ప్రతీ రోజు ఏదో ఒకటి రిలీజ్ అవుతుంటుంది. వారానికి ఒక్కసారి, శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలనే గుర్తు పెట్టుకోలేము, ఇక రోజుకు ఒక గాడ్జెట్ లాంచ్ కు అప్డేటెడ్ గా ఉండటం అనేది కొంచం కష్టం :) మీ కోసం ఇక్కడ ఈ వారం జరిగిన లంచేస్ ను సింపుల్ గా లిస్టింగ్ చేశాము. చూడండి.
'సర్చ్ లైట్' అనే ఫీచర్ లాంచ్ చేసింది గూగల్ ఆండ్రాయిడ్ ఫోన్ల పై. 2G నెట్ స్పీడ్ కు ఇది ఉపయోగపడుతుంది. వెబ్ పేజెస్ 80 శాతం తక్కువ డేటా తో ఫాస్ట్ గా లోడ్ అవనున్నాయి దీని ద్వారా.
Gionee కంపెని రెండు మేజర్ ఫోన్ లను బీజింగ్ లో జరిగిన ఈవెంట్ లో లాంచ్ చేసింది.
Elife E8 - ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్, ఫోటోగ్రఫీ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ఏ మోడల్ లో.
Elife E8 మోర్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ చూడగలరు.
మారథాన్ M5 - మిడ్ ర్యాంజ్ బడ్జెట్ ఫోన్, 6020 mah బ్యాటరీ దీని హైలైట్.
మారథాన్ M5 మరిన్ని స్పెసిఫికేషన్స్ ఇక్కడ చూడండి
సామ్సంగ్ యాక్టివ్ S6
అవుట్ డోర్ ఎన్విరాన్మెంట్ లో రఫ్ యూసేజ్ కోసం గేలక్సీ S6 మోడల్ ను యాక్టివ్ S6 పేరుతో లాంచ్ చేసింది. లుక్స్ అవి చూడటానికి కూల్ కన్నా సేఫ్టీ గా కనిపిస్తాయి. అయితే ఇది ప్రస్తుతానికి US లో నే జూన్ 12 నుండి అమ్మకాలను ప్రారంభించనుంది.
అధిక సమాచారం
మైక్రోసాఫ్ట్ డ్యూయల్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్స్ లాంచ్ అయ్యాయి ఈ వారం. ఒకేసారి రెండు ఫోనులకు చార్జింగ్ ఎక్కించుకునే సదుపాయం ఉంది దీనిలో.
Dell Venue 8 7480 పేరుతో డెల్ కంపెని ఇంటెల్ రియల్ సెన్స్ కెమేరా టెక్నాలజీ తో చాలా స్లిమ్ టాబ్లెట్ ను లాంచ్ చేసింది. ఇమేజ్ రీ ఫోకసింగ్ మరియు డీప్ సెన్సింగ్ దీని ప్రత్యేకతలు.
Dell XPS 13 లాప్టాప్ లాంచ్ అయ్యింది.
ఇన్ఫినిటీ ఎడ్జ్ డిస్ప్లే తో మ్యాక్ బుక్ ఎయిర్ కు ఇది నిజమైన కాంపిటేటర్ అని అంటున్నారు.
HP Elitebook ఫోలియో 1020 నోట్ బుక్
వరల్డ్ లోని అతి తేలికైన మరియు స్లిమ్ అయిన నోట్ బుక్ ఇది. విండోస్ 10 తో వస్తుంది.
ZTE Blade Qlux 4G
ZTE స్మార్ట్ ఫోన్ కంపెని తాజాగా దాని అధికారిక సైటు లో Blade Qlux 4G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. దీని ధర 4,999 రూ.
అధిక సమాచారం
ఓపెరా మినీ ఇప్పడు విండోస్ ఫోన్లకు కూడా రిలీజ్ అయ్యింది.
లెనోవో యోగా
లెనోవో నెక్స్ట్ జెనరేషన్ యోగా సిరిస్ టాబ్లెట్స్.. యోగా 300, యోగా 500, యోగా 3, యోగా 3 ప్రో అని నాలుగు టాబ్లెట్స్ ను లాంచ్ చేసింది. టాబ్లెట్ లోనే లాప్టాప్ పెర్ఫార్మెన్స్ ను అందించనున్నాయి. ధర 30,490 రూ.
లాజిటెక్ బ్రాండ్ UE బూమ్ బ్లూటూత్ స్పీకర్ ను ఇండియాలో లాంచ్ చేసింది.
అధిక సమాచారం