2024 సంవత్సరం మొదలైనప్పటి నుంచి మొబైల్ తయారీ కంపెనీలు అన్నీ కూడా పోటాపోటీగా కొత్త ఫోన్లను విడుదల చేశాయి. బడ్జెట్ ధర మొదలుకొని ప్రీమియం వరకు అన్ని విభాగాల్లో కూడా కొత్త ఫోన్లు మార్కెట్లో విడుదలయ్యాయి. ఈరోజు ఇండియా లో విడుదలైన కొత్త స్మార్ట్ ఫోన్స్ కంప్లీట్ అప్డేట్ మీకోసం అందిస్తున్నాం.
Price: Rs. 12,999
సాంసంగ్ బ్రాండ్ నుండి ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ తక్కువ బడ్జెట్ లో వచ్చింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ లో 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు లేటెస్ట్ మీడియా టెక్ లేటెస్ట్ 5G ప్రాసెసర్ వంటి మంచి ఫీచర్స్ ఉన్నాయి.
Price: Rs. 26,999
సాంసంగ్ ఎం సిరీస్ నుండి మరొక స్మార్ట్ ఫోన్ కూడా విడుదల చేసింది. అదే శాంసంగ్ గెలాక్సీ m5 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ వేగవంతమైన స్నాప్ డ్రాగన్ జెన్ 1 ప్రాసెసర్ మరియు అద్భుతమైన కెమెరా సెటప్ లతో వచ్చింది.
Price: Rs. 11,999
రియల్ మీ ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసినటువంటి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఈ నార్జో 70 ఎక్స్ 5జి ఫోన్. ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ బిగ్ డిస్ప్లేతో పాటుగా లేటెస్ట్ 5జి ప్రోసెసర్ తో అందించింది.
Price: Rs. 14,999
ఈ నార్జో 70 సిరీస్ నుండి వచ్చినటువంటి ఈ స్మార్ట్ ఫోన్ కూడా తక్కువ ధరలో మంచి ఫీచర్లను కలిగి వుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7050 ప్రోసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే మరియు 50MP AI కలర్ కెమెరాతో పాటు మరిన్ని ఫీచర్లను కలిగి వుంది.
Price: Rs. 16,999
రియల్ మీ p1 సిరీస్ నుండి కొత్తగా ఈ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. రూ. 15 వేల రూపాయల ఉప బడ్జెట్ లో తగిన ఫీచర్ లతో వచ్చింది. ఈ ఫోన్ లో రైన్ వాటర్ టచ్ సపోర్ట్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన ఆ`120Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి.
Price: Rs. 19,999
20 వేల రూపాయల ఉప బడ్జెట్ లో రియల్ మీ కొత్తగా తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ కూడా మంచి ఫీచర్స్ ను కలిగి ఉంటుంది.ఈ ఫోన్ లో 3d Curved AMOLED డిస్ప్లే, Snapdragon 6 Gen 1 ప్రోసెసర్, 3D VC కూలింగ్ సిస్టమ్ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
Price: Rs. 19,999
వన్ ప్లస్ ఇండియాలో లేటెస్ట్ విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ గొప్ప డిజైన్ మరియు ఫీచర్స్ తో వచ్చింది. ఈ వన్ ప్లస్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ Qualcomm లేటెస్ట్ Snapdragon 7 Gen 3 ప్రోసెసర్, 100W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్, SONY LYT-600 (IMX882) 50MP డ్యూయల్ రియర్ కెమెరా వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి వుంది.
Price: Rs. 10,999
ఐటెల్ ఈ నెలలో విడుదల చేసిన ఈ కొత్త ఫోన్ 10 వేల ధరలో వచ్చింది. ఈ ఫోన్ ను డిఫరెంట్ న్యూ డిజైన్, Helio G91 గేమింగ్ 4G ప్రోసెసర్, డ్యూయల్ DTS స్పీకర్లు, 108MP ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి ఫీచర్లను కలిగి వుంది.
