LeEco Le 2 ఫోన్ కొనకపోవటానికి ఉన్న 5 కారణాలు [July 1]

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Jul 01 2016
LeEco Le 2 ఫోన్ కొనకపోవటానికి ఉన్న 5 కారణాలు [July 1]

LeEco Le2 ఫోన్ ప్రస్తుత బడ్జెట్ సెగ్మెంట్ లో నంబర్ వన్ ప్రిఫరెన్స్ మేము చేసిన రివ్యూ ప్రకారం. రివ్యూ కొరకు ఈ లింక్ లోకి వెళ్ళగలరు. అయినా ఫోన్ లో కొని మైనస్ లు ఉన్నాయి. అవేంటో చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి.

LeEco Le 2 ఫోన్ కొనకపోవటానికి ఉన్న 5 కారణాలు [July 1]

earphones
మొదటిగా స్పెక్స్ చూసిన వెంటనే అనిపించేది, ఛార్జింగ్ పెడుతూ earphones వాడలేము అనే నిజం. ఎందుకంటే ఈ ఫోన్ లో earphones కు సెపరేట్ గా 3.5mm రెగులర్ జాక్ ను తీసివేసింది కంపెనీ. అంటే క్రింద ఉండే usb పోర్ట్ ద్వారానే earphones, ఛార్జింగ్, డేటా transfer వంటివి చేయగలరు. బాధ పడవలసిన విషయం ఏంటంటే మీరు ఫోన్ ఎక్కువుగా మాట్లాడే వారు అయితే ఛార్జింగ్ పెడుతూ earphones లో మాట్లాడటానికి అవ్వదు. అలాగే పడుకునే ముందు ఛార్జింగ్ చేస్తూ మ్యూజిక్ అం మూవీస్ earphones ద్వారా ఆస్వాదించలేరు.

LeEco Le 2 ఫోన్ కొనకపోవటానికి ఉన్న 5 కారణాలు [July 1]

స్టోరేజ్
ఫోన్ లో 32GB ఇంబిల్ట్ స్టోరేజ్ మాత్రమే ఉంది. SD కార్డు సపోర్ట్ విడిగా కానీ హైబ్రిడ్ స్లాట్ ద్వారా కానీ రావటం లేదు. పైగా మీరు ఫోన్ స్టార్ట్ చేస్తే 32gb మొత్తంలో 25GB ఇంబిల్ట్ స్టోరేజ్ మాత్రమే వాడుకోగలరు. మిగిలిన కాంపిటీషన్ ఫోనులన్నిటికీ SD కార్డు సపోర్ట్ సెపరేట్ గా లేకపోయినా  హైబ్రిడ్ స్లాట్ రూంపంలో అయినా ఉంది.

LeEco Le 2 ఫోన్ కొనకపోవటానికి ఉన్న 5 కారణాలు [July 1]

బ్రాండ్ ట్రస్ట్ లేదు
Le 1S  
మొదట్లో చాలా తొందరగా heat అవటం వలన చాలా మందికి ఈ విషయం బాగా ప్రచారం అయ్యింది. అయితే కంపెనీ తరువాత సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ ద్వారా హీటింగ్ issue కొంతమేరకు solve చేసినా ఇప్పటికీ చాలా మంది ఈ బ్రాండ్ పై అంత నమ్మకంగా ఉండలేకపోతున్నారు.

LeEco Le 2 ఫోన్ కొనకపోవటానికి ఉన్న 5 కారణాలు [July 1]

బ్యాటరీ 
ఫోన్ అన్ని స్పెక్స్ advanced గా ఇచ్చి బ్యాటరీ విషయంలో మాత్రం కంపెనీ స్టాండర్డ్ 3000mah ఇవ్వటం జరిగింది. ఇది ఫోన్ ను ఎక్కువుగా వాడే వారికి కంప్లైట్ day అంతా ఉండదు.

LeEco Le 2 ఫోన్ కొనకపోవటానికి ఉన్న 5 కారణాలు [July 1]

ఛార్జర్:
మీరు ఎక్కడికి వెళ్లినా ఫోన్ తో పాటు ఛార్జర్ తీసుకువెళాళ్లి. ఇది USB టైప్ C పోర్ట్ తో వస్తుంది. ఇది future అయినప్పటికీ ప్రస్తుతం అందరి దగ్గర లేదు. సో ఛార్జర్ ఇబ్బంది ఉంటుంది. లాప్ టాప్ ద్వారా పెట్టుకుందామన్న కుదరదు.