November 29న లెనోవో K6 పవర్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ అవుతుంది ఇండియాలో. దీనిలో ప్రధానంగా 4000 mah బ్యాటరీ ఉండనుంది. ఆల్రెడీ స్పెక్స్ తో పాటు లెనోవో K6 పవర్ IFA గ్లోబల్ ఈవెంట్ లో రివీల్ అయ్యింది. Xiaomi's Redmi 3S and Moto E3 Power ప్రైస్ లకు దగ్గరిలో ఉంటుంది అని అంచనా. సో ఇక్కడ ఈ మూడు స్పెక్స్ ను కంపేర్ చేయటం జరిగింది. క్రిందకు స్క్రోల్ చేయండి.
పైన/ప్రక్కన ఉన్న ఇమేజ్ లో స్పెక్స్ కంపేరీజన్ చూడగలరు.
డిజైన్ అండ్ డిస్ప్లే:
Lenovo K6 Power కూడా రెడ్మి లానే unibody మెటల్ డిజైన్ కలిగి ఉంది. Moto E3 Power మాత్రం ప్లాస్టిక్ బాడీ తో వస్తుంది.. Lenovo K6 Power is 9.3mm thickness తో ఉండగా Redmi 3S 8.5mm అండ్ Moto E3 Power అన్నిటిలో ఎక్కువగా 9.6mm కలిగి ఉంది. అన్నీ సుమారు 150 గ్రా బరువు కలిగి ఉన్నాయి.
Lenovo K6 పవర్ లో ఫుల్ HD డిస్ప్లే రానుంది. మిగిలిన రెండింటిలో కేవలం HD ఉన్నాయి..
పెర్ఫార్మన్స్ అండ్ బ్యాటరీ లైఫ్:
ఇక్కడ కచ్చితంగా moto కన్నా మిగిలిన రెండూ పై చేయిలో ఉన్నాయి. రెండూ Snapdragon 430 processor తో ఉంటే Moto E3 Power లో మీడియా టెక్ SoC ఉంది. Qualcomm Snapdragon 430 ఆక్టో కోర్ లో octa-core 8 ARM Cortex A53 కోర్స్ ఉన్నాయి. MediaTek MT6735P లో మాత్రం quad-core CPU ... 4 A53 కోర్స్ మాత్రమే ఉన్నాయి.
ఇక బ్యాటరీ విషయంలో ఆల్రెడీ మిగిలిన రెండూ పవర్ ఫుల్ అని తేలిపోయాయి. మరి వీటిని మించిన బ్యాటరీ లైఫ్ తో లెనోవో ఫోన్ ఉంటుందో లేదో చూడాలి.
కెమెరా:
Lenovo K6 Power లో 13MP రేర్ కెమెరా phase detection autofocus తో వస్తుంది.. రెడ్మి లో కూడా same మెగా పిక్సెల్ ఉంది. సో ఫోన్ రిలీజ్ అయ్యాకే క్వాలిటీ తెలుస్తుంది.
అయితే ఫేమస్ మోడల్స్ గా Redmi 3S మరియు Redmi Note 3, చలామణిలో ఉన్నప్పటికీ Xiaomi ఈ రెండింటిలో మంచి కెమెరా ను పెట్టలేకపోయింది వాస్తవానికి. మంచి లైటింగ్ లో బాగానే ఉంటాయి కాని లైటింగ్ తగ్గే కొద్దీ క్వాలిటీ తగ్గుతుంది. ఒక వేల K6 లో కెమెరా రెడ్మి కన్నా బెటర్ గా ఉంటే లెనోవో లీడింగ్ లోకి వెళ్ళినట్లే..
ప్రైస్:
Xiaomi Redmi 3S స్టార్టింగ్ ప్రైస్ 6,999 రూ. Moto E3 పవర్ ప్రైస్ 7,999 రూ. లెనోవో కూడా K6 పవర్ ను ఈ రెండింటికీ దగ్గరి ప్రైస్ లో రిలీజ్ చేస్తుంది అని అంచనా. లెనోవో K6 పవర్ కూడా 2GB అండ్ 3GB రామ్స్ లో రెండు వేరియంట్స్ లో రిలీజ్ అవుతుంది.