Netflix, అమెజాన్ Prime Video లేదా డిస్నీ+ హాట్‌స్టార్ కావచ్చు, OTT ప్లాట్‌ఫారమ్ ఏదైనా లేటెస్ట్ మరియు మల్టీ లాంగ్వేజ్ ల్లో చూడగలిగే కంటెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. మీరు మీ ఇంట్లో కూర్చొనే మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కోసం వెతుకుతున్నట్లయితే లేదా ఈ కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను ఇంకా చూడకపోతే, మీరు వీటిని మిస్సవ్వకండి. పైన పేర్కొన్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లు కాకుండా, ఈ షోలు Zee5, MX ప్లేయర్ మొదలైన వాటిలో కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఇప్పుడు OTT లో ఉర్రుతలూగిస్తున్న టాప్ బెస్ట్ Shows, సినిమాలు మరియు వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందామా.
పుష్ప: ది రైజ్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో విడుదల చేయబడింది. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు అడవుల్లో దొరికే ఎర్రచందనం విదేశీ స్మగ్లింగ్ చేసే వృత్తాంతం పైన సాగే చిత్రమిది. కూలీగా పనిచేస్తూ నెం.1 స్మగ్లర్‌గా మారిన ఓ వ్యక్తి కథ ఇది.
ఇది బాహుబలి వంటి పెద్ద సినిమాలను నిర్మించిన Arka Media తీసుకొచ్చిన సూపర్ సిరీస్. ఇది పరంపర మొదటి సీజన్ మాత్రమే తీసుకొచ్చిన మరియు ఈ సీజన్ చూసిన ప్రతిఒక్కరూ రెండవ సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఒకే కుటుంభంలో జరిగే సున్నితమైన విషయాల గురించి చూపించారు. ఇందులో, జగపతి బాబు, శరత్ కుమార్ మరియు ఆమని వంటి పెద్ద తారాగణం నటించారు.
The Family Man 2
అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ వెబ్ సిరీస్‌లలో ది ఫ్యామిలీ మ్యాన్ 2 కూడా ఒకటి. మొదటి సీజన్‌లో, మనోజ్ బాజ్‌పేయిని శ్రీకాంత్ తివారీగా అందరూ స్వీకరించారు మరియు తరువాతి సీజన్ కూడా అందరూ మెప్పుపొందే ఆసక్తి గల కథనంతో ముగిసింది. మొదటి సీజన్ లాగే రెండో సీజన్ లో కూడా ఫ్యామిలీ మేన్ ప్రేక్షకులను నిరాశ పరచలేదు.
2022 క్యాంపస్ డైరీస్ (Campus Diaries) వెబ్ సిరీస్‌లో, చండీగఢ్ ఎక్సెల్ యూనివర్శిటీ యొక్క ఫన్నీ స్టోరీ చూపబడింది. ఈ కథలో 6 మంది స్నేహితులను చూపించారు. ఈ సిరీస్ మీకు మీ కాలేజీ రోజులను గుర్తు చేస్తాయి. ఇందులో, ర్యాగింగ్, సామాజిక హోదా ఆధారంగా వివక్ష, వన్ సైడ్ లవ్ స్టోరీలు, డ్రగ్స్ వంటి అంశాలు చూపించారు.
సీజన్ 1 చూసినప్పటి నుండి ప్రజలు సుస్మితా సేన్ యొక్క Aarya season 2 కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే అనుకున్నట్లుగానే గత సంవత్సరంతో సీజన్ 2 విడుదలైంది. ఆర్య సీజన్ 2 ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ సీరియల్ ఆర్య యొక్క మొదటి సీజన్ కథకు పోడిగింపు. ఈ సిరీస్ లో ఆర్య (సుస్మితా సేన్) తన భర్త మరణం తర్వాత నేర ప్రపంచంలోకి బలవంతంగా ప్రవేశిస్తుంది.
అయితే, మనీ హీస్ట్ అనేది ప్రజల అభిమాన సిరీస్, అయితే కొరియా యొక్క కొత్త షా స్క్విడ్ గేమ్ (SQUID Game) ప్రజలపై తనదైన ముద్ర వేసింది. ఇది 2021లో ఎక్కువగా చర్చనీయాంశమైన షోలలో ఒకటిగా నిలిచింది. బాగా డబ్బు అవసరం ఉన్న వ్యక్తులను ట్రాప్ చేయడంతో మొదలైన కథ చివరికి ఘోరమైన గేమ్‌కు దారి తీస్తుంది.
ఈ ది ఎంపైర్ (The Empire) వెబ్ సిరీస్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ భారతదేశంలో మొఘలుల ఆవిర్భావాన్ని గురించి వర్ణిస్తుంది. సమర్కంద్ మరియు అతని తండ్రి చూపిన కల వైపు వెళుతూ బాబర్ భారతదేశాన్ని ఎలా జయించటానికి వస్తాడు అనేది ఈ కథలో చూపబడింది.
'ది హౌస్' ఒక డార్క్ కామెడీ చిత్రం. ఈ కథ ముగ్గురు వ్యక్తుల నిజజీవిత కధనాల గురించి చెప్పబండి. Nexus స్టూడియోస్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ జనవరి 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.
ఇది హిందీ క్రైమ్ థ్రిల్లర్ మరియు జనవరి 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సిరీస్ అధికార దోపిడీని గురించి చూపుతుంది. ఒక రాజకీయ నాయకుడి కుమార్తె ఒక వ్యక్తిని వెంబడించడం మరియు అతనిని తన సొంతం చేసుకోవడానికి ఏదైనా చెయ్యడానికి వెనకాడకపోవడాన్నిఈ కథ వర్ణిస్తుంది.
'హ్యూమన్' అనేది డ్రగ్ ట్రయల్ ఆధారిత సిరీస్ మరియు ఇది జనవరి 14 నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నుండి ప్రసారం చేయబడుతోంది. ప్రజలపై చేసే అక్రమ డ్రగ్ ట్రయల్స్ గురించి చెప్పేదే దీని కథ. ఈ వెబ్ సిరీస్‌లో, విశాల్ జెత్వా, రామ్ కపూర్, సీమా బిస్వాస్, ఆదిత్య శ్రీవాస్తవ్ మరియు మోహన్ అగాషేతో పాటు షెఫాలీ షా మరియు కీర్తి కుల్హారీ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.