మారుతుంటాయి. క్రింద నుండి పైకి స్వైప్ చేస్తే యాప్స్ అండ్ సెట్టింగ్స్ చూస్తారు. ఇవి మీ లొకేషన్ బట్టి మారుతుంటాయి. ఏ నోటిఫికేషన్స్ దీనిపై కనపడాలి అని కూడా సెట్ చేసుకోగలరు.
ఎండ్ లైన్ - క్లాసిక్ లుక్స్ ను ఇష్టపడే వారికీ నచ్చుతుంది.
ఇదే కంపెని నుండి వచ్చిన మరొక లాక్ స్క్రీన్ యాప్ గురించి ఈ లింక్ లో వివరించటం జరిగింది. ఇది చాలా బాగుంటుంది.
ZUI లాక్ స్క్రీన్
స్మూత్ యానిమేషన్స్. బ్రైట్ కలర్స్, ఫ్రెష్ లుక్. దీనికి కూడా క్రింద నుండి పైకి స్వైప్ చేస్తే సెట్టింగ్స్ బార్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాప్స్ షర్ట్ కట్స్ యాడ్ చేయగలరు. కలర్ ఫుల్ panel. నోటిఫికేషన్ చూపిస్తుంది కాని లోపల డిటెల్స్ ను మాత్రం కావాలంటే కనపడకుండా సెట్ చేసుకునే ప్రైవేసీ ఫీచర్ ఉంది. దీనికి కూడా పాస్ వర్డ్ లేదా pattern లాకింగ్ కాకుండా ఫేవరేట్ వ్యక్తుల పిక్స్ పై టాప్స్ చేస్తే అన్ లాకింగ్ అయ్యేలా ఆప్షన్ ఉంది. ఫన్ గా ఉంటుంది అన్ లాకింగ్. మరియు అన్ లాకింగ్ చేసే సమమయంలో ఎవరైనా మీ పాస్ వర్డ్ చూసే సందర్భాలను నుండి విముక్తి ఇస్తుంది.
Conclusion
లాక్ స్క్రీన్ అనేది అనుకోకుండా బటన్స్ లేదా టచ్ ప్రెస్ అయ్యి ఫోన్ ఫంక్షన్స్ ను వాడకుండా ఉంచేందుకు invent చేయబడిన కాన్సెప్ట్. కాని అది ఇప్పుడు టైమ్ అండ్ డేట్ ను చూపించే విషయం నుండి చాలా ఫీచర్స్ తో రావటం వలన ఫోన్ లోని చాలా అవసరాలను ఫోన్ అన్ అన్ లాకింగ్ చేయకుండానే తీరుస్తుంది. మాకు బాగా నచ్చిన లాక్ స్క్రీన్ యాప్ అయితే - నెక్స్ట్ లాక్ స్క్రీన్. మినిమల్ డిజైన్ బట hidden ఫంక్షన్స్. దీని కన్నా Picturesque లాక్ స్క్రీన్ ఇంకా బాగుంటుంది. దానిలో మీ చుట్టూ జరిగే స్టోరీస్ కూడా ఉంటాయి. వాటిని చదవటానికి ఫోన్ అన్ లాకింగ్ కూడా చేయనవసరం లేదు. సెపరేట్ గా సెక్యూర్ బ్రౌజర్ లో స్టోరీ ఓపెన్ చేస్తుంది. దీని లింక్ పైన మైక్రోసాఫ్ట్ నెక్స్ట్ లాక్ స్క్రీన్ యాప్ వద్ద ఉంటుంది.
యాప్స్ డౌన్లోడ్ చేయటనికి వాటి పేర్ల పై క్లిక్ చేయండి.