ఇండియాలో లాంచ్ అయిన కొత్త స్మార్ట్ ఫోన్లు మరియు వాటి పూర్తి వివరాలు

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Aug 26 2022
ఇండియాలో లాంచ్ అయిన కొత్త స్మార్ట్ ఫోన్లు మరియు వాటి పూర్తి వివరాలు

ఇండియాలో లాంచ్ అయిన కొత్త స్మార్ట్ ఫోన్లు మరియు వాటి పూర్తి వివరాలు

OnePlus Nord 2T 5G: ప్రత్యేకతలు

ధర : రూ.28,999

ఈ వన్‌ప్లస్ నార్డ్ 2టి 5జి మీడియం 6.43 -ఇంచ్ FHD + రిజల్యూషన్ గల AMOLED డిస్ప్లేని కలిగి వుంటుంది మరియు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ 5G ప్రాసెసర్ Dimensity 1300 శక్తితో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ CPU మరియు ARM G77 MC9 GPU తో పనిచేస్తుంది మరియు ఆక్సిజన్ OS ఆధారితంగా ఆండ్రాయిడ్ 12 తో వస్తుంది.

ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో 50MP SonyIMX766 మైన్ సెన్సార్, జతగా 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ EIS కెమెరామరియు 2MP మోనో లెన్స్ ను జతచేసింది. సెల్ఫీల కోసం 32 MP సెల్ఫీ కెమెరాని SonyIMX615 సెన్సార్ తో అందించింది. వన్‌ప్లస్ నార్డ్ 2టి 5జి ఇన్ డిస్ప్లే  ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలిగి వుంటుంది మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ తో వస్త్తుంది. ఈ ఫోన్ 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 80W సూపర్ VOOC ఛార్జ్ సపోర్ట్ తో కలిగివుంటుంది.

ఇండియాలో లాంచ్ అయిన కొత్త స్మార్ట్ ఫోన్లు మరియు వాటి పూర్తి వివరాలు

POCO F4 5G

Price :రూ.27,999

POCO F4 5G స్మార్ట్ ఫోన్ లో Dolby Vision సపోర్ట్ కలిగిన 6.67 ఇంచ్ E4 సూపర్ AMOLED డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో అందించింది. ఈ డిస్ప్లే MEMC టెక్నాలజీతో వస్తుంది మరియు గరిష్టంగా 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను అందిస్తుంది. ఈ ఫోన్ గరిష్టంగా 3.2GHz క్లాక్ స్పీడ్ అందించ గల క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇది 12GB LPDDR5 RAM మరియు 256GB UFS 3.1 ROM వరకూ స్టోరేజ్ తో వస్తుంది.

ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఇందులో, (OIS) తో 64MP మైన్ కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ కలిగివుంటుంది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబర్చడానికి 7 లేయర్ గ్రాఫైట్ షీట్స్ కలిగిన 3112mm వేపర్ ఛాంబర్ ను కూడా కలిగి వుంది. ఈ ఫోన్ 4500mAh బ్యాటరీని 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.

ఇండియాలో లాంచ్ అయిన కొత్త స్మార్ట్ ఫోన్లు మరియు వాటి పూర్తి వివరాలు

Oppo A57

Price :రూ.13,999

ఒప్పో ఎ57 స్మార్ట్ ఫోన్ HD+ రిజల్యూషన్ అందించగల 6.56 ఇంచ్ డిస్ప్లేని కలిగి వుంది మరియు ఇది వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో వస్తుంది. ఈ ఒప్పో బడ్జెట్ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ గేమింగ్ ప్రాసెసర్ Helio G35 తో పనిచేస్తుంది.  ఈ ప్రాసెసర్ కి జతగా 3/4GB ర్యామ్ మరియు 6GB స్టోరేజ్ తో వస్తుంది. ఫోన్ IPX4 వాటర్ రెసిస్టెంట్ మరియు IP5X డస్ట్ రెసిస్టెంట్ తో కూడా వస్తుంది. అదనపు రక్షణ కోసం డిస్ప్లే ముందు భాగం పాండా గ్లాస్‌తో కప్పబడి ఉంటుంది.

