అత్యంత చౌకైన 6GB ర్యామ్ ఫోన్లు (సెప్టెంబర్ 2019)

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Sep 02 2019
అత్యంత చౌకైన 6GB ర్యామ్ ఫోన్లు (సెప్టెంబర్ 2019)

అతితక్కువ ధరలో, ఒక మంచి ప్రాసెసర్ మరియు గొప్ప ర్యామ్ తో కలగలిసిన ఒక మంచి స్మార్ట్  ఫోన్ కొనాలని చూస్తున్నవారికోసం ఈ జాబితా అందిస్తున్నాను. ఇక్కడ అందించిన జాబితాలో కేవలం ప్రాసెసర్ ర్యామ్ మాత్రమే కాకుండా కెమేరాలు మరియు బ్యాటరీ వంటి గొప్ప ఫీచర్లను కూడా ఈ స్మార్ట్ ఫోన్లు కలిగి ఉంటాయి. ఇన్ని ఫీచర్లతో ఒక స్మార్ట్ ఫోన్ను కొనాలంటే చాల డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ, నేనిక్కడ అందించిన జాబితాలోని ఫోన్లు కేవలం రూ. 10,000 నుండి 15,000 కంటే తక్కువ ధరలో మీకు లభిస్తాయి.                     

అత్యంత చౌకైన 6GB ర్యామ్ ఫోన్లు (సెప్టెంబర్ 2019)

1. నోకియా 6.1 ప్లస్

 ఈ నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ ఫోన్, వెనుక 16MP+5MP డ్యూయల్ కెమేరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరాను కలిగివుంటుంది. అలాగే, ఒక స్నాప్ డ్రాగన్ 636 ఆక్టా  కోర్ ప్రాసెసరుకు జతగా ఒక 6GB శక్తితో వస్తుంది. ముందుగా, రూ. 18,999 ధరతో అమ్ముడైన ఈ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.10,999 ధరతో  లభిస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్  టెక్నాలజీ సపోర్టు గల ఒక 3,060mAh బ్యాటరీతో ఉంటుంది.     

అత్యంత చౌకైన 6GB ర్యామ్ ఫోన్లు (సెప్టెంబర్ 2019)

2. ఇన్ఫినిక్స్ హాట్ 7 ప్రో

ఇన్ఫినిక్స్ సంస్థ ఇండియాలో గొప్ప ఫీచర్లతో టుకోహ్సినటువంటి స్మార్ట్ ఫోన్లలో ఇది కూడా ఒకటని చెప్పోచ్చు. ఈ స్మార్ట్ ఫోన్, 6. 19 అంగుళాల HD+ డిస్ప్లే, ముందు మరియు వెనుక డ్యూయల్ కెమేరాలతో పాటుగా హెవీ గేమ్స్ కూడా సున్నితంగా ప్లే చేయగల ఒక మీడియా టెక్ హీలియో P22 ప్రాసెసరుకు జతగా శక్తివంతమైన 6GB ర్యామ్ సహకారంతో వస్తుంది. అంతేకాదు, ఇది కేవలం రూ. 9,999 ధరలోలభిస్తోంది.

అత్యంత చౌకైన 6GB ర్యామ్ ఫోన్లు (సెప్టెంబర్ 2019)

3. రియల్మీ 2 ప్రో

ఈ రియల్మీ 2 ప్రో 16MP+2MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 16MP సెల్ఫీ కెమేరాతో మంచి కెమేరా ఫోనుగా ఉంటుంది. అంతేకాదు, ఒక స్నాప్ డ్రాగన్ 660 ఆక్టా  కోర్ ప్రాసెసరుకు జతగా ఒక 6GB శక్తితో వస్తుంది. ముందుగా, రూ. 16,999 ధరతో అమ్ముడైన ఈ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.10,999 ధరలో Flipakrt నుండి లభిస్తుంది. ఇది వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్టు గల ఒక 3,500mAh బ్యాటరీతో ఉంటుంది.

అత్యంత చౌకైన 6GB ర్యామ్ ఫోన్లు (సెప్టెంబర్ 2019)

4. షావోమి మి A2

కెమేరాల పరంగా బెస్ట్ ఫీచర్లతో వచ్చినటువంటి, ఈ షావోమి మి A2 బెస్ట్ కెమేరా ఫోనుగా నిలచింది. ఇది 20MP+12MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 20MP సెల్ఫీ కెమేరాతో మంచి కెమేరా ఫోనుగా ఉంటుంది. అంతేకాదు, ఒక స్నాప్ డ్రాగన్ 660 ఆక్టా  కోర్ ప్రాసెసరుకు జతగా ఒక 6GB శక్తితో వస్తుంది. ముందుగా, రూ. 19,999 ధరతో అమ్ముడైన ఈ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.12,999 ధరలో లభిస్తుంది. ఇది వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్టు గల ఒక 3,010mAh బ్యాటరీతో ఉంటుంది.

