ఇండియన్ మర్కెట్లో ఇటీవల్ చాలా స్మార్ట్ ఫోన్లు విడుదల చేయబడ్డాయి. ఈ స్మార్ట్ ఫోన్లు ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఇటీవల విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లను మరియు వాటి వివరాలను ఒకేదగ్గర చూడాలనుకుంటే, మీరు సరైన చోటకే వచ్చారు. ఎందుకంటే, ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల లిస్ట్ ఇక్కడ అందించాను. మీరు ఇక్కడ నుండి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల ధరతో సహా వాటి వివరాలను కూడా పూర్తిగా చూడవచ్చు.
ధర : రూ.12,499
నోకియా జి 11 స్మార్ట్ ఫోన్ Unisoc T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు జతగా 4 జీబీ ర్యామ్ తో వస్తుంది. ఈ ఫోన్ పెద్ద 6.5-అంగుళాల HD+ స్క్రీన్ తో వస్తుంది మరియు ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీని రెగ్యులర్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ ఫోన్ వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరా మరియు 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా వుంది. ఈ ఫోన్ ఎటువంటి యాడ్స్ బెడదా లేని Stock Android 12 OS పైన నడుస్తుంది మరియు రెండు మేజర్ అప్డేట్స్ ను అందుకుంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని కలిగివుంది. లావా బ్లేజ్ 5G మీడియాటెక్ 5G ప్రాసెసర్ Dimensity 700 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 4G ర్యామ్ మరియు 3GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో కూడా వస్తుంది. స్టోరేజ్ పరంగా, ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో 50MP మైన్ కెమెరాతో పాటుగా డెప్త్ మరియు మ్యాక్రో కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS పైన పనిచేస్తుంది మరియు 5,000mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది.
ధర : రూ.18,999
Moto G72 5G స్మార్ట్ ఫోన్ 6.55 ఇంచ్ FHD+ 10బిట్ pOLED డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR+ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G99 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ లను అందిస్తుంది. ఈ ఫోన్ వెనుక క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరా వుంది. ఇందులో 108MP ప్రధాన సెన్సార్, 8ఎంపి సెన్సార్ అల్ట్రా-వైడ్ మరియు డెప్త్ కెమెరాగా కూడా పనిచేస్తుంది. ముందు భాగంలో ఉన్న పంచ్ హోల్ లో 16MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ పెద్ద 5,000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ ఫోన్ బ్లోట్ వేర్ బడెదను లేని లేటెస్ట్ Near-Stock Android 12 OS పైన నడుస్తుంది
ధర : రూ.14,990
Vivo T1 5G స్మార్ట్ ఫోన్ 6.58 ఇంచ్ FHD+ LCD డిస్ప్లేని కలిగివుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. వివో T1 5జి ఫోన్ 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ మరియు 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన Funtouch OS 12 స్కిన్ పైన నడుస్తుంది.
ధర : రూ.54,999
మోటోరోలా ఎడ్జ్ 20 అల్ట్రా 6.67 ఇంచ్ FHD + రిజల్యూషన్ గల పంచ్ హోల్ ఎండ్ లెస్ ఎడ్జ్ డిస్ప్లే తో వుంటుంది. ఈ డిస్ప్లే 144 Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సర్టిఫైడ్ pOLED డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 1 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు 8జిబి ర్యామ్ జతగా వస్తుంది. ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగివుంది. ఈ కెమెరా సెటప్ లో 200MP ప్రధాన కెమెరాని OIS సపోర్ట్ తో కలిగివుంది. దీనికి జతగా అల్ట్రా వైడ్/ మ్యాక్రో సపోర్ట్ చేసే 50MP భారీ సెన్సార్ మరియు 12MP పోర్ట్రైట్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 60MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ లో 125W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,610 mAh బ్యాటరీని అందించింది. ఇది యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ కలిగిన 3D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వుంది.
ధర : రూ.9,999
లావా బ్లేజ్ ప్రో స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ IPS డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. బ్లేజ్ ప్రో మీడియాటెక్ G37 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 4GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ లో 3GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ మరియు 32GB ఇంటర్నల్ మెమొరీ ఉన్నాయి. Lava Blaze Pro వెనుక AI ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP మెయిన్ కెమెరా వుంది మరియు ఈ కెమెరా 6X జూమ్ వరకూ సపోర్ట్ చేస్తుందని కూడా లావా పేర్కొంది. ముందు 8MP కెమెరాని స్క్రీన్ ప్లాష్ తో ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 12 OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 10W సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బిగ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.
ధర : రూ.42,999
మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యుజన్ 6.55 ఇంచ్ FHD+ pOLED డిస్ప్లేని 144 Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సపోర్ట్ తో కలిగివుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 888+ ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు 8జిబి ర్యామ్ జతగా వస్తుంది. ఎడ్జ్ 20 ఫ్యుజన్ వెనుక OIS సపోర్ట్ కలిగిన 50MP ప్రధాన కెమెరాకి జతగా 13 అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP డెప్త్ కెమెరా సెన్సార్ కలిగిన ట్రిపుల్ కెమెరా వుంది. 32MP సెల్ఫీ కెమెరాని ఈ ఫోన్ కలిగివుంది. ఈ ఫోన్ 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,400 mAh బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ లో యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ కలిగిన 3D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వుంది.