ఇక కెమెరాల పరంగా, ఈ ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ను LED ఫ్లాష్ తో కలిగి వుంది. ఇందులో, 13MP ప్రధాన కెమెరాకి జతగా 2MP మోనో కెమెరాని అందించింది. అలాగే, సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్  వేగవంతంగా ఛార్జ్ చెయ్యగల సత్తా కలిగిన 33W  SuperVOOC సపోర్ట్ కలిగిన 5,000mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా అందించినట్లు ఒప్పో తెలిపింది.

ఇండియాలో లాంచ్ అయిన కొత్త స్మార్ట్ ఫోన్లు మరియు వాటి పూర్తి వివరాలు

Samsung Galaxy F13

Price :రూ.11,999

శామ్సంగ్ గెలాక్సీ F13 స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిటీ-v నోచ్ కలిగిన 6.6- ఇంచ్ LCD డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్ మరియు గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ శామ్సంగ్ యొక్క సొంత ప్రాసెసర్ Exynos 850 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో ఉంటుంది. ఈ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 6,000 mAh భారీ బ్యాటరీని కలిగివుంటుంది. ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ ను కూడా కలిగివున్నట్లు శామ్సంగ్ తెలిపింది.

ఈ ఫోన్ లో అందించిన కెమెరాల విషయానికి వస్తే, ఇందులో 8MP సెల్ఫీ కెమెరాను ఇన్ఫినిటీ-v కటౌట్ లో కలిగివుంటుంది. అలాగే, 50MP ప్రధాన సెన్సార్, 5MP అల్ట్రావైడ్ సెన్సార్ మరియు 2MP డెప్త్ సెన్సార్ లను కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరాను కలిగివుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా One UI 4.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5mm జాక్ తో వస్తుంది.

ఇండియాలో లాంచ్ అయిన కొత్త స్మార్ట్ ఫోన్లు మరియు వాటి పూర్తి వివరాలు

Realme C30

Price :రూ.7,499

రియల్ మీ C30 స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ ఫుల్ స్క్రీన్ ని 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Unisoc T612 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 2GB/3GB ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. ప్రత్యేకమైన మెమోరీ కార్డ్ ద్వారా స్టోరేజ్ ను 1TB వరకూ పెంచుకోవచ్చు. ఈ ఫోన్ లేక్ బ్లూ మరియు బ్యాంబూ గ్రీన్ రెండు కలర్ అప్షన్లలో లభిస్తుంది.

కెమెరాల విషయానికి వస్తే, రియల్ మీ C30 స్మార్ట్ ఫోన్ వెనుక కేవలం 8MP సింగల్ కెమెరాతో వస్తుంది. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 10W సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగిఉంటుంది.

ఇండియాలో లాంచ్ అయిన కొత్త స్మార్ట్ ఫోన్లు మరియు వాటి పూర్తి వివరాలు

Tecno Pova 3

Price :రూ. 11,499

టెక్నో పోవా 3 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.9 ఇంచ్ FHD+ డాట్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంటుంది. ఈ ఫోన్ వేగవంతమైన గేమింగ్ ప్రాసెసర్ Helio G88 శక్తితో పనిచేస్తుంది. అంతేకాదు, దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 5GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ ను కూడా జత చేసినట్లు కంపెనీ ప్రకటించింది. టెక్నో పోవా 3 అతిపెద్ద 7000 mAh బ్యాటరీని 33W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 14 గంటల గేమింగ్ సమయాన్ని అందిస్తుందని కూడా టెక్నో పేర్కొంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో 50MP మైన్ కెమెరాకి జతగా మరొక రెండు కెమరాలు ఉంటాయి మరియు క్వాడ్ LED ఫ్లాష్ కూడా వుంది. సెల్ఫీల కోసం ముందుభాగంలో 8MP సెల్ఫీ కెమెరాని అందించింది. గేమింగ్ కోసం 4D వైబ్రేషన్ Z-Axiz లీనియర్ మోటార్ మరియు DTS సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా ఈ ఫోన్ కలిగి వుంది.

