ప్రస్తుతం మార్కెట్ లో భారీ కెమేరా సెట్టింగ్ తో స్మార్ట్ ఫోన్లు ఎంట్రీ ఇస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ 48MP మరియు 64MP కెమేరాలతో స్మార్ట్ ఫోన్లు మార్కెట్ ను ముంచెత్తితే, ప్రస్తుతం 108MP మరియు 200MP కెమేరా కలిగిన స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. మరి, మర్కెట్ లో 100MP మరియు 200MP భారీ కెమేరా సెట్టింగ్ తో లభిస్తున్న స్మార్ట్ ఫోన్ల ఏమిటో చూద్దామా.
ముందుగా మార్కెట్ లో లభిస్తున్న 200MP కెమేరా ఫోన్స్ ఏమిటో తెలుసుకుందామా
భారీ కెమేరా సెటప్ తో మోటోరోలా తెచ్చిన ఫోన్ గా ఈ MOTOROLA Edge 30 Ultra నిలుస్తుంది. ఈ ఫోన్ 200MP మెయిన్ కెమేరాకి జతగా 50MP + 12MP సెటప్ తో ఉంటుంది. అంతేకాదు, భారీ 60MP సెల్ఫీ కెమేరా ని కూడా ఈ మోటో ఫోన్ కలిగి వుంది. ఈ ఫోన్ వెనుక కెమేరాతో 30fps వద్ద 8K UHD వీడియోలను, 60fps వద్ద 4K UHD వీడియోలను చిత్రీకరించవచ్చు.
అతిపెద్ద కెమేరా సెటప్ తో శామ్సంగ్ తీసుకొచ్చిన స్మార్ట్ ఫోన్ ఈ SAMSUNG Galaxy S23 Ultra 5G. ఈ ఫోన్ లో 200MP + 10MP + 12MP + 10MP కెమేరా సెటప్ వుంది. ఈ ఫోన్ కెమేరా 100x వరకూ డిజిటల్ జూమ్ కి సపోర్ట్ చేస్తూంది మరియు ఈ ఫోన్ కెమేరాతో 30fps వద్ద 8K UHD వీడియోలను చిత్రికరించవచ్చు.
రియల్ మి లేటెస్ట్ గా విడుదల చేసిన 12 Pro సిరీస్ నుండి చ్చిన ఈ స్మార్ట్ ఫోన్ భారీ 200MP కెమేరా సెటప్ ను కలిగి వుంది. ఈ ఫోన్ లో 200MP (OIS) (Samsung ISOCELL HP3) మెయిన్ కెమేరాకి జతగా 8MP మరియు 2MP కెమేరాలు ఉన్నాయి. ఈ రియల్ మి ఫోన్ కెమేరాతో 30fps వద్ద 4K వీడియోలను చిత్రికరించవచ్చు.
షియోమి లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ 200 MP (ISOCELL HPX) లార్జ్ సెన్సార్ తో వచ్చింది. దీనికి జతగా 8MP + 2MP సెన్సార్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ కెమేరాతో 4K (at 30 fps) వీడియోలను షూట్ చేయవచ్చు. ఇది 10x వరకూ డిజిటల్ Zoom సపోర్ట్ వస్తుంది.
ఇంఫినిక్స్ ఇటీవల అందించిన ఈ స్మార్ట్ ఫోన్ 200MP మెయిన్ కెమేరాకి జతగా 13MP + 2MP ట్రిపుల్ కెమేరా సెట్టింగ్ ని కలిగి వుంది. ఈ ఫోన్ కెమెరాతో బొకే తో 2K Video లను రికార్డ్ చేయవచ్చు మరియు ఈ ఫోన్ 180W భారీ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ని కూడా కలిగి వుంది.
ఇప్పుడు మార్కెట్ లో లభిస్తున్న 100MP కెమేరా ఫోన్స్ ఏమిటో తెలుసుకుందామా
రియల్ రీసెంట్ గా ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసిన ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ 100MP OIS ట్రిపుల్ కెమేరాని 4K వీడియో రికార్డ్ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ స్మార్ట్ ఫోన్ Cinema Mode మరియు AI Video Tracking వంటి మరిన్ని కెమేరా ఫీచర్లను కలిగి వుంది.