ధర : రూ.29,999
రియల్‌మీ జిటి నియో 3టి 80W స్మార్ట్ ఫోన్ 6.62 ఇంచ్ FHD+ E4 AMOLED డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది మరియు ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా Realme UI 3.0 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది. ఇందులో, 64MP మైన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. ఫోన్ ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా కూడా కలిగివుంది. ఈ ఫోన్ వేగవంతమైన 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ Dolby Atmos మరియు Hi-res సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లతో వస్తుంది.
ధర : రూ.17,999
టెక్నో క్యాంమాన్ 19 ప్రో మాండ్రియన్ పెద్ద 6.7 ఇంచ్ FHD+ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ ఫోన్ మీడియాటెక్ గేమింగ్ ప్రాసెసర్ Helio G96 SoC తో పనిచేస్తుంది. ఇది 8GB LPDDR4x ర్యామ్ మరియు 5GB వరకు వర్చువల్ RAM తో వస్తుంది. అల్ట్రా క్లారిటీ కోసం ఇండస్ట్రీలో మొదటి RGBW+(G+P) లెన్స్‌తో 64MP OIS ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఈ సెటప్ లో 64MP+50MP+2MP ట్రిపుల్ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాతో అద్భుతమైన ఫోటోలను చిత్రికరించవచ్చని టెక్నో చెబుతోంది. సెల్ఫీల కోసం ముందుభాగంలో 32MP HDR సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ డిజైన్ పరంగా, మాండ్రియన్ ఆర్ట్ స్ఫూర్తితో భారతదేశపు మొట్టమొదటి మల్టీ కలర్ ఛేంజింగ్ ఫోన్ గా ఇది మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ లో దీర్ఘ బ్యాకప్ కోసం 5000mAh హై కెపాసిటీ బ్యాటరీని 33W ఫ్లాష్ ఛార్జర్ సపోర్ట్ తో అందించింది.
ధర : రూ.7,499
రియల్ మీ C30s స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ ఫుల్ స్క్రీన్ ని 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ARM Cortex-55 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 2GB/4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. రియల్ మీ C30s స్మార్ట్ ఫోన్ వెనుక కేవలం 8MP సింగల్ కెమెరాతో వస్తుంది. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 10W సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగిఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా realme UI Go Edition సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.
ధర : రూ.27,999
Vivo V20 Pro స్మార్ట్ ఫోన్ 6.44-అంగుళాల FHD+ AMOLED ప్యానెల్‌ను కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక ప్యానెల్ ఫ్లోరైట్ AG గ్లాస్ తో తయారు చేయబడింది, కాబట్టి ఇది రంగులు మారుస్తుంది. వి 25 ప్రో 12 జిబి ర్యామ్ మరియు 256 జిబి స్టోరేజ్‌తో మీడియాటెక్ 5G ప్రాసెసర్ Dimensity 900 శక్తితో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 పై ఆధారపడి FuntouchOS 12 పై నడుస్తుంది. ఈ ఫోన్ 64MP ప్రాధమిక కెమెరా, 8MP వైడ్ యాంగిల్ మరియు 2 ఎంపి మ్యాక్రో సెన్సార్ కలిగిన ట్రిపుల్ కెమెరా వుంది. 50MP Eye AF సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ముందు భాగంలో వుంది. ఈ ఫోన్ 44W ఫ్లాష్ ఛార్జ్ 4 సపోర్ట్ కలిగిన 4,500mAh బ్యాటరీతో వస్తుంది.
ధర : రూ.6,499
రియల్ మీ నార్జో 50i ప్రైమ్ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 400 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ పేరు తెలియని Unisoc ఆక్టా కోర్ ప్రోసెసర్ మరియు ARM Mali-G57 శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 4GB ర్యామ్ కూడా ఉంది. ఈ ఫోన్ లో వెనుక కేవలం 8MP AI డ్యూయల్ కెమెరా మాత్రమే వుంది. సెల్ఫీల కోసం 5MP సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది.ఈ ఫోన్ 10W సాధారణ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,000 బిగ్ బ్యాటరీతో వచ్చింది.
ధర : రూ.14,499
ఈ స్మార్ట్ ఫోన్ 6.55 ఇంచ్ HD రిజల్యూషన్ LCD డిస్ప్లే ని వాటర్ డ్రాప్ నోచ్ తో కలిగి ఉంటుంది. ఈ లేటెస్ట్ వివో స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Helio G70 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 128 GB స్టోరేజ్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారమైన Funtouch OS 12 సాఫ్ట్‌వేర్ పైన నడుస్తుంది. ఈ ఫోన్ వెనుక 50MP మరియు 2MP డ్యూయల్ రియర్ కెమెరాని కలిగివుంది. అలాగే ముందు 8MP సెల్ఫీ కెమెరాని కలిగివుంది. ఈ ఫోన్ 5,000 బిగ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.