అత్యంత చౌకైన 6GB ర్యామ్ ఫోన్లు (సెప్టెంబర్ 2019)

5. హానర్ ప్లే

హువావే యొక్క సబ్ బ్రాండ్ అయినటువంటి హానర్ గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి ఫోనుగా ఈ హానర్ ప్లే గురించి చెప్పొచ్చు. ఇది అనేకమైన గేమింగ్ ప్రత్యేకతలతో వస్తుంది. అలాగే, ఇది 4D గేమింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుంది. ఇక ఇది హైసిలికాన్ కిరిణ్ 970 ఆక్టా కోర్ ప్రాసెసరుకు జతగా ఒక 6GB ర్యామ్ తో వస్తుంది. ఇది క్రోమా యొక్క ఆన్లైన్ వెబ్సైట్ నుండి కేవలం రూ.12,999 ధరకే అమ్ముడవుతోంది.

అత్యంత చౌకైన 6GB ర్యామ్ ఫోన్లు (సెప్టెంబర్ 2019)

6. షావోమి రెడ్మి నోట్ 5 ప్రో

షావోమి నుండి వచ్చినటువంటి అన్ని ఫోన్లలో కూడా అత్యధికమైన అమ్మకాలను సాధించిన స్మార్ట్ ఫోనుగా, ఈ షావోమి రెడ్మి నోట్ 5 ప్రో గురించి చెప్పొచ్చు. ఈ ఫోన్ 12MP+5MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 20MP సెల్ఫీ కెమేరాతో మంచి కెమేరా ఫోనుగా కూడా ఉంటుంది. అంతేకాదు, ఒక స్నాప్ డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసరుకు జతగా ఒక 6GB శక్తితో వస్తుంది. ముందుగా, రూ. 17,999 ధరతో అమ్ముడైన ఈ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.12,500 ధరలో లభిస్తుంది. 

అత్యంత చౌకైన 6GB ర్యామ్ ఫోన్లు (సెప్టెంబర్ 2019)

7. నోకియా 5.1 ప్లస్

ఒక స్మార్ట్ ఫోన్ను ఎక్కువ కాలం వాడుకోవాలనుకునే వారికి సరైన ఫోనుగా, నోకియా ఫోన్ల గురించి చెప్పొచ్చు. ఈ నోకియా 5.1 స్మార్ట్ ఫోన్, ఒక మీడియా టెక్ హీలియో P60 ఆక్టా  కోర్ ప్రాసెసరుకు జతగా ఒక 6GB శక్తితో వస్తుంది. ఇది 13MP+5MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 8MP సెల్ఫీ కెమేరాతో మంచి కెమేరా ఫోనుగా కూడా ఉంటుంది. దీన్ని ఇండియాలో విడుదల చేసినప్పుడు ఎక్కువ ధరకి అమ్ముడిచేసినా, ప్రస్తుతం ఇది రూ. 14,000 కంటే తక్కువధరకే లభిస్తోంది

అత్యంత చౌకైన 6GB ర్యామ్ ఫోన్లు (సెప్టెంబర్ 2019)

8. షావోమి రెడ్మి నోట్ 6 ప్రో

ముందుగా వచ్చి విజయవంతమైన రెడ్మి నోట్ 5 ప్రో యొక్క తరువాతి తరం ఫోనుగా దీన్ని తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ముందు మరియు వెనుక కూడా డ్యూయల్ కెమేరాలను కలిగివుంటుంది. అలాగే, ఒక స్నాప్ డ్రాగన్ 636 ఆక్టా  కోర్ ప్రాసెసరుకు జతగా ఒక 6GB శక్తితో వస్తుంది. ముందుగా, రూ. 16,999 ధరతో అమ్ముడైన ఈ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.12,000 ధరలో లభిస్తుంది. ఇది క్విక్ ఛార్జింగ్ 3.0 టెక్నాలజీ సపోర్టు గల ఒక 4,000mAh బ్యాటరీతో ఉంటుంది. 

అత్యంత చౌకైన 6GB ర్యామ్ ఫోన్లు (సెప్టెంబర్ 2019)

9. మోటో G6 ప్లస్

ఈ మోటో G6 ప్లస్ 12MP+5MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 16MP సెల్ఫీ కెమేరాతో మంచి కెమేరా ఫోనుగా కూడా ఉంటుంది. అంతేకాదు, ఒక స్నాప్ డ్రాగన్ 630 ఆక్టా  కోర్ ప్రాసెసరుకు జతగా ఒక 6GB శక్తితో వస్తుంది. ముందుగా, రూ. 18,999 ధరతో అమ్ముడైన ఈ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.12,500 ధరలో లభిస్తుంది. ఇది టర్బో ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్టు గల ఒక 3,200mAh బ్యాటరీతో ఉంటుంది. 

అత్యంత చౌకైన 6GB ర్యామ్ ఫోన్లు (సెప్టెంబర్ 2019)

10. టెక్నో ఫాంటమ్ 9

ఈ టెక్నో ఫాంటమ్ 9 స్మార్ట్ ఫోన్, ఇటీవల ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్,16MP+8MP+2MP ట్రిపుల్ రియర్ కెమేరా మరియు 32MP సెల్ఫీ కెమేరాతో మంచి కెమేరా ఫోనుగా కూడా ఉంటుంది. అంతేకాదు, ఒక మీడియా టెక్ హీలియో P35 ఆక్టా  కోర్ ప్రాసెసరుకు జతగా ఒక 6GB శక్తితో వస్తుంది. ఈఫోన్, రూ. 14,999 ధరతో లభిస్తుంది. ఇది టర్బో ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్టు గల ఒక 3,500mAh బ్యాటరీతో ఉంటుంది.