గత నెలలో ఇండియన్ మార్కెట్ లో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ కూడా 100MP OIS ట్రిపుల్ కెమేరాని కలిగి వుంది. ఈ స్మార్ట్ ఫోన్ కెమేరాతో 30fps వద్ద 4K వీడియోలను రికార్డ్ చేయవచ్చు. ఈ ఫోన్ లో చాలా కెమేరా ఫీచర్లను కూడా రియల్ మి అందించింది.
ఇంఫినిక్స్ ఇండియాలో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో 108MP ట్రిపుల్ రియర్ కెమేరా మరియు 60MP సెల్ఫీ కెమేరా కలిగిన బెస్ట్ ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ కెమేరాతో 30fps వద్ద 2K షార్ట్ వీడియోలను రికార్డ్ చేయవచ్చు.
ఒప్పో రెనో 8T స్మార్ట్ ఫోన్ 108MP (Samsung HM6) మెయిన్ కెమేరా మరియు 40x మైక్రో స్కోప్ కెమేరాతో కూడా వస్తుంది. ఈ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమేరా వుంది మరియు ఈ ఫోన్ కెమేరాతో 1080p వీడియోలను 30fps వద్ద చిత్రీకరించవచ్చు.
ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ 108MP + 8MP + 2MP సెటప్ తో వస్తుంది. ఈ ఫోన్ మెయిన్ కెమేరా UHD 4K (30fps) వీడియో రికార్డింగ్ మరియు 10X డిజిటల్ జూమ్ సపోర్ట్ ను కలిగి వుంది.
ఇండియాలో రీసెంట్ గా విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ 108MP అల్ట్రా వైడ్ + 50MP RGBW-Pro కెమేరా సిస్టంతో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ తో స్టన్నింగ్ ఫోటోలు మరియు వీడియోలను చిత్రికరించ్చని కంపెనీ చెబుతోంది.
గెలాక్సీ S22 అల్ట్రా స్మార్ట్ ఫోన్ 108MP + 12MP + 10MP + 10MP కెమేరా సెటప్ తో వస్తుంది. ఈ ఫోన్ కెమేరాతో 8K UHD వీడియోలను చిత్రికరించవచ్చు మరియు ముందు 40MP సెల్ఫీ కెమేరా కూడా వుంది.
రియల్ మి యొక్క బడ్జెట్ కర్వ్డ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ 10 Pro+ స్మార్ట్ ఫోన్ 108MP (S5KHM6SX03) మెయిన్ కెమేరాతో వస్తుంది. ఈ ఫోన్ కెమేరాతో 4K (at 30 fps) వీడియోలను తియ్యవచ్చు మరియు ఈ ఫోన్ 20X డిజిటల్ జూమ్ సపోర్ట్ తో కూడా వస్తుంది.
ఈ పోకో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 108MP + 8MP + 2MP కెమేరా సెటప్ తో వచ్చింది. ఈ షియోమి స్మార్ట్ ఫోన్ తో 4K వీడియోలను 30fps వద్ద చిత్రీకరించవవచ్చు మరియు ఈ కెమేరా 10X డిజిటల్ జూమ్ సపోర్ట్ తో వస్తుంది.
ఈ షియోమి స్మార్ట్ ఫోన్ 108MP ట్రిపుల్ రియర్ కెమేరాని 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ VLOG Mode, Time-Lapse వంటి మరిన్ని కెమేరా ఫీచర్లను కూడా కలిగి వుంది.
వన్ ప్లస్ ఇటీవల సరికొత్తగా విడుదల చేసిన ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 108MP (Samsung S5KHM6SX03) కెమేరా సెటప్ తో వస్తుంది. ఈ ఫోన్ కెమేరాతో 30fps వద్ద 1080p వీడియోలను చిత్రీకరించవచ్చు.
రూ.25,000 లోపల బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ కోసం చూస్తున్నారా..ఒక లుక్కేయండి.! Click Here