ధర : రూ.8,999
రియల్ మీ C33 స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ స్క్రీన్ ని 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Unisoc T612 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 3GB/4GB ర్యామ్ మరియు 32GB/64GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. రియల్ మీ C33 స్మార్ట్ ఫోన్ వెనుక కేవలం 50MP+0.3MP డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 10W సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగిఉంటుంది.
ధర : రూ.12,999
రెడ్ మి 11 ప్రైమ్ 5జి ఫోన్ 6.58 ఇంచ్ FHD+ డిస్ప్లేని 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ 5G ప్రోసెసర్ Dimensity 700 SoC తో పనిచేస్తుంది. ఈ ఫోన్ వెనుక 50MP AI డ్యూయల్ రియర్ కెమెరాని కలిగివుంది. ముందుభాగంలో సెల్ఫీల కోసం 5ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో మరియు బాక్స్ లో 22.5 W ఫాస్ట్ ఛార్జింగ్ తో తీసుకువస్తుంది. ఇది MIUI 13 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 12 OS తో నడుస్తుంది.
ధర : రూ .6,499
షియోమి రెడ్‌మి ఎ1 పెద్ద 6.52-అంగుళాల HD + IPS LCD డిస్ప్లేని కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క స్క్రీన్ మీకు అత్యధికంగా 400 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ మరియు 20: 9 ఎస్పెక్ట్ రేషియోని ఇస్తుంది. Redmi A1 మీడియా టెక్ హెలియో జి 22 ప్రాసెసర్ కి జతగా 2 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ తో వస్తుంది. ఇది MIUI 12.5 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది. ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ వుంది మరియు అందులో 8ఎంపి ప్రధాన కెమెరాని అందించింది. ముందు నాచ్ కటౌట్‌లో 5MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 5,000 mAh బ్యాటరీని 10W రెగ్యులర్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంది.
ధర : రూ .4,699
నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ 2.8 ఇంచ్ మైన్ స్క్రీన్ ను జూమ్ చేసిన యూజర్ ఇంటర్ఫేస్ తో కలిగివుంది. ముందు 1.77 ఇంచ్ ఫ్రంట్ డిస్ప్లే ఇన్కమింగ్ కాల్ లను సులభంగా గుర్తించేలా చేస్తుంది. ఈ ఫోన్ తేలికగా వున్నా ఈ ఫోన్ 1450 mAh బ్యాటరీని కలిగివుంది. ఈ ఫోన్ అడ్జెస్ట్ చేయగల వాల్యూమ్ సెట్టింగ్లతో స్పష్టమైన కాల్ నాణ్యతను అందిస్తుంది మరియు వినికిడి సహాయానికి అనుకూలమైనది (HAC). ఈ ఫోన్ లో 0.3 MP కెమెరాని కూడా నోకియా అందించింది. ఈ ఫోన్ డ్యూయల్ 4G సిమ్ లకు సపోర్ట్ చేస్తుంది మరియు 48MB ర్యామ్+128MB ఇంటర్నల్ స్టోరేజిలను కలిగివుంది.
ధర : రూ .18,499
ViVO Y35 స్మార్ట్ ఫోన్ 6.58- ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. వివో వై35 స్మార్ట్ ఫోన్ 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్‌తో, క్వాల్కమ్ పవర్ ఫుల్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 680 SoC శక్తితో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 పై ఆధారపడి FuntouchOS 12 పై నడుస్తుంది. ఇందులో EIS సపోర్ట్ కలిగిన 50 ఎంపి ప్రాధమిక కెమెరా, 2 ఎంపి బొకే సెన్సార్ మరియు 2 ఎంపి మ్యాక్రో సెన్సార్ ఉంటాయి. ముందు వైపు, 16MP సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది. Y35 స్మార్ట్ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,000mAh బ్యాటరీతో వస్తుంది.
ధర : రూ .13,999
రెడ్ మి నోట్ 11 SE పెద్ద 6.43 ఇంచ్ FHD+ సూపర్ AMOLED డిస్ప్లేని పంచ్ హోల్ డిజైన్ తో కలిగివుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ గేమింగ్ ప్రోసెసర్ Helio G95 SoC తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ లను అందిస్తుంది. ఈ ఫోన్ వెనుక క్వాడ్ రియర్ కెమెరాని కలిగివుంది. ఇందులో 64MP మైన్ కెమెరా, 8ఎంపి అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP డెప్త్ మరియు 2MP పోర్ట్రైట్ సెన్సార్ లను అందించింది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 13ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఇది MIUI 12.5 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది.
ధర : రూ .14,999
రియల్ మీ 9i 5G స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180 Hz టచ్ శాంప్లింగ్ తో కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 810 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 6GB ర్యామ్ తో పనిచేస్తుంది. Realme 9i స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP మైన్ కెమెరాకి జతగా 2MP పోర్ట్రైట్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ వున్నాయి. అలాగే, సెల్ఫీల కోసం 8MP AI సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన పెద్ద 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా Realme UI 3.0 సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.