ఇండియన్ మార్కెట్ లో లేటెస్ట్ గా విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ మరియు వాటి వివరాల కోసం చూస్తున్నారా? అయితే, మీరు సరైన చోటుకే వచ్చారు. ఎందుకంటే, ఈరోజు ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన స్మార్ట్ ఫోన్స్ మరియు వాటి వివరాలు ఇక్కడ అందిస్తున్నాను. ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లను ఇక్కడ చూడవచ్చు.
ధర : రూ.59,999
ఐకూ 11 స్మార్ట్ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78 ఇంచ్ FHD+ రిజల్యూషన్ తో LTPO4 AMOLED డిస్ప్లే ని కలిగి వుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 Gen 2 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా గరిష్టంగా 16GB LPDDR5X ర్యామ్ మరియు UFS 4.0 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ వెనుక ట్రిపుల్ కెమెరా వుంది. ఇందులో OIS సపోర్ట్ తో 50MP GN5 ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 13MP టెలిఫోటో కెమేరాలు ఉన్నాయి. ముందుభాగంలో, 16 సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ లో 5,000mAh బ్యాటరీని 120W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది.
ధర : రూ. 9,499
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్04 స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ డిస్ప్లేను కలిగివుంది. ఈ డిస్ప్లే ఇన్ఫినిటీ V- నోచ్ తో వస్తుంది మరియు ఇందులో 5MP సెల్ఫీ కెమెరాని కలిగివుంది.ఈ ఫోన్ మీడియాటెక్ Helio P35 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో మరియు 4GB మరియు 4 ర్యామ్ ప్లస్ తో జతగా వస్తుంది. ఈ ఫోన్ వెనుక డ్యూయల్ కెమేరా సెటప్ వుంది. ఈ సెటప్ లో 13MP+2MP సెన్సార్స్ ఉన్నాయి.ఈ ఫోన్ 3.5mm జాక్, డ్యూయల్ 4G VoLTE, WiFi ac మరియు Bluetooth 5.0 ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ Android 12 ఆధారిత One UI సాఫ్ట్‌వేర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ పెద్ద 5000 mAh బ్యాటరీతో వస్తుంది.
ధర : రూ.29,999
Redmi Note 12 Pro+ 5G ఫోన్ 6.5-ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. ఈ డిస్ప్లే Dolby Vision సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ Dimensity 1080 SoC మరియు 12GB RAM ఎంపికతో జత చేయబడింది. ఈ ఫోన్ MIUI 13 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ లో వెనుక భారీ ట్రిపుల్ రియర్ కెమెరాని అందించింది. ఇందులో, OIS 200MP + 8MP + 2MP కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 4,980mAh బ్యాటరీని భారీ 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.
ధర : రూ.24,999
Redmi Note 12 Pro+ 5G ఫోన్ 6.67-ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. ఈ డిస్ప్లే Dolby Vision సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ Dimensity 1080 SoC మరియు 8GB RAM ఎంపికతో జత చేయబడింది. ఈ ఫోన్ MIUI 13 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ లో వెనుక భారీ ట్రిపుల్ రియర్ కెమెరాని అందించింది. ఇందులో, OIS 50MP (సోనీ కెమెరా)+ 8MP + 2MP కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీని భారీ 67W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.
ధర : రూ.17,999
Redmi Note 12 5G ఫోన్ 6.67-ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. ఈ ఫోన్ లేటెస్ట్ క్వాల్కమ్ ప్రొసెసర్ Snapdragon 4 Gen1 SoC తో వస్తుంది. ఈ ఫోన్ MIUI 13 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరాని అందించింది. ఇందులో, 48MP+8MP+2MP కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.
ధర : రూ.13,999
Realme 10 4G స్మార్ట్ ఫోన్ 6.4- ఇంచ్ FHD+ రిజల్యూషన్ Super AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ గేమింగ్ ప్రాసెసర్ Helio G99 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 8GB ర్యామ్ తో వస్తుంది. వెనుకవైపు, ఈ ఫోన్ లో డ్యూయల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా మరియు 2MP బ్లాక్ &వైట్ సెన్సార్ ఉన్నాయి. అలాగే, సెల్ఫీల కోసం 16MP సెల్ఫీ కెమెరా కూడా ముందు భాగంలో వుంది. ఈ ఫోన్ 5000mAh బిగ్ బ్యాటరీని 33W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కలిగివుంది. 8GB వరకు డైనమిక్ ర్యామ్, 200% అల్ట్రా భూమింగ్ స్పీకర్లు, మొదలైన ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది.
ధర : రూ.6,499
ఈ పోకో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ C50 పెద్ద 6.5 ఇంచ్ స్క్రీన్ ని HD+ రిజల్యూషన్ తో కలిగి వుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Helio A22 క్వాడ్ కోర్ ప్రాసెసర్ కి జతగా 2GB/3GB ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. పోకో C50 స్మార్ట్ ఫోన్ వెనుక డ్యూయల్ కెమేరా సెటప్ వుంది. ఇందులో, 8MP మెయిన్ కెమేరా మరియు మరొక కెమెరా వుంది. ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 10W సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 (Go Edition) ఆపరేటింగ్ సిస్టం పైన పనిచేస్తుంది.
