12,990 రూ లకు ఇండియాలో LG కొత్త ఫోన్ లాంచ్ చేసింది. దీని పేరు X స్క్రీన్. జులై మూడవ వారం నుండి ఫోన్ సేల్స్ స్టార్ట్ కానున్నాయి స్నాప్ డీల్ లో. ఫోన్ యొక్క ఇమేజెస్ ను క్లోజ్ గా చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి.
దీనిలోని డ్యూయల్ స్క్రీన్ అనేది వెనుక ముందూ రెండు స్క్రీన్స్ ఉంటాయని అనుకోకండి, front లోనే పై భాగంలో నోటిఫికేషన్స్ , మ్యూజిక్ కంట్రోల్స్, time , date , బ్యాటరీ status వంటివి ఫోన్ ను unlock లేదా స్క్రీన్ ఆన్ చేయకుండానే చూడటానికి ఉన్నదే రెండవ డిస్ప్లే. ఇక నార్మల్ రెగులర్ డిస్ప్లే సైజ్ 4.93 in HD కలిగి ఉంది.
ఫోన్ కు కుడి భాగంలో పవర్ బటన్ మరియు సిమ్ tray ఉంది. పవర్ బటన్ 5 సార్లు ప్రెస్ చేస్తే panic బటన్ పనిచేస్తుంది. అంటే ప్రత్యేకంగా panic బటన్ లేదు.
బాటమ్ లో హెడ్ ఫోన్ జాక్, మైక్, usb పోర్ట్ అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది.
left సైడ్ లో volume బటన్స్ ఇవ్వటం జరిగింది
ఫోన్ android మార్ష్ మల్లో 6.0 పై నడుస్తుంది. అయితే మీరు గమనించినట్లయితే ఫోన్ స్టాక్ OS తో కాకుండా సొంతంగా సెపరేట్ యూజర్ ఇంటర్ఫేస్ తో వస్తుంది.
కెమెరా విభాగంలో వెనుక వైపు 13MP రేర్ PDAF కెమెరా ఉంటే front లో 8MP కెమెరా ఉంది.
ఫోన్ కు వెనుక వైపు కెమెరా module క్రింద led flash ఉంది. ఫింగర్ ప్రింట్ scanner లేదు.
ఫోన్ సన్నగా ఉంది. సో బ్యాటరీ కూడా తక్కువుగానే ఉంది. 2300mah బ్యాటరీ తో వస్తుంది ఫోన్.
ఫోన్ తో పాటు LG 650 Rs క్యాష్ బ్యాక్ ఇస్తుంది SBI యూజర్స్ కు. Hungama Play అండ్ Apps ప్రియ subscription అండ్ వోడాఫోన్ 4G డేటా ఆఫర్ ఇస్తుంది ఫోన్ కొంటే. అయితే కేవలం 4G డేటా ఉందని మాత్రం ఫోన్ తీసుకోకండి, ఎందుకంటే ఆంధ్రా లో వోడాఫోన్ 4G రాలేదు ఇంకా.
ఫోన్ యొక్క కంప్లైట్ డీటేల్స్ including బియింగ్ లింక్ కొరకు ఈ లింక్ లో చూడగలరు.