ఇండియాలో లాంచ్ అయిన కొత్త స్మార్ట్ ఫోన్లు మరియు వాటి పూర్తి వివరాలు

Moto G82 5G

Price :రూ.21,499

మోటో జి82 5జి స్మార్ట్ ఫోన్ ను 6.6 ఇంచ్ 10బిట్ pOLED  డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన FHD+ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే సాధారణ 8బిట్ డిస్ప్లే కంటే అధిక రంగులను చూపించగలదని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ వేగవంతమైన బడ్జెట్ 5G ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB/8GB మరియు 128GB స్టోరేజ్ లను కూడా కలిగి వుంది. ఈ ఫోన్ ఎటువంటి యాడ్స్ లేని క్లీన్ ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది.   

ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరాని కలిగి ఉంటుంది. ఇందులో, 50MP OIS ప్రధాన కెమెరాకి జతగా అల్ట్రా వైడ్ మరియు డెప్త్ సెన్సార్ గా రెండు పనులు చేసే 8MP సెన్సార్ మరియు మ్యాక్రో సెన్సార్ వున్నాయి. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగిఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా కలిగి ఉంటుంది.

ఇండియాలో లాంచ్ అయిన కొత్త స్మార్ట్ ఫోన్లు మరియు వాటి పూర్తి వివరాలు

OPPO K10 5G

Price :రూ.17,499

ఒప్పో కే 10 వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ మరియు HD+ రిజల్యూషన్ అందించగల 6.56 ఇంచ్ డిస్ప్లేని కలిగి వుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు గరిష్టంగా 600 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ 5G ప్రాసెసర్ Dimensity 810 తో పనిచేస్తుంది.  ఈ పవర్ ఫుల్ ప్రాసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు జతగా 5GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ ను కూడా కలిగి ఉన్నట్లు ఒప్పో తెలిపింది.

ఈ ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 48MP ప్రధాన కెమెరాకి జతగా 2MP డెప్త్ కెమెరాని అందించింది. అలాగే, సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్  వేగవంతంగా ఛార్జ్ చెయ్యగల సత్తా కలిగిన 33W  SuperVOOC సపోర్ట్ కలిగిన 5,000mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ లో పంచీ సౌండ్ అందించగల కొత్త తరహా స్పీకర్లను కూడా అందించినట్లు ఒప్పో తెలిపింది.

ఇండియాలో లాంచ్ అయిన కొత్త స్మార్ట్ ఫోన్లు మరియు వాటి పూర్తి వివరాలు

Moto E32s

Price :రూ.8,999

మోటోరోలా Moto E32s పెద్ద 6.5 అంగుళాల HD డిస్ప్లేని పంచ్ హోల్ డిజైన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ MediaTek Helio G37 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా వేగవంతమైన LPDDR4X 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అలాగే, ఎంటువంటి యాడ్స్ బెడదా లేని బ్లోట్ వేర్ ఫ్రీ Android 12 OS పైన పనిచేస్తుంది.  

Moto E32s ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంటుంది. ఇందులో, 16MP మైన్ కెమెరా మరియు 2MP మ్యాక్రో మరియు 2MP డెప్త్ కెమెరా వున్నాయి. ఇక సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో కూడా 16MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ సైడ్- మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు ఫేస్ అన్లాక్ కూడా కలిగి ఉంటుది. ఈ ఫోన్ లో పెద్ద 5000 mAh బ్యాటరీని అందించింది.

ఇండియాలో లాంచ్ అయిన కొత్త స్మార్ట్ ఫోన్లు మరియు వాటి పూర్తి వివరాలు

iQOO Neo 6 5G

Price :రూ.29,999

ఐకూ నియో 6 5జి స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200Hz ఇన్స్టాంట్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగిన 6.62 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ E4 AMOLED డిస్ప్లే ని కలిగి వుంది.ఈ డిస్ప్లే 1300 పీక్ బ్రైట్నెస్ అందించ గలదు మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా గరిష్టంగా 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది.

