భారతదేశంమొబైల్స్ మార్కెట్ లో ఎక్కడ చూసినా ఇప్పుడు Curved Display స్మార్ట్ ఫోన్ ట్రెండ్ నడుస్తోంది. దీనికి తగినట్టుగానే అన్ని ప్రధాన మొబైల్ తయారీ కంపెనీలు కూడా Curved Display తో తమ కొత్త స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేస్తున్నాయి. గతంలో చాలా ప్రీమియం స్మార్ట్ ఫోన్ లలో మాత్రమే కనిపించే కర్వ్డ్ డిస్ప్లే ఇప్పుడు బడ్జెట్ ధరలో కూడా లభించడంతో ప్రజలు ఎక్కువగా ఈ ఫోన్ లను కొనడానికే ఇష్టపడుతున్నారు. అందుకే, ఈరోజు 30 వేల ధరలో లభిస్తున్న బెస్ట్ Curved Display స్మార్ట్ ఫోన్స్ పైన ఒక లుక్కేద్దాం పదండి.
Price : రూ. 13,999
చైనీస్ బేస్ మొబైల్ తయారీ కంపెనీ itel, ఇండియాలో బడ్జెట్ సార్ట్ ఫోన్ లను అందిస్తున్న కంపెనీగా గుర్తింపు పొందింది. ఈ బ్రాండ్ ఇప్పుడు కేవలం రూ. 13,999 ధరకే Curved Display మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో itel S23+ స్మార్ట్ ఫోన్ ను అక్టోబర్ 6న ఇండియాలో లాంచ్ చేస్తోంది.
Price : రూ. 20,999
మోటోరోలా రీసెంట్ గా భారత మార్కెట్ లో విడుదల చేసిన ఈ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ తక్కువ ధరలో 10-bit pOLED Curved Display తో వచ్చిన ఫాలెన్ గా నిలిచింది. ఈ ఫోన్ లో 50 MP OIS కెమేరా, బిగ్ బ్యాటరీ, 15 5G Bands సపోర్ట్, Dolby Atmos సపోర్ట్ తో పాటుగా IP68 రేటింగ్ వంటి గొప్ప ఫీచర్స్ ఉన్నాయి.
Price : రూ. 23,999
25 వేల రూపాయల ఉపధరలో 3D Curved AMOLED డిస్ప్లే మరియు 64MP Aura Light OIS కెమేరా వంటి భారీ ఫీచర్లతో ఐకూ తీసుకు వచ్చిన బెస్ట్ కర్వ్డ్ డిస్ప్లే 5G స్మార్ట్ ఫోన్ ఈ iQOO Z7 Pro 5G. ఈ ఫోన్ Dimesity 7200 5G ప్రోసెసర్, 8GB RAM, 128GB మరియు 4K video recording వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది.
Price : రూ. 23,850
ప్రముఖ మొబైల్ బ్రాండ్ రియల్ మి తీసుకు వచ్చిన ఈ బడ్జెట్ Curved Display స్మార్ట్ ఫోన్ 120 Hz Curved Display మరియు 100MP ప్రో లైట్ కేమెరా వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ లో 67W UPERVOOC ఫాస్ట్ ఛార్జ్, Dimensity 7050 5G ప్రొసెసర్, ప్రీమియం లెథర్ డిజైన్, 12GB Dynamic RAM వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.
Price : రూ. 23,999
రియల్ మి రీసెంట్ గా విడుదల ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ 120Hz Super AMOLED Curved Display మరియు 100 MP OIS కెమేరాతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ 12GB + 12GB డైనమిక్ ర్యామ్, 67W UPERVOOC ఫాస్ట్ ఛార్జ్, Dimensity 7050 5G ప్రొసెసర్, ప్రీమియం లెథర్ డిజైన్ వంటి ఫీచర్లను కలిగి వుంది.
Price : రూ. 23,999
ఇన్ఫినిక్స్ ఇండియాలో విడుదల చేసిన సరికొత్త సార్ట్ ఫోన్ Infinix Zero 30 5G కూడా ఈ కేటగిరిలో మంచి ఫోన్ అవుతుంది. ఈ ఫోన్ 6.78 FHD+ 3D Curved AMOLED డిస్ప్లే, 50 MP 4K 60 FPS సెల్ఫీ కెమేరా మరియు 108 MP OIS బ్యాక్ కెమేరా లను కలిగి వుంది. ఈ ఫోన్ Dimensity 8020 ప్రోసెసర్ తో పనిచేస్తుంది మరియు 12 GB Mega RAM మరియు 256 GB భారీ ఇంటర్నల్ స్టోరేజ్ వంటి గొప్ప ఫీచర్లను కలిగి వుంది.
Price : రూ. 23,999
vivo T2 Pro 5G స్మార్ట్ ఫోన్ కూడా ఇటీవలే ఇండియాలో విడుదలై సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ వివో స్మార్ట్ ఫోన్ 3D Curved AMOLED Display, MTK D7200 ప్రోసెసర్, 64 MP OIS Aura Light కెమేరా, 8 GB RAM, 256 GB స్టోరేజ్ 66W ఫ్లాష్ చార్జర్ మరియు Fluorite AG Glass వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది.
