రీసెంట్ గా రిలీజ్ అయిన Cool 1 స్మార్ట్ ఫోన్ రాక ముందు వరకూ ఇండియాలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ గా చలామణి అవుతున్న LeEco Le 2 గురించి పరిచయం అనవసరం. ఇప్పుడు ఈ ఫోన్ 64GB ఇంబిల్ట్ స్టోరేజ్ వేరియంట్ తో రిలీజ్ అయ్యింది. మరిన్ని డిటేల్స్ కొరకు క్రిందకు స్క్రోల్ చేయగలరు.
Le 2 ఫోన్ లో కేవలం 32GB ఇంబిల్ట్ స్టోరేజ్ ఉండేది, అదనంగా SD కార్డ్ సపోర్ట్ కూడా లేదు. అందువలన ఫోన్ బాగా ఉన్నప్పటికీ, చాలామంది దీనిని తీసుకోవటానికి సంశయించారు. ఆ విషయాన్ని గమనించిన కంపెని, లేటెస్ట్ ఇప్పుడు 64GB ఇంబిల్ట్ స్టోరేజ్ వేరియంట్ ను రిలీజ్ చేసింది ఇండియన్ మార్కెట్ లో. దీనిలో కూడా SD కార్డ్ సపోర్ట్ ఉండదు. కాని 64GB లాంచ్ చేస్తే చాలు అని ఎదురుచూసిన వారు చాలామంది ఉన్నారు.
కేవలం స్టోరేజ్ ఒకటే పెరిగింది. మిగిలిన అన్ని స్పెక్స్ same 32GB వేరియంట్ లో ఉన్నట్లుగానే ఉంటాయి. 64GB వేరియంట్ ప్రైస్ 13,999 రూ. 32GB ఓల్డ్ వేరియంట్ ప్రైస్ - 11,999 రూ.అంటే 2000 రూ డిఫరెన్స్ ఉంది.
LeEco Le 2 లో ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 652 ప్రొసెసర్, 3GB రామ్ , 16MP రేర్ అండ్ 8MP ఫ్రంట్ కెమెరా, 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ from బ్యాక్ కెమెరా, 5.5 in ఫుల్ HD డిస్ప్లే, 3000mAh బ్యాటరీ తో 64GB వేరియంట్ ప్రస్తుతానికి కేవలం Rose Gold కలర్ లోనే లభిస్తుంది.