ఆప్టిక్స్ విభాగంలో, ఈ లేటెస్ట్ ఐ కూ 5G ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 64MP OIS ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ తో వస్తుంది. ముందుభాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ లో 4,700mAh బ్యాటరీని 80W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. మొబైల్ గేమర్‌ లను ఆకర్షించడానికి, ఈ ఫోన్ లో 4D గేమ్ వైబ్రేషన్ ని లీనియర్ వైబ్రేషన్ మోటార్ తో జతచేసింది. 

ఇండియాలో లాంచ్ అయిన కొత్త స్మార్ట్ ఫోన్లు మరియు వాటి పూర్తి వివరాలు

ఇండియాలో లాంచ్ అయిన కొత్త స్మార్ట్ ఫోన్లు మరియు వాటి పూర్తి వివరాలు

Infinix Note 12

Price :రూ.14,999

ఇన్ఫినిక్స్ నోట్ 12 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేని FHD + రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 180Hz టచ్ శాంప్లింగ్ 100% DCI P3 కలర్ గ్యాముట్, గరిష్టంగా 1000 నిట్స్ బ్రైట్నెస్ అందిచడంతో పాటుగా గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ Helio G96 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB తో పాటుగా 5GB వర్చువల్ ర్యామ్ ను కూడా కలిగి వుంది మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేసింది.

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరాకి జతగా 2MP డెప్త్ మరియు AI లెన్స్ లను కలిగివుంది. ముందు భాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని క్వాడ్ LED ఫ్లాష్ కూడా కలిగి వుంది. ఈ ఫోన్ లో టైప్-C ఛార్జింగ్ పోర్ట్ కలిగిన భారీ 5,000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ లో DTS Surround Sound సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లను కూడా అందించింది. ఈ ఫోన్ X10.6 సాఫ్ట్ వేర్ పైన ఆండ్రాయిడ్ 12 OS పైన పనిచేస్తుంది.

ఇండియాలో లాంచ్ అయిన కొత్త స్మార్ట్ ఫోన్లు మరియు వాటి పూర్తి వివరాలు

Vivo Y75

Price :రూ.20,999

Vivo Y75 (4G) స్మార్ట్ ఫోన్ 6.44 ఇంచ్ AMOLED డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ తో కలిగివుంది. ఇది సాధారణ 60Hz రిఫ్రెష్ రేట్ వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో  వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Helio G96 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కలిగి వుంది.

ఇక కెమెరాల విభాగంలో, వివో వై75 ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా వుంది మరియు ఇందులో 50MP ప్రధాన కెమెరా, 8MP వైడ్ యాంగిల్ మరియు 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. ఈ సెల్ఫీల కోసం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎందుకంటే, ముందుభాగంలో 44MP AF సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 4,050mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన Funtouch OS 12 స్కిన్ పైన నడుస్తుంది.

ఇండియాలో లాంచ్ అయిన కొత్త స్మార్ట్ ఫోన్లు మరియు వాటి పూర్తి వివరాలు

Vivo Y01

Price :రూ. 8,999

ఈ స్మార్ట్ ఫోన్ 6.51 ఇంచ్ HD రిజల్యూషన్ డిస్ప్లే ని వాటర్ డ్రాప్ నోచ్ తో కలిగి ఉంటుంది. ఈ లేటెస్ట్ వివో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Helio P35 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. దీనికి జతగా 2GB ర్యామ్ మరియు 32 GB స్టోరేజ్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ Android Go ఆధారంగా Funtouch OS 11.1 సాఫ్ట్‌వేర్ పైన పనిచే నడుస్తుంది.

ఇక కెమెరాలు మరియు ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ వెనుక కేవలం 8MP సింగిల్ కెమెరా సేతువు మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరాని కలిగివుంది. ఈ ఫోన్ ప్రత్యేక మైక్రో SD కార్డ్ స్లాట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, మైక్రో-USB 2.0, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ రీడర్, WiFi ac మరియు బ్లూటూత్ 5.0 తో వస్తుంది. ఈ ఫోన్ 5,000 బిగ్ బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగిఉంటుంది.

