Lenovo K6 Power అనేది కంపెని కొత్తగా లాంచ్ చేసిన K సిరిస్ ఫోన్. పోటీ పడే స్పెక్స్ తో పాటు average బడ్జెట్ ప్రైసింగ్ లో లాంచ్ అయిన ఈ ఫోన్ 5 in స్క్రీన్ తో వస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు మరియు ఫోటోస్ చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి మొబైల్ రీడర్స్..
డిస్ప్లే లో decent viewing angles ఉన్నాయి. 1080p resolution అనేది కొత్తమే కాదు కానీ బడ్జెట్ 5-inch స్క్రీన్ ఫోనులకు ఇది కొత్త విషయం అని చెప్పవచ్చు. ఫర్స్ట్ ఇంప్రెషన్స్ లో కొంచెం dim గా ఉన్నట్లు అనిపిస్తుంది డిస్ప్లే.
10 వేల బడ్జెట్ లో ఉన్న అన్ని ఫోనుల వలె దీనిలో కూడా స్క్రీన్ లో కాకుండా ఫోన్ బాడీ లో ఉన్నాయి నేవిగేషన్ బటన్స్, అయితే ఇవి వెలగవు.
వెనుక నుండి చూస్తె ఫోన్ Redmi Note 3 కు సిమిలర్ గా ఉంది. కెమెరా, ఫ్లాష్ అండ్ ఫింగర్ ప్రింట్ అన్నీ సమె ఆ ఫోన్ లానే దీనిలో కూడా ప్లేస్ చేయబడ్డాయి.
వెనుక స్టీరియో స్పికర్స్ ఉన్నాయి. ఇది Dolby Atmos సౌండ్ సాఫ్ట్ వేర్ తో వస్తుంది.
ఫోన్ ప్రధాన హైలైట్ 4000mAh బ్యాటరీ. 12 గంటల వీడియో ప్లే బ్యాక్ ఇస్తుంది అని చెబుతుంది కంపెని. ఫోన్ లో “ultimate power saver” mode కూడా ఉంది. ఇది కాల్స్ అండ్ మెసేజెస్ తప్ప అన్ని disable చేస్తుంది.
వెనుక 13MP Sony IMX258 sensor ఉంది. రీసెంట్ గా ఇదే సెన్సార్ Gionne S6 Pro లో కూడా కనిపించింది. ఫ్రంట్ లో 8MP కెమెరా ఉంది. ఈ లింక్ లో కంప్లీట్ స్పెక్స్ అండ్ డిటేల్స్ చూడగలరు.