ధర : రూ.39,999
టెక్నో ఫాంటమ్ ఎక్స్ 2 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.8 ఇంచ్ FHD+ Curved AMOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ 4nm ఫ్యాబ్రికేషన్ ప్రాసెసర్ Dimensity 900 5G శక్తితో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ కి జతగా 12GB LPDDR5 ర్యామ్ మరియు 256 GB UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెట్టింగ్ కలిగివుంది. ఇందులో, 64MP OIS RGBW (G+P) + 13MP + 2MP మ్యాక్రో సెన్సార్ వున్నాయి. ముందుభాగంలో, 32MP సెల్ఫీ కెమెరా అందించింది. ఈ ఫోన్ 5160 mAh బిగ్ బ్యాటరీని 45W ఫాస్ట్ కెహెర్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.
ధర : రూ.6,999
ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేని కలిగి వుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ ప్రాసెసర్ Helio A22 చిప్ సెట్ మరియు జతగా 3GB ర్యామ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 8MP ప్రధాన కెమెరా మరియు మరొక కెమెరా ఉన్నాయి. ముందు, 5MP సెల్ఫీ కెమెరాని ఈ ఫోన్ కలిగివుంది. ఈ ఫోన్ 4000mAh బిగ్ బ్యాటరీని సాదారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ ఫోన్ Android 12 GoEdition పైన పనిచేస్తుంది.
ధర : రూ.24,999
Realme 10 Pro+5G స్మార్ట్ ఫోన్ 6.7-అంగుళాల FHD+ రిజల్యూషన్ Curved స్క్రీన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగివుంది మరియు ఈ ఫోన్ మీడియాటెక్ ఫాస్ట్ ప్రాసెసర్ డైమెన్సిటీ 1080 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ మరియు 2MP (4cm) మాక్రో సెన్సార్ ఉన్నాయి. అలాగే, ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని 67W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కలిగివుంది.
ధర : రూ.18,999
Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ 6.72-అంగుళాల FHD+ రిజల్యూషన్ స్క్రీన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగివుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ 5G ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 108MP ప్రైమరీ కెమెరా మరియు 2MP (4cm) పోర్ట్రైట్ సెన్సార్ ఉన్నాయి. అలాగే, ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని 33W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కలిగివుంది.
ధర : రూ.12,499
నోకియా జి 11 స్మార్ట్ ఫోన్ Unisoc T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు జతగా 4 జీబీ ర్యామ్ తో వస్తుంది. ఈ ఫోన్ పెద్ద 6.5-అంగుళాల HD+ స్క్రీన్ తో వస్తుంది మరియు ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీని రెగ్యులర్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ ఫోన్ వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరా మరియు 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా వుంది. ఈ ఫోన్ ఎటువంటి యాడ్స్ బెడదా లేని Stock Android 12 OS పైన నడుస్తుంది మరియు రెండు మేజర్ అప్డేట్స్ ను అందుకుంటుంది.
ధర : రూ.10,499
ఈ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని కలిగివుంది. లావా బ్లేజ్ 5G మీడియాటెక్ 5G ప్రాసెసర్ Dimensity 700 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 4G ర్యామ్ మరియు 3GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో కూడా వస్తుంది. స్టోరేజ్ పరంగా, ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో 50MP మైన్ కెమెరాతో పాటుగా డెప్త్ మరియు మ్యాక్రో కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS పైన పనిచేస్తుంది మరియు 5,000mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది.
ధర : రూ.14,999
Moto G72 5G స్మార్ట్ ఫోన్ 6.55 ఇంచ్ FHD+ 10బిట్ pOLED డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR+ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G99 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ లను అందిస్తుంది. ఈ ఫోన్ వెనుక క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరా వుంది. ఇందులో 108MP ప్రధాన సెన్సార్, 8ఎంపి సెన్సార్ అల్ట్రా-వైడ్ మరియు డెప్త్ కెమెరాగా కూడా పనిచేస్తుంది. ముందు భాగంలో ఉన్న పంచ్ హోల్ లో 16MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ పెద్ద 5,000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ ఫోన్ బ్లోట్ వేర్ బడెదను లేని లేటెస్ట్ Near-Stock Android 12 OS పైన నడుస్తుంది.