Price : రూ. 26,499
వివో లేటెస్ట్ Curved Display ఫోన్ లలో vivo V29e 5G ఫోన్ కూడా ఒకటి. ఈ ఫోన్ 120 Hz 3D Curved Display మరియు 64MP OIS నైట్ పోర్ట్రైట్ కెమేరాతో వస్తుంది. ఈ వివో ఫోన్ చాలా సన్నగా ఆకర్షణీయమైన డిజైన్, Snapdragon 695 ప్రోసెసర్, 8 GB, 50 MP సెల్ఫీ కెమేరా మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లను కలిగి వుంది.
Price : రూ. 27,480
ఈ వివో కర్వ్డ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ Futuristic Anti-glare గ్లాస్ డిజైన్ మరియు 120 Hz 3D Curved POLED డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ లో 64 MP OIS Night కెమేరా, 32 MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి మరియు ఈ ఫోన్ Dimensity 1300 ఫాస్ట్ ప్రోసెసర్ శక్తితో పని చేస్తుంది. అలాగే, Extended RAM 3.0 ఫిచర్ తో పాటు మరిన్ని ఫీచర్లను కలిగి వుంది.
Price : రూ. 21,499
ఇండియన్ మొబైల్ తయారీ కంపెనీ లావా అందించింది బడ్జెట్ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ కూడా ఈ కేటగిరిలో బెస్ట్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ Dimensity 7050 ప్రోసెసర్, 120 Hz Curved AMOLED డిస్ప్లే, 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్, 66W సూపర్ ఫాస్ట్ ఛార్జ్, 50MP క్వాడ్ రియర్ కెమేరా సెటప్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది.
Price : రూ. 21,499
25 వేల కంటే తక్కువ ధరలో రియల్ మి లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ 120 Hz Curved Vision డిస్ప్లే, 100 MP OIS కెమేరా, Dimensity 7050 ప్రోసెసర్, 67W SUPERVOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, 12GB + 12GB డైనమిక్ RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు ప్రీమియం లెథర్ డిజైన్ తో వస్తుంది.
Price : రూ. 29,999
30 వేల ధరలో రియల్ మి తీసుకు వచ్చిన ఈ 5G స్మార్ట్ ఫోన్ 120Hz Curved Vision డిస్ప్లే, 100 W SUPERVOOC మరియు 200MP OIS కెమేరా వంటి భారీ ఫీచర్లను కలిగి వుంది. ఈ స్మార్ట్ ఫోన్ Dimensity 7050 ప్రోసెసర్ పని చేస్తుంది మరియు 12 GB+ 12 GB డైనమిక్ RAM సపోర్ట్ తో పాటు 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.
Price : రూ. 29,999
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో అందించిన మొదటి బడ్జెట్ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ ఇది. ఈ ఫోన్ 120 Hz 3D curved డిస్ప్లే, 108 MP Portrait కెమేరా, 67 W SUPERVOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, Snapdragon 695 ప్రోసెసర్ జతగా 8GB + 8GB ఆడిషనల్ ర్యామ్ ఫీచర్ వంటి మరిన్ని ఫీచర్లను కలిగి వుంది.
Price : రూ. 29,999
ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ 144 Hz 3D Curved pOLED తో వస్తుంది మరియు HDR10+ సపోర్ట్ ను కలిగి వుంది. ఈ ఫోన్ 50 MP OIS కెమేరా, 68W Turbo ఛార్జ్ సపోర్ట్, Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు వంటి ఫీచర్లతో వస్తుంది మరియు Dimensity 8020 ఫాస్ట్ ప్రోసెసర్ పైన పని చేస్తుంది.
ఇప్పటి వరకూ మనం చూసింది 30 వేల లభిస్తున్న Curved Display స్మార్ట్ ఫోన్స్. అయితే, మీ బడ్జెట్ కొంచెం పెంచగలిగితే మరికొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్ అప్షన్ లు కూడా ఉన్నాయి. ఈ అప్షన్ లను కూడా ఇక్కడ చూడవచ్చు.
Price : రూ. 32,999
ఒప్పో రెనో 10 సిరీస్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ 120 Hz 3D Curved డిస్ప్లే, Dimensity 7050 ప్రోసెసర్, 64 MP మైన్, 32 MP Telephoto కెమేరాలు, 67W SUPERVOOC ఫాస్ట్ ఛార్జ్ వంటి టాప్ ఫీచర్లతో పాటుగా Dual Stereo స్పీకర్లను కూడా కలిగి వుంది.
Price : రూ. 36,974
టెక్నో తీసుకు వచ్చిన ఈ కర్వ్డ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ Dual Curved AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ అత్యంత వేగవంతమైన Dimensity 9000 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 8GB LPDDR5 RAM తో పాటుగా UFS3.1 256GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి వుంది.
Price : రూ. 39,999
షియోమి చాలా ప్రీమియం ధరలో తీసుకు వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం 40 వేల ఉప ధరలో లభిస్తోంది. ఈ ఫోన్ 10bit 2K+ Curved AMOLED డిస్ప్లేని Dolby Vision & HDR10+ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ Snapdragon 8 Gen 1 ఫాస్ట్ ప్రోసెసర్, 120W ఫాస్ట్ ఛార్జ్, Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగిన Harman Kardon క్వాడ్ స్పీకర్ సిస్టం వంటి గొప్ప ఫీచర్లను కలిగివుంది.