ఇండియాలో లాంచ్ అయిన కొత్త స్మార్ట్ ఫోన్లు మరియు వాటి పూర్తి వివరాలు

Realme Narzo 50& 50Pro 5G

Price :రూ.15,999

రియల్‌మీ నార్జో 50 స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ డిస్ప్లే ని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. అయితే, Narzo 50 Pro 5G మాత్రం 6.4 ఇంచ్ AMOLED డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ 360HZ టచ్ శాంప్లింగ్ రేట్ తో కలిగి వుంది. Narzo 50 Pro 5Gలో MediaTek డైమెన్సిటీ 920 SoC మరియు Narzo 50 ప్రాసెసర్‌లో MediaTek డైమెన్సిటీ 810 చిప్‌సెట్ ఉన్నాయి.నార్జో 50 5G మూడు మోడళ్లలో లభిస్తే, నార్జో 50 ప్రో 5G రెండు మోడళ్లలో లభిస్తుంది.    

నార్జో 50 5G ఫోన్ లో వెనుక కెమెరాలలో 48MP సెన్సార్ మరియు పోర్ట్రెయిట్ లెన్స్ ఉన్నాయి, ముందు భాగంలో 8MP సెన్సార్ ఉంది. అయితే, నార్జో 50 ప్రో 5G స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా వుంది. ఇందులో, 48MP మైన్ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ సెన్సార్ మరియు 2MP మాక్రో షూటర్‌ను కలిగి ఉంటాయి.

ఇండియాలో లాంచ్ అయిన కొత్త స్మార్ట్ ఫోన్లు మరియు వాటి పూర్తి వివరాలు

Vivo X80

Price :రూ.54,999

Vivo X80 Pro స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ 9000 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇందులో ర్యామ్ కూడా తగినట్లుగా వుంటుంది. వివో X80 ప్రో 8GB/12GB  ర్యామ్ తో పాటుగా 128GB/256GB స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లేనిం FHD రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.  

కెమెరా పరంగా వివో X80 ప్రో వెనుక ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఇందులో 50MP SonyIMX866 మైన్ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ మరియు 12MP (2x, 20x superzoom) కెమెరాతో పాటుగా ముందు భాగంలో సెల్ఫీల కోసం 32MP సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ కెమెరా సిస్టం ను Zeiss ఆప్టిక్స్ మరియు V1+ చిప్ తో అందించింది.  ఈ ఫోన్ గొప్ప ఫోటోలు మరియు వీడియోలను చిత్రీకరించ గలదని వివో వెల్లడించింది.

ఇండియాలో లాంచ్ అయిన కొత్త స్మార్ట్ ఫోన్లు మరియు వాటి పూర్తి వివరాలు

Vivo X80 Pro

Price :రూ.79,999

Vivo X80 Pro స్మార్ట్ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 Gen 1 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. వివో X80 ప్రో 12GB ప్రధాన ర్యామ్ తో పాటుగా 256GB స్టోరేజ్ ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS ఆధారితంగా OriginOS Ocean సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది. ఈ ఫోన్ అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, వేరియబుల్ రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78 ఇంచ్ LTPO2  AMOLED డిస్ప్లే ని QHD+ రిజల్యూషన్ తో కలిగింవుంది.

కెమెరా పరంగా వివో X80 ప్రో వెనుక క్వాడ్ కెమెరాతో వస్తుంది. ఇందులో 50MP మైన్ కెమెరాని లేటెస్ట్ Samsung GNV OIS సెన్సార్ ని, 48MP  అల్ట్రా వైడ్ సెకండరీ సెన్సార్, 12MP గింబాల్ మరియు 8MP (60x జూమ్) పెరిస్కోప్ సెన్సార్ ని కలిగి వుంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 32MP సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ కెమెరా సిస్టం ను Zeiss ఆప్టిక్స్ మరియు V1+ చిప్  తో అందించింది.  ఈ ఫోన్ IP68 ఇన్‌గ్రెస్ ప్రొటెక్షన్ మరియు 80W వైర్డు ఛార్జింగ్‌తో పాటు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద 4700mAh బ్యాటరీని కూడా కలిగి వుంది.