Price: Rs. 8,499
లావా బడ్జెట్ O సిరీస్ నుంచి ఇటీవల విడుదలైన ఈ ఫోన్ కొత్త రాయల్ గోల్డ్ కలర్ ఆప్షన్ లో కూడా లభిస్తుంది. ఈ లావా ఫోన్ AG Glass Back, Unisoc T616 ఆక్టాకోర్ ప్రాసెసర్, 8GB RAM, 128GB స్టోరేజ్, 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి మరిన్ని ఫీచర్స్ ను కలిగి వుంది.
Price: Rs. 31,999
మోటోరోలా ఎడ్జ్ సిరీస్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ సరికొత్తగా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 30 వేల బడ్జెట్ లో HDR10+ సపోర్ట్ కలిగిన 1.5K 144Hz Curved డిస్ప్లే, Snapdragon 7 Gen 3 ప్రోసెసర్, 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా మరియు మరిన్ని ఫీచర్స్ ను కలిగి ఉంటుంది.
Price: Rs. 21,999
ఇన్ఫినిక్స్ సరికొత్త స్మార్ట్ ఫోన్ నోట్ 40 ప్రో 5జి 25 వేల ఉప బడ్జెట్ లో ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ LTPS Curved AMOLED డిస్ప్లే, Dimensity 7020 ప్రోసెసర్, 108MP ట్రిప్ల్ రియర్ కెమెరా, 20W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ వంటి గొప్ప ఫీచర్లతో వచ్చింది.
Price: Rs. 13,499
వివో ఈ T3 సిరీస్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ సరికొత్తగా విడుదల చేసింది. ఈ ఫోన్ ను 15 వేల రూపాయల ఉప బడ్జెట్ లో తగిన ఫీచర్స్ తో తీసుకు వచ్చింది. ఈ ఫోన్ కొత్త డిజైన్, Snapdragon 6 Gen 1 ప్రోసెసర్, 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, బిగ్ డిస్ప్లే వంటి ఫీచర్స్ ఉన్నాయి.
Price: Rs. 19,499
వివో ఈ T3 సిరీస్ నుండి 20 వేల బడ్జెట్ లో ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్లే లేటెస్ట్ డిజైన్, Dimensity 7200 5G ప్రోసెసర్, 50MP Sony IMX 882 OIS ట్రిపుల్ రియర్ కెమెరా, 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Price: Rs. 33,999
వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ V సిరీస్ నుండి ఈ V30 ఫోన్ ను 35 వేల రూపాయల ఉప బడ్జెట్ లో విడుదల చేసింది. ఈ వివో ప్రీమియం ఫోన్ Qualcomm లేటెస్ట్ Snapdragon 7 Gen 3 ప్రోసెసర్, 50 MP AF+OIS + 50 MP డ్యూయల్ రియర్, 50MP సెల్ఫీ, 80W ఫాస్ట్ ఛార్జ్ వంటి మరిన్ని ట్రెండీ ఫీచర్స్ ను కలిగి వుంది.
Price: Rs. 23,999
ఇప్పటి వరకు ప్రీమియం ఫోన్లు మాత్రమే తీసుకు వచ్చిన నథింగ్, ఇప్పుడు బడ్జెట్ ఫోన్ ను కూడా తీసుకొచ్చింది. అదే నథింగ్ ఫోన్ 2a 5జి మరియు ఈ ఫోన్ ను 25 వేల రూపాయల ఉప బడ్జెట్ లో అందించింది. ఈ నథింగ్ ఫోన్ Dimensity 7200 Pro ప్రోసెసర్, ఫ్లెక్సిబుల్ AMOLED స్క్రీన్, 50MP (OIS) + 50MP డ్యూయల్ రియర్ కెమెరా, ఆకర్షణీయమైన గొప్ప డిజైన్ వంటి ఫీచర్స్ తో అందించింది.
Price: Rs. 23,999
ఒప్పో బ్రాండ్ నుండి 25 వేల ఉప బడ్జెట్ లో ఈ కొత్త ఫోన్ ఇండియన్ మార్కెట్ లో లాంఛ్ అయ్యింది. ఈ ఫోన్ Dimensity 7050 ఆక్టా కోర్ 5జి ప్రోసెసర్, 64MP + 8MP + 2MP ట్రిపుల్ రియర్ కెమెరా, పెద్ద 120 Hz AMOLED స్క్రీన్ మరియు 67W SUPERVOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్స్ తో వచ్చింది.