10,000 ధరలో 2019 బెస్ట్ కెమేరా స్మార్ట్ ఫోన్ల జాబితా

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Jan 03 2020
10,000 ధరలో 2019 బెస్ట్ కెమేరా స్మార్ట్ ఫోన్ల జాబితా

 మీరు కేవలం బడ్జెట్ ధరలో, అంటే కేవలం 10,000 రూపాయల ధరలో ఒక మంచి స్మార్ట్ ఫోన్ను కొనాలని ఆలోచిస్తున్నారా?  ఒక ఫోన్ కొనాలంటే ప్రస్తుత కాలంలో మనం చూడాల్సిన ముఖ్యమైన విషయాలు : ఒక స్మార్ట్ చిప్సెట్, AI- డ్యూయల్ వెనుక కెమెరా, వేలిముద్ర సెన్సార్, స్మార్ట్ బ్యాటరీ మరియు  ఫేస్ అన్లాక్ వంటి గొప్ప ఫీచర్లను జాగ్రత్తగా పరిశీలించాలి. ఇటువంటి ప్రత్యేకతలు కలిగిన,  ఒక మంచి స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేయడానికి అధిక ధరను చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం 10,000 రూపాయల కంటే తక్కువ ధరలో కూడా కొన్ని మంచి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో వున్నాయి. అందుకే, అటువంటి ధరలో కొనుగోలు చేయదగిన  కొన్నిబెస్ట్  స్మార్ట్ ఫోన్లను ఇక్కడ అందిస్తున్నాను.

10,000 ధరలో 2019 బెస్ట్ కెమేరా స్మార్ట్ ఫోన్ల జాబితా

1. REDMI NOTE 8

ఇటీవల, షొప్మి షావోమి సంస్థ విడుదల చేసినటువంటి ఈ రెడ్మి నోట్ 8, 2GHz వద్ద క్లాక్ చేయబడిన, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 665ఆక్టా కోర్  ప్రాసెసర్ శక్తికి జతగా 4GB/6GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 64GB/128GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఇది ఈ దార్లో ఓక్ అతిపెద్ద కెమేరా సెటప్పు కలిగిన స్మార్ట్ ఫోనుగా చెప్పొచ్చు. ఇది వెనుక 48MP+8MP+2MP+2MP క్వాడ్ కెమెరా మరియు 13MP సెల్ఫీ కెమెరాతో పాటుగా ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.9,999 ప్రారంభ ధరతో లభిస్తుంది. 

10,000 ధరలో 2019 బెస్ట్ కెమేరా స్మార్ట్ ఫోన్ల జాబితా

2. REALME 5

రియల్మీ సంస్థ నుండి కేవలం రూ. 8,999 ధరలో క్వాడ్ కెమెరాల సెటప్పుతో, ఇటీవల ఇండియాలో అమ్ముడవవుతున్ననటువంటి ఈ రియల్మీ 5 స్మార్ట్ ఫోన్, ఒక 6.5 అంగుళాల HD+ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో వస్తుంది.  ఇది 2GHz వద్ద క్లాక్ చేయబడిన, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 665 ఆక్టా కోర్  ప్రాసెసర్ శక్తికి జతగా 3GB/4GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 32GB/64GB/128GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఒక మైక్రో SD కార్డు ద్వారా దీని యొక్క మెమొరీని 256GB వరకు పెంచుకోవచ్చు. ఇది ఒక అతిపెద్ద 5,000 mAh బ్యాటరీతో మద్దతునిస్తుంది.

10,000 ధరలో 2019 బెస్ట్ కెమేరా స్మార్ట్ ఫోన్ల జాబితా

3. VIVO U10

వివో నుండి కేవలం బడ్జెట్ ధరలో కొత్తగా వచ్చినటువంటి ఈ స్మార్ట్ ఫోన్, ఒక 6.35 అంగుళాల HD+ నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, వెనుక 13MP+8MP+2MP  ట్రిపుల్ వెనుక కెమెరా మరియు ఒక 5000mAh బ్యాటరీ వంటి లక్షణాలతో బడ్జెట్ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇది 2GHz వద్ద క్లాక్ చేయబడిన, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 665 ఆక్టా కోర్  ప్రాసెసర్ శక్తికి జతగా 3GB/4GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 32GB/64GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఒక మైక్రో SD కార్డు ద్వారా దీని యొక్క మెమొరీని 256GB వరకు పెంచుకోవచ్చు. కేవలం రూ.8,999 రూపాయల ప్రారంభ ధరతో అమ్ముడవుతోంది.