ధర : రూ.54,999
మోటోరోలా ఎడ్జ్ 20 అల్ట్రా 6.67 ఇంచ్ FHD + రిజల్యూషన్ గల పంచ్ హోల్ ఎండ్ లెస్ ఎడ్జ్ డిస్ప్లే తో వుంటుంది. ఈ డిస్ప్లే 144 Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సర్టిఫైడ్ pOLED డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 1 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు 8జిబి ర్యామ్ జతగా వస్తుంది. ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగివుంది. ఈ కెమెరా సెటప్ లో 200MP ప్రధాన కెమెరాని OIS సపోర్ట్ తో కలిగివుంది. దీనికి జతగా అల్ట్రా వైడ్/ మ్యాక్రో సపోర్ట్ చేసే 50MP భారీ సెన్సార్ మరియు 12MP పోర్ట్రైట్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 60MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ లో 125W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,610 mAh బ్యాటరీని అందించింది. ఇది యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ కలిగిన 3D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వుంది.
ధర : రూ.39,999
మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యుజన్ 6.55 ఇంచ్ FHD+ pOLED డిస్ప్లేని 144 Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సపోర్ట్ తో కలిగివుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 888+ ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు 8జిబి ర్యామ్ జతగా వస్తుంది. ఎడ్జ్ 20 ఫ్యుజన్ వెనుక OIS సపోర్ట్ కలిగిన 50MP ప్రధాన కెమెరాకి జతగా 13 అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP డెప్త్ కెమెరా సెన్సార్ కలిగిన ట్రిపుల్ కెమెరా వుంది. 32MP సెల్ఫీ కెమెరాని ఈ ఫోన్ కలిగివుంది. ఈ ఫోన్ 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,400 mAh బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ లో యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ కలిగిన 3D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వుంది.
ధర : రూ.29,999
రియల్‌మీ జిటి నియో 3టి 80W స్మార్ట్ ఫోన్ 6.62 ఇంచ్ FHD+ E4 AMOLED డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది మరియు ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా Realme UI 3.0 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది. ఇందులో, 64MP మైన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. ఫోన్ ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా కూడా కలిగివుంది. ఈ ఫోన్ వేగవంతమైన 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ Dolby Atmos మరియు Hi-res సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లతో వస్తుంది.
ధర : రూ.17,999
టెక్నో క్యాంమాన్ 19 ప్రో మాండ్రియన్ పెద్ద 6.7 ఇంచ్ FHD+ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ ఫోన్ మీడియాటెక్ గేమింగ్ ప్రాసెసర్ Helio G96 SoC తో పనిచేస్తుంది. ఇది 8GB LPDDR4x ర్యామ్ మరియు 5GB వరకు వర్చువల్ RAM తో వస్తుంది. అల్ట్రా క్లారిటీ కోసం ఇండస్ట్రీలో మొదటి RGBW+(G+P) లెన్స్‌తో 64MP OIS ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఈ సెటప్ లో 64MP+50MP+2MP ట్రిపుల్ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాతో అద్భుతమైన ఫోటోలను చిత్రికరించవచ్చని టెక్నో చెబుతోంది. సెల్ఫీల కోసం ముందుభాగంలో 32MP HDR సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ డిజైన్ పరంగా, మాండ్రియన్ ఆర్ట్ స్ఫూర్తితో భారతదేశపు మొట్టమొదటి మల్టీ కలర్ ఛేంజింగ్ ఫోన్ గా ఇది మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ లో దీర్ఘ బ్యాకప్ కోసం 5000mAh హై కెపాసిటీ బ్యాటరీని 33W ఫ్లాష్ ఛార్జర్ సపోర్ట్ తో అందించింది.
ధర : రూ.27,999
Vivo V20 Pro స్మార్ట్ ఫోన్ 6.44-అంగుళాల FHD+ AMOLED ప్యానెల్‌ను కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక ప్యానెల్ ఫ్లోరైట్ AG గ్లాస్ తో తయారు చేయబడింది, కాబట్టి ఇది రంగులు మారుస్తుంది. వి 25 ప్రో 12 జిబి ర్యామ్ మరియు 256 జిబి స్టోరేజ్‌తో మీడియాటెక్ 5G ప్రాసెసర్ Dimensity 900 శక్తితో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 పై ఆధారపడి FuntouchOS 12 పై నడుస్తుంది. ఈ ఫోన్ 64MP ప్రాధమిక కెమెరా, 8MP వైడ్ యాంగిల్ మరియు 2 ఎంపి మ్యాక్రో సెన్సార్ కలిగిన ట్రిపుల్ కెమెరా వుంది. 50MP Eye AF సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ముందు భాగంలో వుంది. ఈ ఫోన్ 44W ఫ్లాష్ ఛార్జ్ 4 సపోర్ట్ కలిగిన 4,500mAh బ్యాటరీతో వస్తుంది.
ధర : రూ.8,999
రియల్ మీ C33 స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ స్క్రీన్ ని 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Unisoc T612 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 3GB/4GB ర్యామ్ మరియు 32GB/64GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. రియల్ మీ C33 స్మార్ట్ ఫోన్ వెనుక కేవలం 50MP+0.3MP డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 10W సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగిఉంటుంది.