lenovo 2017 న్యూ ఇయర్ లో P2 అనే పేరుతో స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేస్తుంది. ఫోన్ లో ప్రధాన హైలైట్ 5000 mah బ్యాటరీ ఉండటమే. దీనికి సంబందించిన teaser ట్విటర్ కంపెని అకౌంట్ లో రిలీజ్ చేయటంతో ఈ విషయం తెలిసింది.
ఫోన్ డిటేల్స్:
ఫోన్ కు మరొక పేరు పెట్టింది లెనోవో - PowerHouse. ఇదే ఫోన్ గతంలో IFA 2016 ఈవెంట్ లో ప్రవేశపెట్టింది కంపెని. జనరల్ గా P సిరిస్ అంటే పెద్ద బ్యాటరీస్ ఉంటాయి. దీనికి ముందు P1 అనే ఫోన్ లాంచ్ చేసింది అక్టోబర్ 2015 లో ఇండియాలో.
ఫోన్ స్పెక్స్:
P2 స్పెక్స్ 5.5 in ఫుల్ HD సూపర్ అమోలేడ్ డిస్ప్లే, స్నాప్ద్ డ్రాగన్ 625 ప్రొసెసర్, 32GB అండ్ 64GB ఇంబిల్ట్ స్టోరేజ్, 3GB అండ్ 4GB రామ్,
కెమెరా స్పెక్స్:
13MP రేర్ Phase డిటెక్షన్ ఆటో ఫోకస్ డ్యూయల్ LED ఫ్లాష్ కెమెరా అండ్ 5MP పేస్ డిటెక్షన్ ఫ్రంట్ కెమెరా, క్వాల్ కాం ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
ప్రైస్ డిటేల్స్:
2015 అక్టోబర్ లో రిలీజ్ అయిన దీనికి ముందు ఫోన్ P1 ప్రైస్ 14,999 రూ. మరి P2 ప్రైస్ ఎంత ఉంటుంది అనేది ఇంకా తెలియవలసి ఉంది. అలాగే ఇండియాలో 3GB అండ్ 4GB రెండు వేరియంట్స్ రిలీజ్ చేస్తుందా లేదా అనేది కూడా ఇంకా స్పష్టత లేదు.