10,000 ధరలో 2019 బెస్ట్ కెమేరా స్మార్ట్ ఫోన్ల జాబితా

4. Motorola One Macro

ఇటీవల భారతదేశంలో మంచి స్పెక్స్ తో, 10,000 రూపాయల కంటే తక్కువధరలో మోటోరోలా  నుండి వచ్చినటువంటి స్మార్ట్  ఫోనుగా, ఈ మోటోరోలా వన్ మ్యాక్రో  గురించి చెప్పొచ్చు. ఇది ఒక 2.0GHz వద్ద క్లాక్ చెయ్యబడిన మీడియ టేక్ హీలియో P70  ఆక్టా కోర్ ప్రొసెసరుతో మంచి పెరఫార్మెన్సు అందిస్తుంది. అలాగే, ఇందులో 13MP +2MP+2MP AI ట్రిపుల్ రియర్ కెమేరా మరియు 8MP గొప్ప సెల్ఫీ కెమెరా మరియు 4000mAh వంటి ప్రత్యేకతలతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఓపెన్ సేల్ తో అందుబాటులో వుంది.

10,000 ధరలో 2019 బెస్ట్ కెమేరా స్మార్ట్ ఫోన్ల జాబితా

5. REDMI NOTE 7s

ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 9 OS తో పనిచేస్తుంది మరియు వెనుక భాగంలో ఒక ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఇది 2.2 GHz వద్ద క్లాక్ చేయబడిన, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660AIE ఆక్టా కోర్  ప్రాసెసర్ శక్తికి జతగా 3GB/4GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 32GB/64GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఇది వెనుక 48MP + 5MP డ్యూయల్ కెమేరా మరియు ముందు 13MP సెన్సారును కలిగి ఉంటుంది. ఈ ఫోన్ను ప్రస్తుతం 8,999 రుపాయల ప్రారంభదరతో కొనవచ్చు.   

10,000 ధరలో 2019 బెస్ట్ కెమేరా స్మార్ట్ ఫోన్ల జాబితా

6. Samsung Galaxy M 30

శామ్సంగ్ తన M సిరీస్ ద్వారా గొప్ప స్పెక్స్ కలిగినటువంటి స్మార్ట్ ఫోన్లను కేవలం బడ్జెట్ ధరలోనే తీసుకొచ్చింది.  కొత్తగా వచ్చిన ఈ శామ్సంగ్ గెలాక్సీ M 30 స్మార్ట్ ఫోన్, ముందుగా మిడ్ రేంజ్ ధరలో అమ్ముడవుతుండగా, ప్రస్తుతం ఇది కేవలం రూ.9,999ప్రారంభదరతో లభిస్తుంది. ఈ ఫోన్ వెనుక 13MP +5MP + 5MP ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరాని కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్  ఒక 6.4 అంగుళాల FHD+ వాటర్ డ్రాప్ నోచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి  అదనంగా,  5000mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది.

10,000 ధరలో 2019 బెస్ట్ కెమేరా స్మార్ట్ ఫోన్ల జాబితా

7. Samsung Galaxy M 10s

శామ్సంగ్ నుండి సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్,  వెనుక ఒక 13MP +5MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెన్సార్ కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ ఒక 6.22 అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో HD రిజల్యూషన్ అందించగల సూపర్ AMOLED వస్తుంది మరియు దీనికి  అదనంగా,  4000mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది. ఈ ఫోన్ సంస్థ యొక్క ఎక్సినోస్ 7884B ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 3GB ర్యామ్ మరియు 32 GB స్టోరేజితో వస్తుంది మరియు దీన్ని కేవలం రూ.7,999 ధరతో కొనవచ్చు.      

10,000 ధరలో 2019 బెస్ట్ కెమేరా స్మార్ట్ ఫోన్ల జాబితా

8. Redmi Y3

షావోమి సంస్థ నుండి కేవలం రూ.9,999 ధరలో 32MP సెల్ఫీ కెమేరాతో ఇండియాలో విడుదల చేయబడినటువంటి, ఈ స్మార్ట్ ఫోన్, 1.8 GHz వద్ద క్లాక్ చేయబడిన,  క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తికి జతగా 3GB/4GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 32GB/64GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఇది 12+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు ఒక 32MP సెల్ఫీ కెమెరాతో పాటుగా ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం కేవలం రూ.8,999 ప్రారంభ ధరతో లభిస్తుంది. 

10,000 ధరలో 2019 బెస్ట్ కెమేరా స్మార్ట్ ఫోన్ల జాబితా

9. Realme 3i 

సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్, ఒక 6.2 అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 13 MP సెల్ఫీ కెమెరా, 13MP+2MP  డ్యూయల్ వెనుక కెమెరా మరియు ఒక పెద్ద 4230mAh బ్యాటరీ వంటి లక్షణాలతో బడ్జెట్ ధరతో కేవలం రూ. 7,999 ప్రారంభ దరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

10,000 ధరలో 2019 బెస్ట్ కెమేరా స్మార్ట్ ఫోన్ల జాబితా

10. XIAOMI MI A2

షావోమి నుండి ముందుగా వచ్చిన ఈ కెమేరా ఫోన్, స్మార్ట్ ఫోన్ 2160 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 FHD+ ఫుల్ వ్యూ డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక స్నాప్ డ్రాగన్ 660AIE ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక 3010 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది. వెనుక భాగంలో 12MP +20MP  డ్యూయల్  కెమేరా సేటప్పుతో మరియు ముందు 20MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఇది ప్రస్తుతం రూ.9,999 భదరతో లభిస్తోంది.