మీ ఫోన్ లో గొప్ప ర్యామ్ మరియు ప్రాసెసర్ ఉంటే, మీ ఫోన్ మల్టీ టాస్కింగ్,గేమింగ్ మరియు హెవీ యూసేజ్ ఉన్నప్పుడు అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు అని చెప్పవచ్చు. అయినప్పటికీ, కొన్ని ఫోన్లు ఈ విభాగాలలో మంచిగా ఉన్నాకూడా, మనం కొనలేని ధరలతో ఉంటాయి. మన ఫోన్‌లలో గేమింగ్ చేసేటప్పుడు మరింత ప్రాసెసర్ మరియు మంచి ర్యామ్ లేదా అంతకంటే ఎక్కువ ర్యామ్ అవసరం.కాబట్టి, వాటి ప్రత్యేకతల పరంగా చౌక ధరలో సరైన ప్రత్యేకతలతో లభించే స్మార్ట్ ఫోన్ల జాబితాను మీకోసం ఇక్కడ అందిస్తున్నాను.
లేటెస్ట్ 6 జీబీ ర్యామ్‌తో కూడిన స్మార్ట్ ఫోన్లు
ధర : Rs 16,990
ఈ స్మార్ట్ ఫోన్ ఒక 6.53 అంగుళాల ఫుల్ HD+ పంచ్ హోల్ డిజైన్ డిస్ప్లేతో ఉంటుంది. సంస్థ ప్రకారంగా, ఇది ఒక 90.77 %స్క్రీన్- టూ- బాడీ రేషియోతో వస్తుంది.ఈ వివో Z1 ప్రో మాత్రం సరికొత్త స్నాప్ డ్రాగన్ 712 AIE ఆక్టా కోర్ 10nm ప్రాసెసర్ తో వస్తుంది. ఇందులో స్పీడ్ అందించడానికి కావాల్సిన అన్ని టర్బో స్పీడ్ టెక్నాలజీని చాల విభాగాలకు అందించారు. ఇది ఒక 18W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేయగల ఒక పెద్ద 5,000 mAh బ్యాటరీతో వస్తుంది.
ధర : 16,999
షావోమి యొక్క ఈ రెడ్మి నోట్ 7 ప్రో గురించి మాట్లాడితే, ఈ స్మార్ట్ ఫోన్ ఒక 6.3-అంగుళాల FHD+ డిస్ప్లేను కలిగి ఉంది, ఇది 19.5: 9 ఆస్పెక్ట్ రేషియో మరియు డాట్ నోచ్ డిజనుతో ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ముందు మరియు వెనుక భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క రక్షణ ఇవ్వబడింది మరియు ఈ ఫోన్ ఒక రిఫ్లెక్టివ్ గ్లాస్ డిజైన్తో వచ్చింది. ఈ రెడ్మి నోట్ 7 ప్రో ఒక క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 675 ఆక్టా కోర్ ప్రాసెసరుతో ప్రారంభించబడింది, ఇది కైరో 460 ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ అడ్రినో 612 GPU తో జత చేయబడింది. ఈ బడ్జెట్ ధరలో ఒక 48MP SONY IMX586 సెన్సార్ కెమెరాతో వచ్చిన మొదటి ఫోన్.
ధర : 16,999
రియల్మీ 3 ప్రో లో, మీరు ఒక FHD +, 2340 X 1080p పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.3-అంగుళాల డ్యూ - డ్రాప్ నోచ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో రక్షించబడింది. ఈ రియల్మీ 3 ప్రో ఒక క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు జిపియు అడ్రినో 616 లతో ప్రారంభించబడింది, ఈ చిప్సెట్ X 15 మోడెమ్తో చాలా స్మూత్ కాలింగ్ అందిస్తుంది మరియు 4 K HDR ప్లేబ్యాక్కు మద్దతు ఇస్తుంది. గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి హైపర్ బూట్ 2.0 ఇందులో చేర్చబడింది. ఇక బ్యాటరీ గురించి మాట్లాడితే, ఇందులో ఒక 4045mah బ్యాటరీని ఒక CABC మోడ్తో మద్దతు ఇస్తుంది, దీని ద్వారా బ్యాటరీ జీవితాన్ని 10% వరకు పెంచవచ్చు.
ధర : 17,990
గెలాక్సీ M సిరీస్‌లో ముందుగా ప్రారంభించిన ఈ మొబైల్ ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో లాంచ్ చేయబడింది, దీనికి తోడు ఇది గొప్ప ట్రిపుల్ కెమెరా సెటప్ తో కూడా ఉంటుంది. ఇది కాకుండా, మీరు ఫోన్‌లో AMOLED స్క్రీన్‌ను కూడా పొందుతారు, ఫోన్‌లో మీకు 6GB RAM 64GB స్టోరేజ్ లభిస్తుంది.
ధర : Rs 19,990
ఈ స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.3 అంగుళాల ఇన్ఫినిటీ - O డిస్ప్లేతో అందించబడుతుంది. ఇది కూడా ఇది ఒక 91.6 %స్క్రీన్- టూ- బాడీ రేషియోతో వస్తుంది. ఈ ఫోన్ ఒక స్నాప్ డ్రాగన్ 675 ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది మరియు రియర్ ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఈ ప్రొసెసరు ట్రిపుల్ రియర్ కెమేరాకు చక్కగా అనుకూలిస్తుంది. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 9 ఫై పైన ఆధారితంగా సరికొత్త శామ్సంగ్ one UI పైన నడుస్తుంది. గెలాక్సీ M40 కేవలం 6GB ర్యామ్ జతగా 128GB వేరియంటుతో మాత్రమే వస్తుంది. అలాగే, గెలాక్సీ M40 ఒక SD కార్డు ద్వారా 512GB వరకూ స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తాయి.
లేటెస్ట్ 8 జీబీ ర్యామ్‌తో కూడిన స్మార్ట్ ఫోన్లు
ధర : 30,990
షావోమి తన రెడ్మి K20 ప్రో స్మార్ట్ ఫోన్ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్, ఒక క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 855 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు 48MP ట్రిపుల్ రియర్ కెమేరాతో విడుదల చేసింది. ఈ కెమెరాలో అందించిన టెలిఫోటో కెమేరాతో 2X ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. అలాగే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు మరిన్ని ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. మొదటి సేల్ 22 జూలై మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది .
ధర : 49,990
OPPO రెనో 10X జూమ్ HDR 10+ కంటెంట్ మద్దతు మరియు 93.1 శాతం బాడీ టూ స్క్రీన్ రేషియాతో కాస్తుంది. ఇందులో ఒక పెద్ద 6.6 అంగుళాల AMOLED డిస్ప్లేని అందించారు. ఈ ఫోన్ ముందు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 తో భద్రపరచబడింది. ఇది శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 855 చిప్సెట్ శక్తితో 6GB / 128GB మరియు 8GB / 256GB వేరియంట్స్ మరియు ఓషియన్ గ్రీన్ మరియు జెట్ బ్లాక్ వాటి రంగుఎంపికలతో కొనుగోలు చేయవచ్చు.
లేటెస్ట్ 12 జీబీ ర్యామ్‌తో కూడిన స్మార్ట్ ఫోన్లు
ధర : 57,999
ఈ స్మార్ట్ ఫోన్ 3120 x 1440 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందిచగల ఒక 6.67 అంగుళాల QHD + ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో అందించింది. ఈ డిస్ప్లేలో ఎటువంటి నోచ్ లేకుండా పూర్తి స్క్రీన్ అందించింది మరియు ఒక 19.5:9 ఆస్పెక్ట్ రేషియాతో వస్తుంది. ఈ ఫోన్ ఇండియాలో మొదటిసారిగా అత్యంత వేగవంతమైన క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 855 ఆక్టా కోర్ 7nm ప్రాసెస్సరుతో తీసుకొచ్చింది. ఈ వేగవంతమైన ప్రాసెసరుకు జతగా, 6GB/8GB/12GB ర్యామ్ ఎంపికలతో తీసుకొచ్చింది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లేలో ఒక అంతర్గత ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా అందించింది. కేవలం వేగం ఒక్కటే కాకుండా, స్టైల్ మరియు ట్రెండ్ రెండింటిని జత చేసినట్లు చెప్పొచ్చు.
ధర :49,999
ఈ స్మార్ట్ ఒక మంచి రిజల్యూషన్ మరియు చక్కని వ్యూ అందించగల ఒక 6.39 అంగుళాల ట్రూ వ్యూ AMOLED డిస్ప్లేతో మరియు HDR సపోర్టుతో వస్తుంది. అంతేకాదు, ఈ అమోలెడ్ డిస్ప్లే ఇండిపెండెంట్ ఇమేజ్ ప్రాసెసింగ్ తో పాటుగా వస్తుంది. దీనితో గేమింగ్ సమయంలో మీకు చక్కని కలర్స్ మరియు డీప్ బ్లాక్ వాటి ఫీచర్లతో గొప్ప గేమింగ్ వ్యూ అనుభూతిని ఇస్తుంది. ఇక ఒక గేమింగ్ ఫోనులో కావాల్సిన గొప్ప ప్రాసెసర్ కూడా ఇందులో అందించారు. ఇది స్నాప్ డ్రాగన్ 855 ఆక్టా కోర్ ప్రాసెసెరుకి జతగా, గరిష్టంగా 12GB ర్యామ్ తో వస్తుంది. కాబట్టి, అవధులులేని గేమింగ్ స్పీడ్ అందుకోవచ్చు మరియు ఇందులో అందించిన డైరెక్ట్ టచ్ మల్టి లేయర్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ తో ఫోన్ చల్లగా ఉండేలా చూస్తుంది.