కేవలం 10,000రూపాయల కంటే అతక్కువ ధరలో ఒక స్మార్ట్ ఫోన్ కొనాలని మీరు అనుకుంటున్నారా/ అయితే తప్పకుండా ఈశీర్షిక మీకు ఉపయోగపడచ్చు. ఈ బడ్జెట్ ధరలో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోవున్న మరియు త్వరలో సేల్ కి రానున్న స్మార్ట్ ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాను. ఇప్పుడు బడ్జెట్ ధరలో మంచి స్పెక్స్ కలిగిన ఆ స్మార్ట్ ఫోన్లను చూద్దాం.
ఇటీవల విడుదల చేరిన ఈ రియల్మీ C2 , 2GHz వద్ద క్లాక్ చేయబడిన, మీడియా టెక్ హీలియో P22ప్రాసెసర్ శక్తికి జతగా 2GB/3GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 16GB/32GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఇది 13+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 5MP సెల్ఫీ కెమెరాతో పాటుగా ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.5,999 ప్రారంభ ధరతో లభిస్తుంది మరియు దీని యొక్క మొదటి సేల్ మే 15వ తేదికి జరగనుంది.
ఇన్ఫినిక్స్ సంస్థ నుండి కేవలం రూ.6,999 ధరలో మూడు కెమెరాలతో, ఇటీవల ఇండియాలో లాంచ్ చేయబడినటువంటి ఈ స్మార్ట్ 3 ప్లస్ స్మార్ట్ ఫోన్, ఒక పెద్ద 6.4 అంగుళాల HD+ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది ఒక ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మరియు ఇది 2GB ర్యామ్ మరియు 16GB అంతర్గత మెమొరీతో వస్తుంది. ఒక మైక్రో SD కార్డు ద్వారా దీని యొక్క మెమొరీని 256GB వరకు పెంచుకోవచ్చు. ఇది ఒక 3,500 mAh బ్యాటరీతో మద్దతునిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ ఏప్రిల్ 30 ఉదయం 10 గంటలకి Flipkart నుండి మొదలవుతుంది.
ఈ నెలలో భారతదేశంలో మంచి స్పెక్స్ తో, కేవలం రూ.7,999 రూపాయల ప్రారంభ ధరలో షావోమి నుండి వచినటువంటి ఈ స్మార్ట్ ఫోన్, డిజైన్ పరంగా గొప్పగా ఉంటుందని చెప్పొచ్చు. ఇది ఒక 1.8GHz వద్ద క్లాక్ చెయ్యబడిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 ఆక్టా కోర్ ప్రొసెసరుతో మంచి పెరఫార్మెన్సు అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి ఫ్లాష్ సేల్ ఏప్రిల్ 29 మధ్యాహ్నం 12గంటలకి mi.com మరియు అమేజాన్ నుండి జరగనుంది.
ఇటీవల భారతదేశంలో మంచి స్పెక్స్ తో, 10,000 రూపాయల కంటే తక్కువధరలో షావోమి నుండి వచినటువంటి స్మార్ట్ ఫోనుగా, ఈ రెడ్మి నోట్ 7 గురించి చెప్పొచ్చు. ఇది ముందు మరియు వెనుకా కూడా ఒక గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది మరియు ఒక 2.2GHz వద్ద క్లాక్ చెయ్యబడిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 AIE ప్రొసెసరుతో మంచి పెరఫార్మెన్సు అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఓపెన్ సేల్ తో అందుబాటులో వుంది.
షావోమి సంస్థ నుండి కేవలం రూ.9,999 ధరలో 32MP సెల్ఫీ కెమేరాతో ఇండియాలో విడుదల చేయబడినటువంటి, ఈ స్మార్ట్ ఫోన్, 1.8 GHz వద్ద క్లాక్ చేయబడిన, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తికి జతగా 3GB/4GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 32GB/64GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఇది 12+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు ఒక 32MP సెల్ఫీ కెమెరాతో పాటుగా ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.9,999 ప్రారంభ ధరతో లభిస్తుంది మరియు దీని యొక్క మొదటి సేల్ ఏప్రిల్ 30వ తేది 12గంటలకి mi.com మరియు అమేజాన్ నుండి జరగనుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 OS తో పనిచేస్తుంది మరియు వెనుక భాగంలో ఒక ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఇది స్నాప్ డ్రాగన్ 632(14nm)ప్రోసెసరుకి జతగా అడ్రినో 506 గ్రాఫిక్స్ మరియు 3GB ర్యామ్ తో శక్తివంతంగా ఉంటుంది. ఇది వెనుక 13+5MP డ్యూయల్ కెమేరా మరియు ముందు 8MP సెన్సారును కలిగి ఉంటుంది.
షావోమి యొక్క ఈ స్మార్ట్ ఫోన్ 3/ 32 GB స్టోరేజి వేరియంట్ పైన షావోమి యొక్క 5 వ వార్షికోత్సవం సందర్భంగా ధరను తగ్గించింది ప్రస్తుతం ఈ 3/ 32 GB స్టోరేజి వేరియంట్ రూ. 8,999 ధరతో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, 12+5MP AI డ్యూయల్ రియర్ కెమెరాతో మరియు 5MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇది స్నాప్ డ్రాగన్ 625 ఆక్టా కోర్ ప్రాసెసరుతో నడుస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ సరసమైన ధరలో, 13MP+2MP వెనుక డ్యూయల్ కెమెరా మరియు ముందు 5MP కెమేరాని కలిగిఉంటుంది. అదనంగా, ఒక 4230mAh బ్యాటరీ వంటి లక్షణాలని మరియు ఒక 6.2 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది.
శామ్సంగ్ నుండి సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్, 13MP +5MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 5MP సెన్సార్ కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ ఒక 6.22 అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి అదనంగా, 3400mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది.
2018 అక్టోబరులో విడుదల చేయబడిన ఈ స్మార్ట్ ఫోన్,క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్ శక్తికి జతగా 3GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 32GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఇది ఒక 6.2 అంగుళాల IPS LCD డిస్ప్లేతో వస్తుంది మరియు 13+2 MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 16MP సెల్ఫీ కెమెరాతో పాటుగా ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో ఉంటుంది.